కుందన్ లాల్ సైగల్
(కె.ఎల్.సైగల్ నుండి దారిమార్పు చెందింది)
కుందన్ లాల్ సైగల్ | |
---|---|
సైగల్ , జమున దేవదాస్ (1935) సినిమాలో
| |
వ్యక్తిగత సమాచారం | |
జననం | జమ్ము, జమ్మూ కాశ్మీరు | 1904 ఏప్రిల్ 11
మరణం | 1947 జనవరి 18 జలంధర్, పంజాబ్ (బ్రిటిష్ ఇండియా) | (వయసు 42)
సంగీత రీతి | నేపధ్య గాయకుడు |
వృత్తి | గాయకుడు, నటుడు |
వాయిద్యం | గాయకుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1932–1947 |
కుందన్ లాల్ సైగల్ (ఆంగ్లం : Kundan Lal (K.L.) Saigal) ( జ: ఏప్రిల్ 11, 1904 జమ్మూ – మ: జనవరి 18, 1947 ) జలంధర్ భారతీయ గాయకుడు, నటుడు. ఇతడు బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ గా పరిగణింపబడుతాడు. సైగల్ కాలంలో బాలీవుడ్ కు కలకత్తా కేంద్రంగా వుండేది, ప్రస్తుతం ముంబాయి కేంద్రంగా ఉంది.
జీవితం
[మార్చు]సైగల్ తన 42వ యేటనే మరణించాడు. మరణానికి ముందు అనేక హిట్ సినిమాలు అందించాడు. నౌషాద్ సంగీత దర్శకత్వంలో నిర్మింపబడిన సినిమా షాజహాన్ ( 1946 ) సూపర్ హిట్ అయ్యింది. జబ్ దిల్ హీ టూట్ గయా, హమ్ జీకే క్యా కరేఁ హిందీ పాటల మకుటంలో మణి.
తన పదునైదు ఏండ్ల ప్రస్థానంలో సైగల్ 36 సినిమాలలో నటించాడు - 28 హిందీ/ఉర్దూ, 7 బెంగాలీ,, ఒక తమిళ సినిమా. ఇవే కాకుండా హిందీ/ఉర్దూ హాస్యభరిత సినిమా ఐన దులారీ బీబీ (3 రీళ్ళు) లో నటించాడు, ఈ సినిమా 1933లో విడుదల అయింది.