అక్షాంశ రేఖాంశాలు: 11°23′27″N 79°42′53″E / 11.3908°N 79.7148°E / 11.3908; 79.7148

అన్నామలై యూనివర్సిటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నామలై యూనివర్సిటీ
పరిపాలనా భవనం, ఎయూ
లాటిన్: Universitas Annamalai
ఇతర పేర్లు
Aṇṇāmalai palkalaikkaḻakam
పూర్వపు నామము
శ్రీ మీనాక్షి కళాశాల
నినాదంWith Courage and Faith
రకంస్టేట్ యూనివర్సిటీ (ఇండియా)
స్థాపితం1929; 95 సంవత్సరాల క్రితం (1929)
వ్యవస్థాపకుడుచెట్టినాడ్ రాజా
ఎస్. ఆర్. ఎం. అన్నామలై చెట్టియార్
విద్యాసంబంధ affiliations
ఛాన్సలర్తమిళనాడు గవర్నర్
వైస్ ఛాన్సలర్ఆర్. ఎం. కతిరేసన్[1]
విద్యాసంబంధ సిబ్బంది
2,281[2]
విద్యార్థులు32,480[2]
అండర్ గ్రాడ్యుయేట్లు23,256[2]
పోస్టు గ్రాడ్యుయేట్లు8,067[2]
డాక్టరేట్ విద్యార్థులు
998[2]
స్థానంచిదంబరం, తమిళనాడు, భారతదేశం
11°23′27″N 79°42′53″E / 11.3908°N 79.7148°E / 11.3908; 79.7148
కాంపస్గ్రామీణం, 1500 ఎకరాలు
భాష
రంగులు
               
అథ్లెటిక్ మారుపేరు
  • AU

అన్నామలై విశ్వవిద్యాలయం (తమిళం: அண்ணாமலைப் பல்கலைக்கழகம்; ఆంగ్లం: Annamalai University) భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన చిదంబరంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయం.[3] 1,500 ఎకరాల (6.1 km2) విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్, అగ్రికల్చర్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లలో ఉన్నత విద్యను అందిస్తుంది. ఈ విశ్వవిద్యాలయం దూర విద్య విధానం ద్వారా కూడా 500 కంటే ఎక్కువ కోర్సులను అందిస్తుంది.[4] క్యాంపస్‌లో ఎప్పుడు 32,480 కంటే ఎక్కువ మంది విద్యార్థులతో నిండి ఉండి, ఆసియాలోని అతిపెద్ద యూనిటరీ, టీచింగ్, రెసిడెన్షియల్ యూనివర్శిటీలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది.[5]

జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF), క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్, టైమ్స్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, CWTS లైడెన్ ర్యాంకింగ్, ఇండియా టుడే మ్యాగజైన్, ఇండియా టుడే MDRA, ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE), ARIIA, SCImago ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్‌ల నుండి ర్యాంకింగ్‌లతో సహా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ, ర్యాంక్ పొందిన విశ్వవిద్యాలయాలలో ఇది ఒకటి.

జాతీయ మదింపు, గుర్తింపు సంస్థ (NAAC) ఈ విశ్వవిద్యాలయానికి అక్రిడిటేషన్‌ను ప్రదానం చేసింది. తదనంతరం 2022లో అత్యధిక A+ గ్రేడ్‌ను పొందింది.[6] ఔషధాల అభివృద్ధి, వాతావరణ మార్పులపై దృష్టి సారించి 'సెంటర్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పర్టిక్యులర్ ఏరియా (CPEPA)'ని కలిగి ఉన్న భారతదేశంలోని అగ్ర 18 విశ్వవిద్యాలయాలలో ఈ విశ్వవిద్యాలయం కూడా గుర్తింపు పొందింది.[7]

1929లో స్థాపించబడిన ఇది భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలో 18వ అత్యంత ప్రభావవంతమైన సంస్థగా ర్యాంక్ పొందింది.[8] ఇది దేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యధికంగా గూగుల్ సర్చ్ ఇంజన్ లో శోధించిన విశ్వవిద్యాలయాలలో ఒకటి.[9][10][11]

అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ (AIU), ది అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ యూనివర్సిటీస్ (ACU)లలో దీనికి సభ్యత్వం ఉంది. అన్నామలై యూనివర్శిటీ సెనేట్ ప్రదానం చేసిన అన్ని డిగ్రీలను కామన్వెల్త్ ఫోల్డ్ కింద అన్ని భారతీయ విశ్వవిద్యాలయాలు, విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా గుర్తించాయి.[12][13] ఈ విశ్వవిద్యాలయం SAQS అక్రిడిటేషన్ అందించే AMDISA (దక్షిణాసియాలోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ అసోసియేషన్)లో శాశ్వత సభ్యత్వం కలిగి ఉంది.[14]

చరిత్ర

[మార్చు]

మోంటాగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణల తరువాత ఈ విశ్వవిద్యాలయాన్ని 1929లో వ్యవస్థాపకుడు చెట్టినాడ్ రాజు సర్ సాతప్ప రామనాథ ముత్తయ్య అన్నామలై చెట్టియార్ స్థాపించాడు. 1920ల ప్రారంభంలో, అణగారిన వారికి సేవ చేసేందుకు, తమిళ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి, ఆయన చిదంబరంలో శ్రీ మీనాక్షి కళాశాల, శ్రీ మీనాక్షి తమిళ కళాశాల, శ్రీ మీనాక్షి సంస్కృత కళాశాలలను స్థాపించాడు. 1928లో విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ఆయన తన సంస్థను అప్పగించడానికి స్థానిక ప్రభుత్వంతో అంగీకరించాడు. ఆ విధంగా, 1929 జనవరి 1న అన్నామలై విశ్వవిద్యాలయం, అన్నామలై విశ్వవిద్యాలయ చట్టం 1928 ప్రకారం స్థాపించబడింది.[15] అత్యంత ముఖ్యమైన పరిణామం అన్నమలై యూనివర్సిటీ చట్టం 2013 అమలులోకి వచ్చింది, ఇది భారత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 2013 సెప్టెంబరు 25 నుండి అమల్లోకి వచ్చింది.[16]

ఫ్యాకల్టీలు

[మార్చు]

వ్యవసాయం, నిర్వహణ అధ్యయనాలతో సహా కళలు, దంతవైద్యం (Dentistry), విద్య, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, లలిత కళలు, భారతీయ భాషలు, సముద్ర శాస్త్రాలు (Marine sciences), రాజా ముత్తయ్య వైద్య కళాశాల (వైద్యం), సైన్స్.. ఇలా ఈ విశ్వవిద్యాలయంలో పది ఫ్యాకల్టీలు ఉన్నాయి.[17]

అనుబంధ కళాశాలలు

[మార్చు]

జులై 2021లో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి మిస్టర్ కె. పొన్ముడి అన్నామలై యూనివర్శిటీ హోదాను యూనిటరీ నుండి అనుబంధ విశ్వవిద్యాలయంగా మారుస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విశ్వవిద్యాలయానికి నాలుగు జిల్లాల నుండి అనుబంధంగా కళాశాలలు ఉన్నాయి, అవి కడలూర్, కళ్లకురిచి, మైలాడుతురై, విల్లుపురం.[18] అలాగే మైలాడుతురై జిల్లాలోని మరో 14 కళాశాలలు గతంలో భారతిదాసన్ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్న అన్నామలై విశ్వవిద్యాలయంలో విలీనం చేయబడ్డాయి.[19]

అక్రిడిటేషన్

[మార్చు]

నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) 2022లో అన్నామలై యూనివర్సిటీ "A+" గ్రేడ్‌తో గుర్తింపు పొందింది.[6] అలాగే ఈ విశ్వవిద్యాలయం వ్యవసాయ ఫ్యాకల్టీ ICAR (NAEAB)తో కూడా గుర్తింపు పొందింది.

