Jump to content

సమీర్ నస్రీ

వికీపీడియా నుండి
సమీర్ నస్రీ
2012 లో నస్రీ
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరు సమీర్ నస్రీ[1]
జనన తేదీ (1987-06-26) 1987 జూన్ 26 (వయసు 37)[2]
జనన ప్రదేశం సెప్టెమెస్ లెస్ వల్లోన్స్, ఫ్రాన్స్
ఎత్తు 1.75 మీటర్లు[3]
ఆడే స్థానం అటాకింగ్ మిడ్ఫీల్డర్
క్లబ్ సమాచారం
ప్రస్తుత క్లబ్ R.S.C. Anderlecht
సంఖ్య 14
యూత్ కెరీర్
సంవత్సరాలు జట్టు
1995–1997 పెన్నెస్ మిరాబు
2008–2011 ఆర్సెనల్ 86 (18)
2011–2017 మాంచెస్టర్ సిటీ 124 (18)
2016–2017 → సేవిల్లా (అప్పు) 23 (2)
2017–2018 అంతళ్యస్పోర్ 8 (2)
2019 వెస్ట్ హమ్ యునైటెడ్ 5 (0)
జాతీయ జట్టు
Years Team Apps
2002–2003 ఫ్రాన్స్ యు16 16 (8)
2003–2004 ఫ్రాన్స్ యు17 16 (6)
2004–2005 ఫ్రాన్స్ యు18 4 (0)
2005–2006 ఫ్రాన్స్ యు19 10 (5)
2006–2007 ఫ్రాన్స్ యు21 4 (0)
2007–2013 ఫ్రాన్స్ 41 (5)
† Appearances (Goals).

సమీర్ నస్రీ (జననం 1987 జూన్ 26) ఫ్రెంచ్ ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆటగాడు. అతను ప్రస్తుతం బెల్జియన్ క్లబ్ ఆండర్లెచ్ట్ కోసం ఆడుతున్నాడు. అతను సెంట్రల్ మిడ్‌ఫీల్డ్‌లో కూడా మోహరించబడ్డప్పటికీ, ప్రధానంగా అటాకింగ్ మిడ్‌ఫీల్డర్, వింగర్‌గా ఆడతాడు. డోపింగ్ ఉల్లంఘన కారణంగా అతన్ని 2019 జనవరి వరకు, పద్దెనిమిది నెలలపాటు, ఫుట్‌బాల్ నుండి తాత్కాలికంగా తొలగించారు.

నస్రీ డ్రిబ్లింగ్, బంతి నియంత్రణ, పాసింగ్ సామర్ధ్యానికి ప్రసిద్ది చెందాడు. [4] [5] అతన్ని "అతని దూరదృష్టి, ఊహాశక్తి వలన ప్రత్యర్థులు అంచనా వెయ్యలేని స్థాయిలో ఉంటాడు" అని వర్ణించారు. [6] అతని ఆట శైలి, సామర్థ్యం, సాంస్కృతిక నేపథ్యం ఫ్రెంచ్ లెజెండ్ జినిదిన్ జిదానేతో పోలికలను చూపించాయి. [7] [8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సమీర్ నస్రీ, అల్జీరియన్ సంతతికి చెందిన ఫ్రెంచ్ జాతీయులకు, మార్సెయిల్ ఉత్తర శివారు ప్రాంతమైన సెప్టోమ్స్-లెస్-వాలన్స్లో జన్మించాడు. [9] [10] అతని తల్లి వాసిలా బెన్ సాద్, తండ్రి అబ్దేల్హాఫిద్ నస్రీ - ఇద్దరూ ఫ్రాన్స్‌లో జన్మించారు. అతని తండ్రి మార్సెయిల్లో పుట్టి పెరిగాడు. అతని తల్లి సమీపంలోని సలోన్-డి-ప్రోవెన్స్ లో పెరిగారు. [11] నస్రీ తాతలు అల్జీరియా నుండి ఫ్రాన్స్‌కు వలస వచ్చారు. [12] అతని తల్లి గృహిణి; తండ్రి గతంలో బస్సు డ్రైవర్‌గా పనిచేసి, తరువాతి కాలంలో కొడుకు వ్యక్తిగత మేనేజరుగా మారాడు. తన ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభంలో, ఫ్రాన్స్ అండర్ -16 జట్టుకు ఎంపికైన తరువాత, తన తండ్రి ఇంటిపేరైన నస్రీకి మారడానికి ముందు, అతడు తన తల్లి ఇంటిపేరు బెన్ సాద్ కింద ఆడాడు. [13] అతను నలుగురు పిల్లలలో పెద్దవాడు. ఇస్లాం మతస్థుడే గానీ, మతాచారాలను పాటించడు. [14] నస్రీకి సోనియా అనే చెల్లెలు, వాలిద్, మాలిక్ అనే కవల సోదరులూ ఉన్నారు. నలుగురూ లా గావోట్టే పేరెట్‌లో పెరిగారు. ఇంగ్లాండ్‌లోని ఆర్సెనల్‌లో చేరిన తరువాత, నస్రీ ఉత్తర లండన్ జిల్లా హాంప్‌స్టెడ్‌లో స్థిరపడ్డారు. [15]

