అబ్దుల్ ఖాదిర్ జీలాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊహాత్మక చిత్రణ

షేక్ అబ్దుల్ ఖాదిర్ అల్-జీలానీ Shaikh 'Abd al-Qadir al-Jilani (పర్షియన్, ఉర్దూ : عبد القادرگیلانی, అరబ్బీعبد القادر الجيلانى ) (ఇంకనూ 'అబ్దుల్ ఖాదర్', 'అబ్ద్ అల్-ఖాదిర్', - జీలానీ, జిలానీ, గీలానీ, గిలానీ, జైలానీ, గైలానీ, అనీ పలుకుతారు) (1077 - 1166), ఇతను ప్రఖ్యాత సున్నీ ముస్లిం, సూఫీ, షేఖ్, సయ్యద్, హంబలీ పండితుడు. ఇతను ఖాదరియా పాఠశాలను (పీఠం) స్థాపించాడు. భారతదేశంలో ఈ పాఠశాలకు చెందినవారు కోట్లకొలదీ గలరు. ఇతను ఇరాన్ లోని గీలాన్ అనే పట్టణంలో రంజాన్ నెలలో జన్మించాడు. గీలాన్ లో పుట్టాడు కావున గీలానీ అనే పేరూ వచ్చింది. ఇతను జునైద్ బగ్దాదీ ఆత్మజ్ఞాన పరంపరకు చెందినవాడు.

ఇతనికి గల బిరుదులు

[మార్చు]
  • "గౌస్-ఎ-ఆజమ్" (మహోన్నత ఆధ్యాత్మిక సహాయకుడు).
  • బడే పీర్ (పెద్ద గురువు)
  • పీరానే పీర్ (గురువులకే గురువు)
  • దస్తగీర్ (చేయి పట్టి మార్గదర్శకం చేయు వాడు)
  • గౌస్-ఎ-పాక్ (సత్యమైన సహాయకుడు)
  • సర్దార్-ఎ-ఔలియా (వలీ లందు సర్దార్)

జీవిత చరిత్ర

[మార్చు]

అబ్దుల్ ఖాదిర్ ఇస్లామీయ ప్రవక్త ఐన మహమ్మదు ప్రవక్త వంశానికి చెందినవాడు. తల్లి పెంపకంలో పెద్దవాడయ్యాడు. ఇతని తండ్రి అబూ సాలెహ్, హసన్ ఇబ్న్ అలీ వంశంనుండి, తల్లి హుసేన్ ఇబ్న్ అలీ వంశంనుండి వచ్చారు. తన 18వ ఏట 1095 లో బాగ్దాద్కు విద్యార్జన కొరకు బయలు దేరాడు. అబూ సయ్యద్ అలీ అల్-ముకర్రమీ నుండి ఫిఖహ్ జ్ఞానాన్నీ, అబూబక్ర్ బిన్ ముజప్ఫర్ నుండి హదీసుల జ్ఞానాన్నీ, అబూ ముహమ్మద్ జాఫర్ నుండి తఫ్సీర్ జ్ఞానాన్నీ అర్జించాడు.

సూఫీ తత్వంలో ఇతని గురువు షేక్ అబుల్-ఖైర్ హమ్మాద్ బిన్ ముస్లిం అల్-దబ్బస్. ఇతని ద్వారా తత్వజ్ఞానం పొందిన తరువాత తన సూఫీ యాత్రను కొనసాగించాడు. తన విద్యాభ్యాసం పూర్తయిన తరువాత బాగ్దాదు నగరాన్ని వదలి, ఇరవై ఐదు సంవత్సరాలు ఇరాక్ లోని ఎడారి ప్రాంతాలలో తిరుగుతూ అల్లాహ్ను పొందే మార్గాలను అన్వేషించసాగాడు.[1] తన యాభై అయిదవ యేట తిరిగి బాగ్దాదు నగరానికి వచ్చాడు. ప్రజలలో తిరుగుతూ, ఇస్లాం తత్వాన్ని, సూఫీ తత్వాన్ని ప్రజలకు బోధించసాగాడు. తన గురువుగారి పాఠశాలలో ప్రవేశించి బోధించసాగాడు. ఉదయసమయాన హదీసులు, తఫ్సీర్ లను, మధ్యాహ్న సమయాలలో ఖురాన్లో గల 'తసవ్వుఫ్' (దివ్యజ్ఞానాన్ని) బోధించ సాగాడు.

హి.శ. 521 నుండి 561 వరకూ ఇస్లాం సేవలో గడిపాడు. తాను ఎన్నో సమూహాలను తయారుచేసి ఇతర ప్రదేశాలకు తబ్లీగ్ కొరకు పంపాడు. 1128 లోభారత ఉప ఖండాన్ని సందర్శించాడు. ప్రస్తుత పాకిస్తాన్ లోని ముల్తాన్ లోనూ బస చేశాడు.

