ఛెల్లో షో (గుజరాతీ సినిమా)
ఛెల్లో షో | |
---|---|
దర్శకత్వం | పాన్ నలిన్ |
రచన | పాన్ నలిన్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | స్వప్నిల్ ఎస్. సోనావానే |
కూర్పు | శ్రేయాస్ బెల్టాంగ్డి పవన్ భట్ |
సంగీతం | సిరిల్ మోరిన్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | సిద్ధార్థ్ రాయ్ కపూర్(రాయ్ కపూర్ ఫిల్మ్స్)[1] |
విడుదల తేదీs | 10 జూన్ 2021(ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్) 14 అక్టోబరు 2022 (భారతదేశం) |
సినిమా నిడివి | 110 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | గుజరాతీ |
ఛెల్లో షో లేదా ఛెల్లో శో[గమనిక 1] (అర్థం: చివరి షో, గుజరాతీ: છેલ્લો શો) పాన్ నళిన్ దర్శకత్వం వహించిన 2021 గుజరాతీ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా చిత్రం. ఇందులో భవిన్ రాబారి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్, పరేష్ మెహతా నటించారు.[2] ఈ చిత్రం తొలిసారి 20వ ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో 2021 జూన్ 10న ప్రదర్శించారు. స్పెయిన్‌లో జరిగిన వల్లాడోలిడ్ చిత్రోత్సవంలో గోల్డెన్ స్పైక్ పురస్కారంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు ఇప్పటికే గెలుచుకుంది.
గుజరాత్‌లోని ఓ మూరుమూల పల్లెటూరులో జరిగే కథతో తెరకెక్కిన ఛెల్లో షో 95వ అకాడెమీ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రానికి భారతీయ ఎంట్రీగా ఎంపికైంది.[3][4] కాగా ఈ సినిమా ‘ది లాస్ట్ షో’ పేరుతో దేశవ్యాప్తంగా 2022 అక్టోబరు 14న ఆంగ్ల భాషలో థియేటర్‌లలో విడుదల కానుంది.
తారాగణం
[మార్చు]- భవిన్ రాబారి
- భవేష్ శ్రీమాలి
- రిచా మీనా
- దీపేన్ రావల్
- పరేష్ మెహతా
- వికాస్ బాటా
- రాహుల్ కోలీ
- శోబన్ మక్వా
- కిషన్ పర్మార్
- విజయ్ మెర్
- అల్పేష్ టాంక్
- టియా సెబాస్టియన్
- జాస్మిన్ జోషి
విషాదం
[మార్చు]ఛెల్లో షో సినిమాలో నటించిన ఆరుగురు బాలనటుల్లో ఒకడైన 10 ఏళ్ళ రాహుల్ కోలీ మృతి చెందాడు. రాహుల్ కోలీ గత కొంతకాలంగా ల్యుకేమియాతో పోరాడుతూ పరిస్థితి విషమించడంతో 2022 అక్టోబరు 2న కన్నుమూశాడు. [5]
గమనికలు
[మార్చు]- ↑ గుజరాతీ లిపిలో చిత్రం పేరు
మూలాలు
[మార్చు]- ↑ Ramachandran, Naman (12 September 2022). "Roy Kapur Films to Distribute Pan Nalin's 'Last Film Show' in India". Variety. Retrieved 20 September 2022.
- ↑ "Pan Nalin's Gujarati film Chhello Show to open Tribeca Film Festival's Spotlight section". Firstpost. 2021-04-27. Archived from the original on 27 April 2021. Retrieved 2021-05-27.
- ↑ "Oscars: ఆస్కార్ బరిలో 'ఛెల్లో షో'". web.archive.org. 2022-10-11. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Gujarati movie Chhello Show is India's entry for 2023 Oscars". The Indian Express (in ఇంగ్లీష్). 2022-09-20. Retrieved 2022-09-20.
- ↑ "క్యాన్సర్‌తో 'ఛెల్లో షో' బాల నటుడి మృతి". web.archive.org. 2022-10-11. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)