అరాగ జ్ఞానేంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరాగ జ్ఞానేంద్ర
అరాగ జ్ఞానేంద్ర


హోం శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 ఆగష్టు 2021
గవర్నరు థావర్ చాంద్ గెహ్లాట్
ముందు బసవరాజు బొమ్మై

కర్ణాటక హోసింగ్ బోర్డు కార్పొరేషన్, చైర్మన్
పదవీ కాలం
28 జులై 2020 – 28 జులై 2021

మైసూర్ పేపర్ మిల్స్, చైర్మన్[1]
పదవీ కాలం
4 జూన్ 2008 – జూన్ 2012

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
ముందు కిమ్మనే రత్నాకర్
నియోజకవర్గం తీర్థహళ్లి
పదవీ కాలం
1994 – 2008
ముందు డి బి చంద్రేగౌడ
తరువాత కిమ్మనే రత్నాకర్
నియోజకవర్గం తీర్థహళ్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1953-03-15) 1953 మార్చి 15 (వయసు 71)
అరాగ
రాజకీయ పార్టీ బీజేపీ
జీవిత భాగస్వామి ప్రఫుల్ల
సంతానం 2
నివాసం గుడ్డేకొప్ప, తీర్థహళ్లి
పూర్వ విద్యార్థి కువెంపు యూనివర్సిటీ
వృత్తి రాజకియ నాయకుడు

అరాగ జ్ఞానేంద్ర కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తీర్థహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో హోం మంత్రిత్వ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

అరాగ జ్ఞానేంద్ర బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1983, 1985, 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున తీర్థహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అరాగ జ్ఞానేంద్ర 1999లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి, 2004లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి 2009, 2013లో ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన తరువాత మైసూర్ పేపర్ మిల్స్ ఛైర్మన్‌గా, కర్ణాటక హోసింగ్ బోర్డు కార్పొరేషన్ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేసి 2018లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో హోం మంత్రిత్వ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "About Us > Management Team". Mpm.co.in. Archived from the original on 16 జూలై 2019. Retrieved 23 July 2019.
  2. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  3. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  4. Eenadu (22 February 2022). "భజరంగ్‌దళ్‌ కార్యకర్త హత్య కేసులో ముగ్గురి అరెస్టు.. హోంమంత్రి వెల్లడి". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.