Jump to content

విద్యుత్ కేంద్రం

వికీపీడియా నుండి
దక్షిణ ఆఫ్రికా, కేప్ టౌన్ లో అత్లోన్ పవర్ స్టేషను.
గబ్కికొవొ ఆనకట్ట, స్లోవేకియా వద్ద జలవిద్యుత్ కేంద్రము.

విద్యుత్ కేంద్రం అనగా విద్యుత్ శక్తి ఉత్పత్తి కొరకు ఏర్పరచుకున్న ఒక పారిశ్రామిక సౌకర్యం. దీనిని ఉత్పత్తి స్టేషను, పవర్ ప్లాంట్, పవర్ హౌస్ లేదా ఉత్పాదక ప్లాంట్ గా కూడా సూచిస్తారు.[1] [2] [3] దాదాపు అన్ని విద్యుత్ కేంద్రాల వద్ద ఒక జెనరేటర్, అయస్కాంత క్షేత్రం, కండెక్టర్ మధ్య సాపేక్ష చలనం సృష్టించడం ద్వారా యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఒక తిరిగే యంత్రం ఉంటాయి. ఇది ప్రధానంగా తగినంత చౌకగా, సులభంగా అందుబాటులో ఉన్న ఇంధనాలపై ఆధారపడి ఉంటుంది, సాంకేతిక పరిజ్ఞానం యొక్క రకాలపై పవర్ కంపెనీ యాక్సెస్ కలిగి ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక విద్యుత్ కేంద్రాలు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయడానికి బొగ్గు, చమురు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలను మడిస్తున్నాయి, కొన్ని అణుశక్తిని ఉపయోగిస్తున్నాయి, ప్రస్తుతం సౌర, పవన, తరంగ, జలవిద్యుత్ వంటి శుభ్రమైన పునరుత్పాదక వనరుల యొక్క వినియోగం ఎక్కువవుతోంది.

తాప విద్యుత్ కేంద్రము

[మార్చు]

థర్మల్ పవర్ స్టేషను లేదా తాప విద్యుత్ కేంద్రము అనగా ఒక విద్యుత్ కేంద్రం, దీనిలో ప్రధాన కదలిక ఆవిరిచే నడుస్తుంది. నీరు వేడి చేసినప్పుడు ఆవిరి గా మారి ఆవిరి టర్బైన్ ను తిప్పుతుంది, ఇది విద్యుత్ జనరేటర్‌ను నడుపుతుంది. తర్వాత ఆవిరి టర్బైన్ ద్వారా వెనుక్కు మళ్ళుతుంది, ఈ ఆవిరి ఒక కండెన్సర్‌లో ఘనీకృతమవుతుంది, అది వేడెక్కి రీసైక్లింగ్ అవుతుంది; ఈ విధానాన్ని రాంకిన్ చక్రం అంటారు. తాప విద్యుత్ కేంద్రములు రూపకల్పనలో చాలా వైవిధ్యంగా ఉంటాయి, దీనికి కారణం సాధారణంగా నీటిని వేడి చేయడానికి ఉపయోగించే వివిధ శిలాజ ఇంధన వనరులు. కొంతమంది దీనికి శక్తి కేంద్రమనే పదాన్ని ఉపయోగించడానికి ఇష్టపడతారు, ఎందుకంటే దీనిలో వేడి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి సౌకర్యాలుంటాయి.

మూలాలు

[మార్చు]
  1. British Electricity International (1991). Modern Power Station Practice: incorporating modern power system practice (3rd ed.). Pergamon. ISBN 0-08-040510-X.
  2. Babcock & Wilcox Co. (2005). Steam: Its Generation and Use (41st ed.). ISBN 0-9634570-0-4.
  3. Thomas C. Elliott; Kao Chen; Robert Swanekamp (coauthors) (1997). Standard Handbook of Powerplant Engineering (2 ed.). McGraw-Hill Professional. ISBN 0-07-019435-1.