Jump to content

టైటిల్ పాట

వికీపీడియా నుండి

టైటిల్ సాంగ్ అనగా ఒక సినిమా లేదా దూరదర్శిని ధారావాహికలలో పేరుకు సరిపడినట్లుగా పెట్టే ఒక పాట.

టైటిల్ సాంగ్ ను కొన్ని సినిమాలలో టైటిల్స్ తో బాటు బాగ్రౌండ్ లో ఆడియో మాత్రమే నడిపిస్తే, మరికొన్నింటిలో ఆడియో, వీడియో చిత్రాలతో లేదా ఆర్ట్ వర్క్ తోబాటు చూపించేవారు.

కొన్ని టైటిల్ సాంగ్స్

[మార్చు]
  • కలసి ఉంటే కలదు సుఖం (1961) లో అదే పేరుతో ఒక పాటను ఘంటసాల, సుశీల గానం చేశారు. అన్నదమ్ములు విడిపోయిన తర్వాత వారి జీవితాలు ఎలా కష్టాల పాలయ్యాయో ముందుగానే ఊహించి చిత్రించిన సందేశాత్మక గీతం కలసివుంటే కలదు సుఖం పాట.
  • ఇల్లరికం (1959) లోని ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే అనే పాట హాస్య ధోరణిలో ఈ వ్యవస్థలోని లోటుపాట్లను తెలియజేస్తుంది.
  • సీతారామ కళ్యాణం (1961) సినిమాలోని సీతారాముల కళ్యాణం చూతము రారండీ అనే పాట బహుళ ప్రాచుర్యం పొందిన పాట.
  • లవకుశ (1963) సినిమాలో లేరు కుశలవుల సాటి సరి వీరులో ధారుణిలో పాటను సముద్రాల రాఘవాచార్య రచించగా. లవకుశులు రాముడి అశ్వమేథ యాగానికి చెందిన అశ్వమును బంధిస్తారు. రాముని సోదరులు, సైన్యం అందరూ అశ్వాన్ని విడిపించడానికి వచ్చి లవకుశులతొ యుద్ధం చేసి ఓడిపోతారు. ఆ సమయంలో లవకుశులు ఈ విధంగా గానం చేస్తారు.
  • జయహే కృష్ణావతారా పాటను శ్రీకృష్ణావతారం (1967) చిత్రం కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు. ఇందులో శ్రీకృష్ణుని లీలలను చిత్రీకరించారు.
  • జీవన తరంగాలు (1973) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అనే పాటను అద్భుతంగా చిత్రికరించి ప్రజాదరణ పొందినది. ఇందులో ఒక తల్లిదండ్రులకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు చెడు తిరుగుళ్ళతో పాడైపోతే కూతురు ఇంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. జీవితాంతం కష్టాలతో ఇంటిని చక్కదిద్దిన తల్లి చనిపోతుంది. భర్త ఆసుపత్రిలో ఉంటాడు. చివరికి పాడెను మొయ్యడానికి కూడా కొడుకు రాడు. అందువలనే పల్లవికి ముందు ఉపోద్ఘాతం ఇలా మొదలుపెట్టాడు: పదిమాసాలు మోసావు పిల్లలను : బ్రతుకంతా మోసావు బాధలను : ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు
  • కొత్త కాపురం (1975) సినిమాలోని కాపురం కొత్త కాపురం పాట.
  • ఎదురీత (1977) సినిమా లోని ఎదురీతకు అంతం లేదా పాట.
  • ఇంటింటి రామాయణం (1979) సినిమా లోని ఇంటింటి రామాయణం... వింతైన ప్రేమాయణం... కలిసుంటే సల్లాపము … విడిపోతె కల్లోలము పాట.