సుధా మల్హోత్రా

వికీపీడియా నుండి
03:02, 21 నవంబరు 2024 నాటి కూర్పు. రచయిత: స్వరలాసిక (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search
Sudha Malhotra
సంగీత రీతి Playback
క్రియాశీలక సంవత్సరాలు 1954–1982

సుధా మల్హోత్రా (జననం 1936 నవంబర్ 30) ఒక భారతీయ నేపథ్య గాయని. ఆమె కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. ఈమె నేపథ్య గాయనిగా 1950-60 దశకాలలో ఆర్జూ, ధూల్ కా ఫూల్, అబ్ ఢిల్లీ డోర్ నహీ, గర్ల్ ఫ్రెండ్, బర్సాత్ కీ రాత్, దీదీ , దేఖ్ కబీరా రోయా వంటి ప్రముఖ బాలీవుడ్ చిత్రాలలో పనిచేసింది. ఆమె చివరిసారిగా రాజ్ కపూర్ యొక్క ప్రేమ్ రోగ్ (1982) లో "యే ప్యార్ థా యా కుచ్ ఔర్ థా" పాట పాడింది. హిందీ పాటలతో పాటు, మల్హోత్రా అనేక ప్రసిద్ధ మరాఠీ పాటలను (అరుణ్ దాతేతో కలిసి భావగీతాలు) పాడింది. 2013లో భారత ప్రభుత్వం ఈమెకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.[1]

ప్రారంభ జీవితం, విద్యాభ్యాసం

సుధా మల్హోత్రా న్యూఢిల్లీలో ఒక పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది. ఈమె బాల్యం లాహోర్, భోపాల్, ఫిరోజ్పూర్ లలో గడిచింది. ఈమె నలుగురు తోబుట్టువులలో పెద్దది. మె ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో గ్రాడ్యుయేషన్ చేసింది.

వృత్తి

మల్హోత్రాను బాల కళాకారుణిగా గులాం హైదర్ (1940ల ప్రముఖ సంగీత దర్శకుడు) కనుగొన్నారు. ఈమె ఆర్జూ చిత్రంలో అడుగుపెట్టింది. వ్యాపారవేత్త గిరిధర్ మోట్వానీ (ఆమె కుటుంబానికి చెందిన చికాగో రేడియో మైక్ కంపెనీ) తో వివాహం తరువాత ఈమె 1960లో చిత్ర పరిశ్రమ నుండి విరమించింది. తరువాతి సంవత్సరాల్లో ఆమె జగ్జిత్ సింగ్ యొక్క ఇన్ ఎ మూడ్ ఆఫ్ లవ్ తో సహా కొన్ని ఆల్బంల కోసం పాడింది. ఈమె 1982లో రాజ్ కపూర్ యొక్క ప్రేమ్ రోగ్ కోసం కూడా పాడింది. ఆమె ప్రసిద్ధ మరాఠీ పాటలలో కొన్ని (భావగీతాలు)-"శుక్రతారా మాండ్వారా", "హాత్ తుజా హాటాత్" , "దివాస్ తుజే హే ఫులాయ్చే", ఇవన్నీ అరుణ్ దాతేతో యుగళగీతాలు. ఈమె 155 చిత్రాలలో 264 పాటలు పాడింది.

వ్యక్తిగత జీవితం

మల్హోత్రా గిరిధర్ మోట్వానీని వివాహం చేసుకున్నది. ఆయన కుటుంబానికి చికాగో రేడియో ఉంది.[2] ఈమె వివాహం తరువాత, గీత రచయిత సాహిర్ లుధియాన్వి తో ఈమె కలిసి ఉన్న ఛాయాచిత్రాలు బ్లిట్జ్ పత్రికలో ప్రచురించబడ్డాయి. ఆమె పదేపదే వారి మధ్య సంబంధాన్ని ఖండించింది, తరువాత, బ్లిట్జ్ క్షమాపణను ప్రకటించింది. మల్హోత్రా వివాహం ఖరారు అయినప్పుడు లుధియాన్వి చలో ఏక్ బార్ ఫిర్ సే పాట రాశారని నమ్ముతారు.

ఫిల్మోగ్రఫీ

  • ఆర్జూ
  • అబ్ ఢిల్లీ డోర్ నహీ
  • గర్ల్ ఫ్రెండ్
  • దేఖ్ కబీరా రోయా (1957)
  • ధూల్ కా ఫూల్ (1959)
  • బర్సాత్ కీ రాత్ (1960)
  • గౌహర్
  • దిల్-ఎ-నాదన్ (1953)
  • బాబర్
  • దీదీ.
  • ప్రేమ్ రోగ్ (1982)

సూచనలు

  1. "Padma Awards Announced" (Press release). Ministry of Home Affairs. 25 January 2013. Retrieved 27 January 2013.
  2. ""Kashti Ka Khamosh Safar Hai" - Sudha Malhotra".

బాహ్య లింకులు

మూస:Padma Shri Award Recipients in Art