క్లబ్ కెరీర్

[మార్చు]

తొలి ఎదుగుదల

[మార్చు]

లా గావోట్టే పేరెట్‌లో పెరిగేటప్పుడు, నస్రీ చిన్న వయస్సులోనే ఫుట్‌బాల్ క్రీడపై ఆకర్షణ పెంచుకున్నాడు. [8] అతను క్రమం తప్పకుండా వీధుల్లో ఆడేవాడు; అక్కడే చాలా నైపుణ్యాలను నేర్చుకున్నాడు. అతని అద్భుతమైన ప్రతిభను గమనించి, తల్లిదండ్రులు అతన్ని స్థానిక క్లబ్‌లో చేర్పించారు. లాగావొట్ పెరేట్ క్లబ్‌లో ఒక సంవత్సరం ఆడాక, ఏడేళ్ల వయసులో సమీప మిరాబెయీ కమ్యూన్ లోని పెన్నెస్ మిరాబెయీ క్లబ్బులో చేరాడు. పెన్నెస్‌లో ఆడుతున్నప్పుడు, మార్సెయిల్ స్కౌట్ ఫ్రెడ్డీ అస్సోలెన్ నస్రీ ప్రతిభను గుర్తించాడు. స్థానికుల నోటి మాట ద్వారా నస్రీ ప్రతిభ గురించి అతడికి తెలిసింది. [10] [16] వ్యక్తిగతంగా నస్రీ నైపుణ్యాన్ని గమనించిన అస్సోలెన్, యువ ఆటగాళ్ళ బృందంతో కలిసి ఇటలీలో ఒక యువ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి నస్రీని పంపించాడు. అక్కడ వారు మిలన్, జువెంటస్ క్లబ్బులకు చెందిన యువ అకాడమీలతో ఆడారు. టోర్నమెంట్‌లో నస్రీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అస్సోలెన్‌తో ఒక మిలన్ స్కౌట్, "అతను [నస్రీ] ఇక్కడే ఉంటాడు, అతన్ని వదిలేసి వెళ్ళండి" అని సరదాగా అన్నాడు. ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చిన తరువాత, మార్సెయిల్ అధికారులు అతడి తండ్రితో ఒక సమావేశమై, తొమ్మిదేళ్ల వయసున్న నస్రీని క్లబ్ అకాడమీలో చేర్చడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

కీర్తి

[మార్చు]

క్లబ్

[మార్చు]

ఆర్సెనల్

  • ఫుట్‌బాల్ లీగ్ కప్ రన్నరప్: 2010–11 [17]

మాంచెస్టర్ సిటీ

అంతర్జాతీయ

[మార్చు]

ఫ్రాన్స్ U17

  • UEFA యూరోపియన్ అండర్ -17 ఛాంపియన్‌షిప్ : 2004

వ్యక్తిగత

[మార్చు]
  • యుఎన్‌ఎఫ్‌పి లిగ్యూ 1 యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : 2006–07 [22]
  • UNFP లిగ్యూ 1 టీం ఆఫ్ ది ఇయర్ : 2006-07 [23]
  • ప్రీమియర్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ : డిసెంబరు 2010 [18]
  • ఫ్రెంచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : 2010 [24]
  • పిఎఫ్ఎ అభిమానుల ప్లేయర్ ఆఫ్ ది మంత్: అక్టోబరు 2010, డిసెంబరు 2010, జనవరి 2011 [25]
  • PFA టీం ఆఫ్ ది ఇయర్ : 2010–11 ప్రీమియర్ లీగ్ [26]
  • బ్రిటిష్ ముస్లిం అవార్డులలో బెస్ట్ ఎట్ స్పోర్ట్ అవార్డుకు ఎంపికైంది : 2013 [27]
  • అలాన్ హర్డేకర్ ట్రోఫీ : 2014 [28]

