ఉపగ్రహ విధ్వంసక ఆయుధం
ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలు (అసాట్), వ్యూహాత్మక సైనిక ప్రయోజనాల కోసం ఉపగ్రహాలను నిర్వీర్యం చేసేందుకు లేదా నాశనం చేసేందుకు రూపొందించిన అంతరిక్ష ఆయుధాలు. అనేక దేశాలకు అసాట్ వ్యవస్థ లున్నాయి. యుద్ధాల్లో ఈ ఆయుధాలను ఇప్పటి వరకూ ఉపయోగించనప్పటికీ, కొన్ని దేశాలు తమ అసాట్ సామర్థ్యాలు ప్రదర్శించేందుకు తమ పనిచేయని ఉపగ్రహాలను పేల్చి తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఇప్పటికి అమెరికా, రష్యా, చైనా, భారతదేశాలు మాత్రమే ఈ సామర్ధ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించాయి.
ఇటీవలి పరీక్షలు
[మార్చు]చైనా
[మార్చు]2007 జనవరి 11 న 22:28 UTC కు చైనాకు చెందిన SC-19 క్షిపణి, వారి వాతావరణ ఉపగ్రహం, FY-1C ను విజయవంతంగా ఛేదించింది. వార్‌హెడ్‌లో బాంబు ఏమీ పెట్టలేదు. వార్‌హెడ్ యొక్క గతిశక్తితోనే ఛేదన జరిగింది. [1] FY-1C, 865 కి.మీ. (537 మై.) ఎత్తున ధ్రువ కక్ష్యలో పరిభ్రమిస్తున్న వాతావరణ ఉపగ్రహం. 750 కి.గ్రా. (1,650 పౌ.) బరువున్న FY-1C క్షిపణిని షిచాంగ్ ( 28°14′49″N 102°01′30″E / 28.247°N 102.025°E ) వద్ద ఒక మొబైల్ ట్రాన్స్పోర్టర్-ఎరెక్టర్-లాంచర్ (TEL) వాహనం నుండి ప్రయోగించారు. వార్‌హెడ్ విపరీతమైన వేగంతో ఉపగ్రహాన్ని నేరుగా ఢీకొని దాన్ని నాశనం చేసింది. 2005, 2006, 2010, 2013 [2] లలో కూడా ఈ SC-19 వ్యవస్థను పరీక్షించారని ఆధారాలున్నాయి. అయితే ఏ సంఘటనలో కూడా కక్ష్యలో దీర్ఘకాలం ఉండే శిథిలాలు ఏర్పడలేదు.
2013 మే లో, చైనా ఎగువ అయనావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రీయ పరికరాలను మోసుకెళ్ళే ఒక సబ్ ఆర్బిటాల్ ప్రయోగం చేసినట్లు ప్రకటించింది.[3] అయితే, అమెరికా దీన్ని గ్రౌండ్ ఆధారిత అసాట్ వ్యవస్థ యొక్క మొదటి పరీక్షగా వర్ణించింది.[4] 2018 ఫిబ్రవరి 5 న, డాంగ్ నెంగ్ -3 అనే ఒక ఎగ్జిట్మోస్పెరిక్ బాలిస్టిక్ క్షిపణిని చైనా పరీక్షించింది. అసాట్ ఆయుధంగా ఉపయోగించుకునే సామర్థ్యం దీనికి ఉంది. ఈ పరీక్షలు పూర్తిగా రక్షణాత్మకమని, అవి వాటి లక్ష్యాలను సాధించాయనీ చైనా జాతీయ మీడియా చెప్పింది.[5]
అమెరికా
[మార్చు]2006 డిసెంబరు 14 న USA-193 అనే నిఘా ఉపగ్రహాన్ని అంతరిక్షం లోకి పంపింది. ఒక నెల తరువాత ఉపగ్రహం పనిచెయ్యడం మానేసిందని ప్రకటించారు. అది రోజుకు 500 మీ. చొప్పున కక్ష్య నుండి భూమి వైపుకు పడిపోతోందని 2008 జనవరిలో గమనించారు.[6] 2008 ఫిబ్రవరి 14 న, RIM-161 స్టాండర్డ్ మిస్సైల్ 3 అనే బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణిని ప్రయోగించి దాన్ని నాశనం చెయ్యమని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు.[7]
ఆ ఉపగ్రహంలో 450 కిలోల విషపూరితమైన హైడ్రజీన్ అనే ఇంధనం ఉందని, భూమ్మీద పడిన చోటికి దగ్గరలో ఉన్న వారికి ప్రమాదమనీ ఈ ఉపగ్రహాన్ని కూల్చేసేందుకు అదే ప్రధాన కారణమనీ అమెరికా ప్రభుత్వం చెప్పింది..[8] ఈ ఛేదన విజయవంతమైందని, హైడ్రజీన్ ఇంధన ట్యాంకు ధ్వంసమైనపుడు వచ్చే పేలుడు కనిపించిందనీ ప్రకటించారు.[9]
రష్యా
[మార్చు]2015 నవంబరు 18 న రష్యా PL-19 నుడోల్ అనే క్షిపణిని ప్రయోగించిందని దాన్ని పరిశీలించిన నిపుణులు చెప్పారు.[10] 2016 మే లో, రెండోసారి నుడోల్ను పరీక్షించారు.[11] మరో మూడు పరీక్షలు - 2016 డిసెంబరులో, 2018 మార్చి 26 న, 2018 డిసెంబరు 23 న - జరిపారు..[12][13]
2018 సెప్టెంబరులో మిగ్-31 యుద్ధ విమానంలో అమర్చిన ఓ కొత్త రకం అసాట్ క్షిపణిని గమనించారు..[14][15]
భారతదేశం