సా.శ. 1156 లో, (హి.శ. రబీఉల్ అవ్వల్ నెల, 8వ తేదీన, శనివారం రాత్రి), 89 సంవత్సరాల వయస్సులో మరణించాడు, ఇతనిని బాగ్దాదు లోని తన మదరసా లోనే ఖననం చేశారు.[2][3]

కార్యాలు

[మార్చు]

ఇతని ముఖ్యమైన రచనలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • అల్-గునియ లీ-తాలిబి తారీఖ్ అల్-హక్ వ అల్-దీన్ (సత్యం, మత మార్గాన్వేషులకు సరైన మార్గదర్శకాలు)
  • అల్-ఫతహ్ అర్-రబ్బానీ (పరమేశ్వర విజయం)
  • మల్ఫూజాత్
  • ఫుతూహ్ అల్-గైబ్ (కానరాని విజయాలు)
  • జలా అల్-ఖాతిర్

ఇతని సంస్మరణలు

[మార్చు]

ఇతని సంస్మరణార్థం, ప్రపంచంలోని పలు దేశాలలోని ముస్లింలు, ఇతని పేరుతో ఉర్స్ కార్యక్రమాలు, "గ్యారహ్-వీం ఫాతెహా"లు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల ముఖ్య ఘట్టాలు, గొర్రెలు లేదా మేకలను కోసి, చక్కటి ఆహార పదార్థాలను తయారు చేసి, పేదలతో సహపంక్తి భోజనాలు, అన్నదాన కార్యక్రమాలు, బంధుమిత్ర సమీకరణలూ , ఫాతెహా విందు కార్యక్రమాలూ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక విశేషమేమనగా ఈ ఉత్సవాలలో హిందూ-ముస్లిం సోదరులు కలసి ఈ ఫాతెహా కార్యక్రమాలను అమిత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. హిందూ-ముస్లిం తారతమ్యత అసలే కనపడని "సమైక్యతా" కార్యక్రమాలివి.

మూలాలు

[మార్చు]
  1. Abd-al-Haqq, Akbar, p.11
  2. Majid 'Ursan al-Kilani, Nash'at al-Tariqat al-Qadiriyah
  3. The Qadirya Shrine, Baghdad Archived 2009-03-02 at the Wayback Machine (PDF)

పుస్తకాలు

[మార్చు]
  • Utterances of Shaikh Abd al-Qadir al-Jīlānī (Malfūzāt) / transl. from the Arabic by Muhtar Holland Malfūzāt

Author: Muhtar Holland (1935-) Year: 1994, Publisher: Kuala Lumpur : S. Abdul Majeed & Co, ISBN 1-88221-603-2

  • Fifteen letters, khamsata ashara maktūban / Shaikh Abd Al-Qādir Al-Jīlānī ; translated from the Persian into Arabic by Alī usāmu ́D-Dīn Al-Muttaqī ; and from Arabic into English by Muhtar Holland, Kamsata ašara maktūban

Author: ʿAlāʾ al-Dīn ʿAlī b. ʿAbd al-Malik al- Muttaqī al-Hindī (ca1480-1567) ; Muhtar Holland (1935-) Year: c1997 Edition: 1st ed Publisher: Hollywood, Fla : Al-Baz Pub ISBN 1-88221-616-4

  • The removal of cares = Jalā Al-Khawātir : a collection of forty-five discoures / Shaikh Abd Al-Qādir Al-Jīlānī ; transl. from the Arabic by Muhtar Holland

Jalā al-Khawātir Author: Muhtar Holland (1935-) Year: c1997 Publisher: Ft. Lauderdale, Fla : Al-Baz Pub Extent: xxiii, 308 p Size: 22 cm ISBN 1-88221-613-X

  • The Sultan of the saints : mystical life and teachings of Shaikh Syed Abdul Qadir Jilani / Muhammad Riaz Qadiri

Author: Muhammad Riyaz Qadiri Year: 2000, Publisher: Gujranwala : Abbasi Publications, Size: 22 cm, ISBN 969-851016-8

  • The sublime revelation = al-Fath ar-Rabbānī : a collection of sixty-two discourses / Abd al-Qādir al- Jīlānī ; transl. from the Arabic by Muhtar Holland, al-Fath al-Rabbānī

Year: 1998 Edition: 2nd ed, Publisher: Ft. Lauderdale : Al-Baz Publishing, ISBN 1-88221-602-4

సమకాలీన అల్-జీలానీ వంశం

[మార్చు]

'మీర్' వంశాలు, 'హబష్' వంశాలు, కుటుంబాలు ప్రపంచంలో పలుచోట్ల గలవు.

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]