దూర విద్య

[మార్చు]

డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 1979లో స్థాపించబడింది. ఎంబీఎలతో సహా 500 కంటే ఎక్కువ కోర్సులను అందిస్తుంది. ఇలా అందించే అన్ని అధ్యయన కార్యక్రమాలు దూర విద్యా మండలి (Distant Education Bureau)చే ఆమోదించబడ్డాయి. కాగా బి.ఎడ్ ప్రోగ్రాం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (National Council for Teacher Education) ద్వారా ఆమోదించబడింది.[20]

అన్నామలై విశ్వవిద్యాలయం తన మొదటి అంతర్జాతీయ కార్యాలయాన్ని కెనడాలోని టొరంటోలో 2006లో అన్నామలై కెనడా పేరుతో ప్రారంభించింది. అంటారియో ప్రావిన్స్‌లో దీనికి డిగ్రీ మంజూరు చేసే అధికారం లేనందున, ఇది తమిళ భాష, సాహిత్యం, కళలు, యోగా, నృత్యంలో ప్రోగ్రామ్‌లు, కోర్సుల కోసం అంతర్జాతీయ విద్యార్థులకు రిక్రూట్‌మెంట్ కార్యాలయంగా పనిచేస్తుంది. ఇది బ్యాచిలర్స్, మాస్టర్స్, పిహెచ్‌డిలను అందిస్తుంది. ఇది బ్యాచిలర్స్, మాస్టర్స్, పిహెచ్‌డిలను అన్నామలై యూనివర్శిటీ ప్రధాన క్యాంపస్ ప్రదానం చేసిన డిగ్రీలుగానే అందిస్తుంది.

అన్నామలై విశ్వవిద్యాలయం కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన దూరవిద్యను అందించే భారతదేశపు మొట్టమొదటి, పురాతన విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధిచెందింది.

ప్రముఖ పూర్వ విద్యార్థులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "New Vice-Chancellor takes over at Annamalai University". The Hindu. 24 November 2021.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "University Student Enrollment Details". www.ugc.ac.in. Retrieved 10 February 2020.
  3. "List of State Universities as on 29.06.2017" (PDF). University Grants Commission. 29 June 2017. Retrieved 1 July 2017.
  4. "Distance Education". Annamalai University. March 2013. Archived from the original on 2013-01-18.
  5. "About us: Annamalai University". Archived from the original on 2021-12-16. Retrieved 2023-05-27.
  6. 6.0 6.1 "NAAC gives Annamalai University an A+ grade". The Hindu (in Indian English). 2022-06-22. ISSN 0971-751X. Retrieved 2022-08-12.
  7. "University Grants commission ::Centre with Potential for Excellence in Particular Area". www.ugc.ac.in.
  8. "Annamalai University basks in academic glory institutes globally". The Times of India (in ఇంగ్లీష్). May 17, 2018. Retrieved 2022-08-12.
  9. "5 Indian universities in Google top 20 most searched for". India Today (in ఇంగ్లీష్). September 25, 2014. Retrieved 2022-08-12.
  10. "The 20 most searched universities in the world on Google". Times Higher Education (THE) (in ఇంగ్లీష్). 2014-09-24. Retrieved 2022-08-12.
  11. "5 Indian universities in Google top 20 most searched for; Google search". Engineering, Science & Technology Resources Portal (in ఇంగ్లీష్). 2014-09-27. Retrieved 2022-08-12.
  12. "ACU members". www.acu.ac.uk. Retrieved 2022-12-22.
  13. "MEMBERS | AIU". www.aiu.ac.in. Retrieved 2022-12-22.
  14. "AMDISA Institutional Members - India". www.amdisa.org. Retrieved 2022-10-02.
  15. "1929TN1.pdf" (PDF). laws of India. 21 October 2019. Archived from the original (PDF) on 20 ఆగస్టు 2014. Retrieved 21 October 2019.
  16. "auact2013.pdf" (PDF). Annamalai University. 21 October 2019. Retrieved 21 October 2019.
  17. "Annamalai University Home Page". under Faculties.
  18. Staff Reporter (2021-07-20). "Annamalai University to become an affiliating university". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-04-17.
  19. Krishnamoorthy, R. (2022-04-12). "BDU's territorial jurisdiction shrinks after ceding 14 colleges in Mayiladuthurai to Annamalai University". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-04-17.
  20. "Directorate of Distance Education". www.annamalaiuniversity.ac.in (in ఇంగ్లీష్). Annamalai University. Archived from the original on 2022-03-03. Retrieved 2023-05-30.