ఎపిస్టాక్సిస్
ఎపిస్టాక్సిస్ | |
---|---|
ఇతర పేర్లు | రక్తం కారుతున్న ముక్కు , ముక్కు రక్త స్రావం , ముక్కు హేమరేజ్ |
ముక్కులో రక్తస్రావంతో మూడు ఏళ్ల పిల్లవాడు | |
ఉచ్చారణ |
|
ప్రత్యేకత | ఓటోరినోలారిన్జాలజీ |
లక్షణాలు | ముక్కు నుండి రక్తం కారడం |
సాధారణ ప్రారంభం | పదేళ్ల లోపు , 50 సంవత్సరాల పైన |
ప్రమాద కారకములు | గాయం, రక్తాన్ని పలుచన చేసేవి, అధిక రక్తపోటు, మద్యపానం, కాలానుగుణ అలెర్జీలు, పొడి వాతావరణం |
రోగనిర్ధారణ పద్ధతి | ప్రత్యక్షంగా పరీక్షించడం |
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | హెమోప్టిసిస్ఊ లేదా పిరితిత్తుల నుండి రక్తస్రావం, ఎసోఫాగియల్ వేరిస్ |
నివారణ | పెట్రోలియం జెల్లీ వాడడం |
చికిత్స | ముక్కు ముందు భాగంలో ఒత్తిడి, నాసల్ ప్యాకింగ్, ఎండోస్కోపీ |
ఔషధం | ట్రానెక్సామిక్ యాసిడ్ |
తరుచుదనము | 60% ఎదో ఒక సమయం లో |
మరణాలు | అరుదు |
ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుండి రక్తస్రావం జరిగే శరీర పరిస్థితి. దీనిని ముక్కు నుండి రక్త స్రావం లేదా రక్తం కారడం అని కూడా పిలుస్తారు[1]. రక్తం కడుపులోకి కూడా ప్రవహించి వికారం, వాంతులకు కారణమవుతుంది[2]. మరింత తీవ్రమైన సందర్భాల్లో రెండు నాసికా రంధ్రాల నుండి రక్తం రావచ్చు[3]. అరుదుగా రక్తస్రావం చాలా ఎక్కువగా ఉండవచ్చు, రక్తపోటు తగ్గవచ్చు[1]. అరుదుగా రక్తం నాసోలాక్రిమల్ వాహిక పైకి వచ్చి కంటి నుండి బయటకు వస్తుంది[4].
సమస్యలు
[మార్చు]ముక్కులో వేలు దూర్చడం వలన ఏర్పడిన గాయం, రక్తం పలుచబడటం, అధిక రక్తపోటు, మద్యపానం, కాలానుగుణంగా వస్తుండే అలెర్జీలు, పొడి వాతావరణం, కార్టికోస్టెరాయిడ్లను పీల్చడం వంటివి ప్రమాద కారకాలు. ఈ ముక్కు రక్తస్రావంలో రెండు రకాలు ఉన్నాయి - అవి పూర్వ రక్తస్రావం, పృష్ఠ రక్తస్రావం, ఇది అరుదుగా సంభవిస్తుంది కానీ మరింత తీవ్రమైనది[5]. పూర్వ ముక్కు రక్తస్రావం సాధారణంగా కీసెల్బాచ్ ప్లెక్సస్ (నాసికా రంధ్రాలను వేరుచేసే విభాజకం (సెప్టం)కు సరఫరా చేసే ముక్కులోని నాలుగు లేదా ఐదు ధమనుల నెట్వర్క్ - ప్లెక్సస్) నుండి సంభవిస్తుంది, అయితే పృష్ఠ రక్తస్రావం తరచుగా స్ఫెనోపాలటైన్ ధమని నుండి సంభవిస్తుంది[5]. రోగ నిర్ధారణ సాధారణంగా ప్రత్యక్ష పరిశీలన ద్వారా జరుగుతుంది [1].
నివారణ, చికిత్స
[మార్చు]ఈ సమస్యకు నివారణగా ముక్కులో పెట్రోలియం జెల్లీని వాడుతారు[6]. ప్రారంభంలో చికిత్సగా సాధారణంగా ముక్కు ముందు భాగంలో కనీసం ఐదు నిమిషాలు ఒత్తిడి చేయడం ఉంటుంది. ఇది సరిపోకపోతే నాసికా ప్యాకింగ్ ఉపయోగించవచ్చు[7]. ట్రానెక్సామిక్ ఆమ్లం కూడా సహాయపడవచ్చు [8]. రక్తస్రావం కొనసాగితే ఎండోస్కోపీ సిఫార్సు చేస్తారు[7].
