Jump to content

జిమ్ కార్బెట్

వికీపీడియా నుండి
జిమ్ కార్బెట్

జిమ్ కార్బెట్ (25 జూలై, 1875 - 19 ఏప్రిల్, 1955) అని పిలువబడే ఎడ్వర్డ్ జేమ్స్ కార్బెట్ భారతదేశంలో జన్మించిన ఐర్లండు సంతతి వాడైన ప్రముఖ రచయిత, వేటగాడు, జంతు సంరక్షకుడు అయిన అధికారి. భారతదేశంలోని జాతీయ వనం, రక్షిత ప్రాంతం ఐన కార్బెట్ నేషనల్ పార్క్‌కు ఈయన పేరు పెట్టడం జరిగింది. మనుషులను వేటాడే ఎన్నో పులులను చంపి, ఎన్నో ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా ప్రసిధ్ధుడు.

తొలి రోజులు

[మార్చు]

హిమాలయాల అడుగున కుమవన్ ప్రాంతానికి చెందిన నైనిటాల్లో క్రిస్టఫర్, మేరీ జేన్ కార్బెట్లకు ఎనిమిదవ సంతానంగా జన్మించాడు. ఓక్ ఓపనింగ్స్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ కళాశాల, డయోసెస్ బాయ్స్ స్కూల్ మొదలైన్ చోట్ల విద్యాభ్యాసం చేశాడు. తరువాత ఉత్తర పశ్చిమ రైల్వేలో ఇంధన పర్యవేక్షకునిగా (ఫ్యూయల్ ఇన్స్పెక్టర్) పంజాబ్లో మనక్పూర్ అనే ఊర్లో పనిచేశాడు.

పులులు

[మార్చు]

తొలినాళ్ళలో కార్బెట్‌కు వేట, చేపలు పట్టడం వ్యాపకాలుగా ఉండేవి. కాని తరువాతి రోజుల్లో వన్యమృగాలను వేటాడం కాక కెమెరాలతో వాటి చిత్రాలను తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు. కేవలం మనుషులకు, పశుసంపదకు ప్రాణభయం కలిగించిన మృగాలను మాత్రమే వేటాడాడు. 1907, 1938ల మధ్యలో అలాంటివి కనీసం పన్నెండు పెద్దపులులను, చిరుతపులులను అంతమొందించాడు. వాటిని చంపక ముందు కనీసం 1,500 మందిని అవి బలిగొన్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఛంపవత్‌లో ఈయన చంపిన ఆడ పులి కనీసం 438 మందిని చంపి తిన్నట్టు ఆధారలున్నాయి. అలాగే ఈయన చంపిన పనార్ చిరుతపులి 400 మందిని బలిగొంది. రుద్రప్రయాగ్ చిరుతపులిగా పేరుపడిన ఓ మృగము పదేళ్ళకు పైగా హిందూ పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాధ్, బద్రీనాథ్‌ల ప్రజలను భయభ్రాంతుల్ని చేసి చివరకు కార్బెట్ తూటాలకు బలైంది. ఇవికాక తల్లా-దేశ్ పులి, థక్ పులి, మోహన్ పులి, చౌఘర్ పులి మొదలైన ఎన్నో మృగాలను వేటాడి ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రాణభయం పోగొట్టాడు. పులులను అవి సంచరించిన, వధింపబడిన ప్రాంతాల పేర్లతో పిలవడం ఆయన అలవాటు.

పర్యావరణ, జంతు సంరక్షణ పనులు

[మార్చు]

అటవీ సంపద, పర్యావరణ, జంతు సంరక్షణ వంటి అంశాలపై ప్రజలను ఉత్తేజితుల్ని చేయాటానికి పాఠశాలల్లోనూ, సదస్సుల్లోనూ ప్రసంగాలతో ఎంతో కృషి చేశాడు. జంతు సంరక్షణ శాఖనూ, అఖిల భారత జంతు సంరక్షణ సదస్సునూ స్థాపించడానికి తోడ్పడ్డాడు. భారతదేశపు మొట్టమొదటి జాతీయ వనమైన హెయిలీ జాతీయ వనాన్ని జిమ్ కార్బెట్ స్మృత్యర్థం కార్బెట్ జాతీయ వనంగా పేరు మార్చారు. కుమవన్‌ పర్వత ప్రాంతమన్నా, అక్కడి ప్రజలన్నా ఆయనకి ఎంతో అభిమానం. అక్కడి ప్రజలు కూడా ఆయన్ని ఒక సాధువుగా భావించేవారు.

కెన్యాలో నివాసం,విశేషాలు

[మార్చు]

1947 తరువాత కార్బెట్, ఆయన సోదరి మ్యాగీ కెన్యాలోని నైరీ అనే ప్రాంతంలో స్థిరపడి, రచనలు చేస్తూ, పర్యావరణ, జంతు సంరక్షణ గురించి విచారిస్తూ శేష జీవితాన్ని గడిపారు. అక్కడే 1955లో గుండెపోటుతో మరణించారు. నైరీలోని సెయింట్ పీటర్స్ ఏంగ్లికన్ చర్చిలో ఆయన భౌతికకాయాన్ని సమాధి చేశారు.

ఆయన మీద గౌరవముతొ ప్రభుత్వమువారు ఒక జాతీయ ఉద్యానవనమునకు (NATIONAL PARK) నకు జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనము (JIM CORBETT NATIONAL PARK) అని పేరు పెట్టినారు. ఈ జాతీయ ఉద్యానవనమునకు సంభందించిన వెబ్ సైటు ఈ కింద ఇచిన లింక్ తొ వెళ్ళ్వచును.

https://web.archive.org/web/20080312001152/http://www.jimcorbettnationalpark.com/ సమాధి చేశారు. ఏంగ్లికన్ చర్చిలో ఆయన భౌతికకాయాన్ని Archived 2021-06-17 at the Wayback Machine

రచనలు

[మార్చు]
  • మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమవన్ (1944) MAN EATERS OF KUMAON
  • ది మ్యాన్ ఈటింగ్ లెపర్డ్ ఆఫ్ రుద్రప్రయాగ్ (1948) THE MAN EATING LEOPARD OF RUDRAPRAYAG
  • మై ఇండియా (1952) MY INDIA
  • జంగిల్ లోర్ (1953) JUNGLE LORE
  • ది టెంపుల్ టైగర్ అండ్ మోర్ మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమవన్ (1954) THE TEMPLE TIGER AND MORE MAN EATERS OF KUMAON
  • ట్రీ టాప్స్ (1955) TREE TOPS

మూలాలు

[మార్చు]