మూలాలు

[మార్చు]
  1. "Acta del Partido celebrado el 29 de octubre de 2016, en Gijón" [Minutes of the Match held on 29 October 2016, in Gijón] (in Spanish). Royal Spanish Football Federation. Archived from the original on 3 నవంబరు 2016. Retrieved 15 June 2019.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. Hugman, Barry J., ed. (2010). The PFA Footballers' Who's Who 2010–11. Mainstream Publishing. p. 304. ISBN 978-1-84596-601-0.
  3. "Manchester City Profile". Manchester City F.C. 26 August 2011. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 26 August 2011.
  4. Lawrence, Amy (17 August 2008). "Nasri makes an instant impact". The Guardian. London. Retrieved 18 March 2011.
  5. Lacey, David (13 March 2010). "Samir Nasri's dribbling makes him a throwback to days of Matthews". The Guardian. London. Retrieved 18 March 2011.
  6. "Samir Nasri ESPN Bio". ESPN. Retrieved 18 March 2011.
  7. Doyle, Paul (23 March 2007). "Samir Nasri: the new Zidane?". The Guardian. London. Retrieved 3 June 2010.
  8. 8.0 8.1 Lawton, Matt (4 March 2011). "Nasri: We had an argument but Thierry was cool – then I had a problem with Gallas". Daily Mail. UK. Retrieved 19 March 2011.
  9. "Le minot Prodige de Septèmes" (in French). Septèmes-les-Vallons. Retrieved 18 March 2011.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  10. 10.0 10.1 "Petit OM deviendra grand" (in French). Septèmes-les-Vallons. 11 May 2007. Retrieved 18 March 2011.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  11. "Nasri, un Bleu "made in OM"" (in French). RMC Sport. 2 June 2012. Retrieved 2 June 2012.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  12. "Samir Nasri et Tatiana Golovin: "Si demain Tatiana m'apprenait qu'elle attend un enfant ..."". Pure People (in French). 24 February 2010. Retrieved 19 March 2011.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  13. "Samir Nasri fête ses 20 ans" (in French). French Football Federation. 26 June 2007. Retrieved 8 February 2012.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  14. "Samir Nasri: "Je suis musulman, non pratiquant"". Le Buteur (in French). 5 March 2011. Archived from the original on 8 March 2011. Retrieved 27 March 2011.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  15. "Samir Nasri: Gunners midfielder is streets ahead". The Independent. UK. 19 February 2009. Archived from the original on 23 నవంబరు 2010. Retrieved 18 March 2011.
  16. "Samir Nasri to play his 100th!" (in French). Olympique de Marseille. 10 November 2007. Archived from the original on 5 April 2012. Retrieved 18 March 2011.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  17. McNulty, Philip (27 February 2011). "Arsenal 1–2 Birmingham". BBC Sport. Retrieved 28 April 2019.
  18. 18.0 18.1 "Samir Nasri: Overview". Premier League. Retrieved 28 September 2018.
  19. McNulty, Phil (2 March 2014). "Manchester City 3–1 Sunderland". BBC Sport. Retrieved 28 April 2019.
  20. Smith, Ben (12 August 2012). "Chelsea 2–3 Man City". BBC Sport. Archived from the original on 21 January 2016.
  21. McNulty, Phil (11 May 2013). "Man City 0–1 Wigan". BBC Sport. Archived from the original on 12 January 2016.
  22. "Samir Nasri: Arsenal's crown prince".
  23. "Palmarès Trophées UNFP – Oscars du football – Equipe-type de Ligue 1" (in French). Archived from the original on 2017-08-02. Retrieved 2019-12-21.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  24. "ARSENAL MIDFIELDER SAMIR NASRI WINS FRANCE FOOTBALL PLAYER OF THE YEAR AWARD".
  25. "Arsenal's Samir Nasri named PFA Fans' Player of the Month".
  26. "Spurs' Gareth Bale wins PFA player of the year award". BBC Sport. 17 April 2011. Retrieved 24 May 2018.
  27. "Winners honoured at British Muslim Awards". Asian Image. 31 January 2013. Retrieved 1 November 2015.
  28. "Alan Hardaker Trophy".