వ్యాప్తి
[మార్చు]దాదాపు 60% మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ముక్కు నుండి రక్తస్రావం సమస్యకి గురిఅవుతారు. సుమారు 10% మందిలో ముక్కు నుండి రక్తం రావడం అనే సమస్య తీవ్రంగా ఉంటుంది[9]. ముక్కు కారడం అనేది ప్రాణాంతకం అవడం అరుదు. 1999లో అమెరికాలో జరిగిన 24 లక్షల మరణాలలో ఈ సమస్యతో మరణించిన వారు నాలుగు మంది.[10] ముక్కు నుండి రక్తం కారడం అనేది సాధారణంగా 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని, 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది[11].
సూచనలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Ferri, Fred F. (2013). Ferri's Clinical Advisor 2014 E-Book: 5 Books in 1 (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 399. ISBN 978-0-323-08431-4. Archived from the original on 2021-08-28. Retrieved 2020-04-13.
- ↑ Wilson, I. Dodd (1990). Walker, H. Kenneth; Hall, W. Dallas; Hurst, J. Willis (eds.). Clinical Methods: The History, Physical, and Laboratory Examinations (3rd ed.). Boston: Butterworths. ISBN 978-0409900774. PMID 21250251. Archived from the original on 2019-12-15. Retrieved 2018-01-29.
- ↑ Krulewitz, NA; Fix, ML (February 2019). "Epistaxis". Emergency Medicine Clinics of North America. 37 (1): 29–39. doi:10.1016/j.emc.2018.09.005. PMID 30454778.
- ↑ Riordan-Eva, Paul (2000). Vaughan and Asbury's General Ophthalmology (in ఇంగ్లీష్). McGraw Hill Professional. p. 92. ISBN 978-0-07-137831-4.
- ↑ 5.0 5.1 (January 2020). "Epistaxis (Nose Bleed)".
- ↑ Morgan, Daniel J.; Kellerman, Rick (March 2014). "Epistaxis". Primary Care: Clinics in Office Practice. 41 (1): 63–73. doi:10.1016/j.pop.2013.10.007. ISSN 0095-4543. PMID 24439881.
- ↑ 7.0 7.1 Tunkel, David E.; Anne, Samantha; Payne, Spencer C.; Ishman, Stacey L.; Rosenfeld, Richard M.; Abramson, Peter J.; Alikhaani, Jacqueline D.; Benoit, Margo McKenna; Bercovitz, Rachel S.; Brown, Michael D.; Chernobilsky, Boris; Feldstein, David A.; Hackell, Jesse M.; Holbrook, Eric H.; Holdsworth, Sarah M.; Lin, Kenneth W.; Lind, Meredith Merz; Poetker, David M.; Riley, Charles A.; Schneider, John S.; Seidman, Michael D.; Vadlamudi, Venu; Valdez, Tulio A.; Nnacheta, Lorraine C.; Monjur, Taskin M. (7 January 2020). "Clinical Practice Guideline: Nosebleed (Epistaxis) Executive Summary". Otolaryngology–Head and Neck Surgery. 162 (1): 8–25. doi:10.1177/0194599819889955. PMID 31910122.
- ↑ Joseph, Jonathan; Martinez-Devesa, Pablo; Bellorini, Jenny; Burton, Martin J (2018-12-31). Cochrane ENT Group (ed.). "Tranexamic acid for patients with nasal haemorrhage (epistaxis)". Cochrane Database of Systematic Reviews (in ఇంగ్లీష్). 12: CD004328. doi:10.1002/14651858.CD004328.pub3. PMC 6517002. PMID 30596479.
- ↑ Wackym, James B. Snow,... P. Ashley (2009). Ballenger's otorhinolaryngology : head and neck surgery (17th ed.). Shelton, Conn.: People's Medical Pub. House/B C Decker. p. 551. ISBN 9781550093377.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Work Table I. Deaths from each cause by 5-year age groups, race and sex: US, 1999" (PDF). CDC. 2011. p. 1922. Archived (PDF) from the original on 14 October 2021. Retrieved 13 April 2020.
- ↑ Kucik, Corry J.; Clenney, Timothy (2005-01-15). "Management of epistaxis". American Family Physician. 71 (2): 305–311. ISSN 0002-838X. PMID 15686301.