జగదీష్ నాయర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగదీష్ నాయర్

పదవీ కాలం
2019 – 2024
ముందు ఉదయ్ భాన్
తరువాత హరీందర్ సింగ్
నియోజకవర్గం హోడాల్

పదవీ కాలం
2009 – 2014
ముందు ఓం ప్రకాశ్ చౌతాలా
తరువాత ఉదయ్ భాన్
నియోజకవర్గం హోడాల్

పదవీ కాలం
1996 – 2000
ముందు రామ్ రత్తన్
తరువాత ఉదయ్ భాన్
నియోజకవర్గం హసన్‌పూర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

జగదీష్ నాయర్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జగదీష్ నాయర్ హర్యానా వికాస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996 శాసనసభ ఎన్నికలలో హసన్‌పూర్ నుండి హెచ్‍విపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఉదయ్ భాన్‌పై 5,570 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆ తరువాత ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలో చేరి 2000 ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్ భాన్‌ చేతిలో 4,855 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. జగదీష్ నాయర్ 2000 ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్ భాన్‌ చేతిలో 5,331 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

జగదీష్ నాయర్ 2009 శాసనసభ ఎన్నికలలో హోడాల్ నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్ భాన్‌పై 2,621 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్ భాన్‌ చేతిలో 11,680 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

జగదీష్ నాయర్ 2019 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో హోడాల్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్ భాన్‌పై 3,387 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 October 2024). "Haryana's Hodal conundrum: Will end of 28-year-old rivalry favour Congress or BJP?" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  2. The Tribune (15 September 2024). "Hodal to miss 28-yr-old poll rivalry between Bhan, Nayar" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  3. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. TV9 Bharatvarsh (8 October 2024). "होडल विधानसभा सीट पर जीते BJP के हरिंदर सिंह रामरतन, कांग्रेस प्रदेश अध्यक्ष चौधरी उदयभान को दी शिकस्त". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)