ఫ్రీడం ఆఫ్ గెష్ గాట్ ఫ్రీడ్

వికీపీడియా నుండి
03:06, 21 నవంబరు 2024 నాటి కూర్పు. రచయిత: Purushotham9966 (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
Jump to navigation Jump to search

"ఫ్రీడం ఆఫ్ గెష్ గాట్ ఫ్రీడ్" జర్మనీ సినిమా, దర్శకుడు Rainer werner Fassbinder(1945-1982), ఇతను జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ప్రపంచ యుద్ధకాలంలో జన్మించాడు. బాల్యం సరళంగా సాగలేదు, చాలా ఆటంకాలు, ఇబ్బందులనడుమ తుంటరి పిల్లావాడు అని పేరుపడ్డాడు. చిన్నప్పటినుంచి సినిమా పిచ్చి. జర్మనీలో తలెత్తిన "New German Cinima" ఉద్యమానికి నాయకుడు. నాటకాలు, సినిమాలు, స్క్రీన్ ప్లే రచయత కూడా. ఫాస్ బిందర్ తన సినిమాలలో స్త్రీల హక్కులు, స్వేచ్ఛ గురించి ఎక్కువగా పట్టించుకొన్నాడు. "ఫ్రీడం ఆఫ్ గెష్ గాట్ ఫ్రీడ్" సినిమాలో కూడా ఆయన ఈ వస్తువునే తీసుకొన్నాడు. సమాజంలో పురుషాధిక్యాన్ని, పురుషాహంకారాన్ని సున్నితంగా చూపుతాడు. గెష్ గాట్ ఫ్రీడ్ భర్త, తర్వాత ఆమె జీవితంతో సంబంధం ఉన్న పురుషులు-తల్లీతండ్రి, సోదరుడు అంతా ఆమె స్వాతంత్రేచ్ఛను నిరసిస్తారు, ఆలోచించే ఆలిని భర్త భరించలేడు, పురుషుడిమాదిరి స్వతంత్రంగా వ్యాపారం నిర్వహించుకొంటూ, ఆమె జీవించడం ఎవరూ సహించలేరు. ఆమె జీవితం పాపపంకిలం అనీ, మతవిశ్వాసాలకు వ్యతిరేకమని అంటారు. ఒకడు ఆమెతో సహజీవనం చేస్తాడు, కానీ ఆమె తొలిభర్తకు పుట్టిన సంతానంతో కలిసి జీవించడం సహించలేడట! ఆమె తృప్తిగా శరీరసుఖం అనుభవించాలని, బిడ్డలకు జన్మనిచ్చి సంసారజీవితం సాగించాలని కోరుకొంటుంది. తన ఇష్టాలను నిస్సంకోచంగా చెప్తే ఏ పురుషుడూ భరించలేడు, ఆమెలా ఆలోచించే, తమకన్న మానసికంగా పరిపూర్ణత పొందిన స్త్రీని భరించలేడు ఏ పురుషుడూ. తాను యిష్టపడిన పురుషుడికి భార్యగా ఉండాలని ఆమె అలమటిస్తుంది. చివరకు ఎల్లో ఫీవర్ తో మృత్యుముఖంలో ఉన్న వ్యక్తిని చేసుకొంటుంది.

దాసీగా, బానిసగా, భార్యగా సహాజీవనం చేసిన గెష్ గాట్ ఆర్థిక స్వేచ్చ అంటే ఏమిటో గ్రహిస్తుంది. తన స్వేచ్ఛను, స్వతంత్రాన్ని హరించడానికి ప్రయత్నించిన వాళ్ళను చంపి ఆమె అడ్డుతొలగించుకొంటుంది. దర్శకుడు ఈ సినిమా టెలివిషన్ ను దృష్టిలో ఉంచుకొని తీశాడు. పాత్రల ప్రతి కదలిక నాటకీయంగా (highly stylised) ఉంటాయి, రంగస్థలం మీద లాగా. నేపధ్యంలో తెరమీద సముద్రం సమయాన్ని, సందర్భాన్నిబట్టి రంగులు మార్చుకొంటూ ఉంటుంది. నేపధ్య సంగీతం లేదు. ప్రతిసారీ గెష్ గాట్ కాఫీలో విషం కలిపి ఇచ్చే సమయంలో మాత్రం సంగీతం వినిపిస్తుంది, ప్రేక్షకులు ఆ అంశాన్ని గుర్తిస్తారు. ఆసంగీతంతో పాటు నేపధ్యంలో అప్పుడప్పుడు శిశువు ఏడుపు, గెష్ గాట్ తో సహజీవనంచేసే పురుషులు ఆ రోదనను భరించలేరు. పాపను ఊరుకోబెట్టమని కసురుతారు. మాతృత్వం కోసం ఆమె తపించడం, ఆవిడ తల్లికావడం సహించలేని ఆమె ప్రియులూ. చివరకు ఆమె ఇద్దరు బిడ్డలు చనిపోయినట్లు సూచనగా తెలుస్తుంది. ఆర్థిక స్వావలంబన, స్వేచ్ఛ తన సంతోషానికి, ఆనందానికి అసలు కారణం అని ఆమె అంగీకరిస్తుంది. ఈ సినిమాలో మతం కుడా స్త్రీని అణచిపెట్టడానికి సాధనం అయినట్లు సూచించాడు దర్శకుడు. గెష్ గాట్ పాత్రధారిణి నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ తిరుగుబాటుచిత్రం మొత్తం closeupలతో సాగుతుంది. 37 ఏళ్ల చిన్న జీవితంలో ఇరవయి సినిమాలపయినే తీశాడు ఫాస్ బిందర్.(Rainer werner Fassbinder)

మూలాలు: ఫాస్ బిందర్ సినిమాలు, అతనిమీద వెలువడిన సాహిత్యం.