జి.టి. దేవెగౌడ
గుంగ్రల్‌ఛత్ర తమ్మేగౌడ దేవెగౌడ (జననం 1949) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చాముండేశ్వరి శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2018 మే 23 నుండి 2019 జూలై 23 వరకు ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పని చేశాడు.
గుంగ్రాలఛత్ర తమ్మేగౌడ దేవెగౌడ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2013 | |||
ముందు | ఎం. సత్యనారాయణ | ||
---|---|---|---|
నియోజకవర్గం | చాముండేశ్వరి | ||
ఉన్నత విద్యా మంత్రి[1]
| |||
పదవీ కాలం 2018 మే 23 – 2019 జూలై 23 | |||
ముందు | బసవరాజ రాయరెడ్డి | ||
తరువాత | సి.ఎన్. అశ్వత్ నారాయణ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గుంగ్రల్‌ఛత్ర[2] | 1949 నవంబరు 25||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
జీవిత భాగస్వామి | కె. లలిత | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుజి.టి. దేవెగౌడ 1970లలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత జనతాదళ్ (సెక్యులర్) పార్టీలో చేరి వివిధ హోదాల్లో పని చేసి 2013 శాసనసభ ఎన్నికలలో చాముండేశ్వరి శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సిద్దరామయ్యపై 7,103 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సిద్దరామయ్యపై 36,042 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[4][5][6] 2018 మే 23 నుండి 2019 జూలై 23 వరకు ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పని చేశాడు.
జి.టి. దేవెగౌడ 2023 శాసనసభ ఎన్నికలలో చాముండేశ్వరి శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్. సిద్దెగౌడపై 25,500 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7]
మూలాలు
మార్చు- ↑ KLA, Members. "Karnataka Legislative Assembly".
- ↑ Birth Place, GTD's. "Karnataka cabinet: GT Devegowda's profile – Oneindia News". Retrieved 29 June 2018.
- ↑ Mint (9 May 2018). "G.T. Deve Gowda: The David challenging Goliath Siddaramaiah". Archived from the original on 23 January 2021. Retrieved 17 November 2024.
- ↑ The Hindu (15 May 2018). "JD(S) breaks into Congress bastion in Mysuru district" (in Indian English). Archived from the original on 12 July 2024. Retrieved 17 November 2024.
- ↑ The Times of India (5 May 2023). "Chamundeshwari Constituency Election Results". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.