కైకేయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరాముని వనవాసానికి పంపమని దశరథుని కోరుకుతున్న కైకేయి

కైకేయి రామాయణంలో దశరథుని భార్య. పుత్రకామేష్టి యాగం చేసిన తరువాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు భరతుడు జన్మిస్తాడు. తన దాసి అయిన మంథర మాట విని శ్రీరాముని 14 సంవత్సరాలు వనవాసానికి పంపమని, భరతునికి రాజ్యాభిషేకం జరిపించమని దశరథుని కోరుకుంటుంది. ఇందువలన సీతారాముల వనవాసానికి ప్రధాన కారకురాలయింది.

కైకేయి వరాలు

[మార్చు]

దశరథుడు ఒకసారి యుద్ధానికి వెళుతూ చిన్నభార్య కైకను వెంటతీసుకు వెళతాడు. యుద్ధరంగంలో రథానికి ఇరుసు పడిపోయిన తరుణంలో కైకేయి తన వేలిని ఇరుసుగా చేసి దశరథునికి రక్షణ కలిగిస్తుంది. దశరథుడు కృతజ్ఞతగా ఆమెను రెండు వరాలను కోరుకొమ్మని చెప్తాడు. కైకేయి తనకు అవసరమని అనిపించినప్పుడు వరాలను కోరుకుంటానని చెబుతుంది. మంథర ఆ వరాలను కైకకు గుర్తుచేస్తూ వాటిని ఉపయోగించి రాముని పట్టాభిషేకం ఆపి భరతునికి పట్టం కట్టమని చెప్తుంది. కైకేయి ఆమె బోధలు విని అలాగే చేస్తుంది.

  • రాముని పట్టాభిషేకం రద్దుచెయ్యాలి దాని బదులుగా భరతునికి పట్టాభిషేకం చేయ్యాలి.
  • శ్రీరామున్ని 14 సంవత్సరాలు వెంటనే వనవాసానికి పంపించాలి.

శ్రీరాముడి వనవాసం

[మార్చు]

రామాయణంలో శ్రీరాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి, మహాభారతం లోని సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండు సంవత్సరాలు వనవాసానికి, తరువాత సంవత్సరం అజ్ఞాతవాసం చేయడం, ఈ నియమం యాజమాని ఆధీనంలో భూమిపై (రాజ్యం పైన) హక్కు కలిగి ఉండే సమయం అయితే రామాయణం సమయంలో కృతయుగం 14 సంవత్సరాలు, మహాభారతం సమయంలో ద్వాపర యుగం 13 సంవత్సరాలు, ఇప్పుడు కలియుగమున 12 సంవత్సరాలు యాజమాని ఆధీనంలో భూమిపై లేక దూరంగా ఉన్నచో అట్టి ఆస్తిపై శాశ్వతంగా హక్కును కోల్పోతారు, అందుకే శ్రీరామున్ని 14 సంవత్సరాలు వనవాసానికి వెంటనే పంపించింది.

యుద్ధ అనంతరం

[మార్చు]

శ్రీరాముడు రావణుని వధించిన తరువాత పైలోకాల నుండి దిగి వచ్చిన దశరథుడు తన మరణానికి కారణం దేవతలే అని, దేవతల ప్రేరణ వల్లనే కైకేయి వరాలను అడిగిందని వివరిస్తాడు. అలాగే అగ్నిపరీక్షకు లోనైన సీతమ్మను ఓదారుస్తాడు. శ్రీరామునికి హితవు చెప్తాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]