[మార్చు]2019 మార్చి 27 న తమ మొదటి ఉపగ్రహ ఛేదక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు భారత దేశం ప్రకటించింది. 300 కిలోమీటర్ల ఎత్తున భూ నిమ్న కక్ష్యలో ఉన్న ఒక పరీక్షాత్మక ఉపగ్రహాన్ని ఈ క్షిపణి జయప్రదంగా ఛేదించింది. ఈ మొత్తం ఆపరేషనుకు కేవలం మూడు నిమిషాలు పట్టింది. ఈ పరీక్ష ఒడిశాలోని చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుండి 05:40 UTC కి జరిగింది. [16] ఈ ఆపరేషనుకు శక్తి అని పేరు పెట్టారు. ఈ క్షిపణి వ్యవస్థను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) - అభివృద్ధి చేసింది. [17] ఈ పరీక్షతో, ఉపగ్రహ వ్యతిరేక క్షిపణి సామర్థ్యాలు కలిగిన నాల్గవ దేశంగా భారత్ ఉద్భవించింది. ఈ సామర్ధ్యం ఒక నిరోధకమేనని, ఏ దేశానికీ వ్యతిరేకంగా చేసింది కాదనీ భారత దేశం ప్రకటించింది.[18][19]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "China silent on satellite killer". Beijing. AFP. 18 January 2007. Archived from the original on 2007-02-10.
- ↑ "Anti-satellite Tests in Space - The Case of China" (PDF). Secure World Foundation. 16 August 2013.
- ↑ "China once again high-altitude scientific exploration test: height higher data more". China News Network. 14 May 2013. Archived from the original on 10 August 2014.
- ↑ Shalal-Esa, Andrea (15 May 2013). "U.S. sees China launch as test of anti-satellite muscle: source". Reuters. Archived from the original on 24 September 2015.
- ↑ Panda, Ankit. "Revealed: The Details of China's Latest Hit-To-Kill Interceptor Test". The Diplomat. Archived from the original on 9 ఫిబ్రవరి 2019. Retrieved 7 ఫిబ్రవరి 2019.
- ↑ "U.S. plans for falling satellite". CNN. 30 January 2008. Archived from the original on 2008-01-31.
- ↑ Associated Press – Broken Satellite Will Be Shot Down Archived 19 ఫిబ్రవరి 2008 at the Wayback Machine
- ↑ "Navy missile hits dying spy satellite, says Pentagon". Cnn.com. 21 ఫిబ్రవరి 2008. Archived from the original on 25 ఫిబ్రవరి 2008. Retrieved 20 ఫిబ్రవరి 2008.
- ↑ "US shoots down toxic satellite". The Daily Telegraph. Sydney. 2008-02-20. Archived from the original on 2008-12-22. Retrieved 2008-02-20 – via news.com.au.
- ↑ "Russia Flight Tests Anti-Satellite Missile". Freebeacon.com. 2 డిసెంబరు 2015. Archived from the original on 4 డిసెంబరు 2015. Retrieved 2 డిసెంబరు 2015.
- ↑ "Russia Flight Tests Anti-Satellite Missile". Freebeacon.com. 27 మే 2016. Archived from the original on 27 జూన్ 2016. Retrieved 23 జూన్ 2016.
- ↑ Podvig, Pavel (2 ఏప్రిల్ 2018). "Successful Nudol ASAT test reported". Russian Strategic Nuclear Forces. Archived from the original on 18 నవంబరు 2018. Retrieved 21 జనవరి 2019 – via russianforces.org.
- ↑ Sheetz, Amanda Macias, Michael (18 జనవరి 2019). "Russia succeeds in mobile anti-satellite missile test: US intelligence report". Cnbc.com. Archived from the original on 20 జనవరి 2019. Retrieved 21 జనవరి 2019.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Russia to field new anti-satellites missiles for MiG-31 interceptor already soon - New Russian weapons". PravdaReport.com. 26 అక్టోబరు 2018. Archived from the original on 2 డిసెంబరు 2018. Retrieved 21 జనవరి 2019.
- ↑ Mizokami, Kyle (1 అక్టోబరు 2018). "Russia's MiG-31 Spotted With Possible Anti-Satellite Missile". Popularmechanics.com. Archived from the original on 2 డిసెంబరు 2018. Retrieved 21 జనవరి 2019.
- ↑ "India shows off tech to 'kill' satellites, will also help tackle high-altitude missiles - Times of India". The Times of India. Retrieved 2019-03-27.
- ↑ "Press Information Bureau". pib.nic.in. Retrieved 2019-03-27.
- ↑ హర్ష్ వాసాని. "ఇండియాస్ యాంటీ-శాటిలైట్ వెపంస్". Thediplomat.com. Archived from the original on 1 జనవరి 2018. Retrieved 27 మార్చి 2019.
- ↑ "India successfully tests anti-satellite weapon: Modi". Theweek.in.