జోగ్ జలపాతం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జోగ్ జలపాతం | |
---|---|
దస్త్రం:File:Jog Falls, India - August 2004.jpg | |
ప్రదేశం | షిమోగ జిల్లా, కర్ణాటక, భారతదేశం |
రకం | Cataract, Segmented |
సమద్రతలం నుండి ఎత్తు | 2600 అడుగులు |
మొత్తం ఎత్తు | 829 అడుగులు/253 మీటర్లు |
బిందువుల సంఖ్య | 1 |
పొడవైన బిందువు | 829 అడుగులు/253 మీటర్లు |
నీటి ప్రవాహం | శరవతి నది |
సగటు ప్రవాహరేటు | 5,387 అ³/సె or 153 మీ³/సె |
ప్రపంచములో ఎత్తువారిగా ర్యాంక్ | 313 |
జోగ్ జలపాతం (ఆంగ్లం: Jog Falls, కన్నడ: ಜೋಗ ಜಲಪಾತ ) భారత దేశం లోని ఎత్తైన జలపాతాలలో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తున్న ఈ జలపాతం కర్ణాటక రాష్ట్రం షిమోగ జిల్లా సాగర తాలూకాలో ఉంది. ఈ జలపాతం శరావతి నది, 253 మీటర్ల (829 అడుగులు) ఎత్తు నుండి పడడం వల్ల ఏర్పడుతోంది. ఈ జలపాతం వివిధ రాష్ట్రాలనుండి పర్యటకులను ఆకర్షిస్తున్నది. ఈ జలపాతానికి గేరుసొప్ప లేదా జోగోడా గుండి అనే పేర్లు కూడా ఉన్నాయి.[1] షిమోగ నుంచి జోగ్ జలపాతానికి బస్సు, ఇతర రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
జలపాత వివరణ
[మార్చు]శరావతి నది 829 అడుగుల నుండి పడుతూ నాలుగు పాయలుగా విడిపోయి, నాలుగు వేర్వేరు గతిపథాలలో క్రింద పడుతుంది. ఈ విధంగా 4 గతిపథాలకు నాలుగు పేర్లు ఉన్నాయి. ఎడమ నుండి కుడికి ఆ గతిపథాల ఆధారంగా జలపాతాల పేర్లు వాటి పేర్ల వెనుక కారణాలు (ప్రక్కన ఉన్న బొమ్మలో చూడవచ్చు)
- రాజ: జలపాతం చాలా నిర్మలంగా సౌమ్యంగా ఉన్న రాజు మాదిరిగా ఉండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి రాజు అని పేరు పెట్టారు.
- రోరర్: ఈ జలపాతం పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుండి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ క్రింద పడుతుండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి రోరర్ అని పేరు పెట్టారు.
- రాకెట్: అత్యంత వేగంతో సన్నటి ధారగా రాకెట్టు మాదిరిగా ఉండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి రాకెట్టు అని పేరు పెట్టారు.
- రాణి: వయ్యారాలు, వంపులు పోతూ పడే జోగ్ జలపాతంలో ఈ గతిపథికి రాణి అని పేరు పెట్టారు.
మహత్మా గాంధీ జలవిద్యుత్తు ప్రాజెక్టు
[మార్చు]భారత దేశంలోని అతి పెద్ద జలవిద్యుత్తు ప్రాజెక్టులలో అతి పెద్ద ప్రాజెక్టు, హిరెబాస్కర డ్యాం శరవతి నది మీద నిర్మించబడింది.ఈ జల విద్యుత్తు ప్రాజెక్టు 1949 నుండి సుమారుగా 1200 మెగా వాట్ల విద్యుత్తు తయారు చేస్తోంది. అప్పటి రోజులలో ఈ ప్రాజెక్ట్ ను పూర్వపు మైసూరు రాజు నాల్గవ కృష్ణ రాజ వడియారు పేరుమీద కృష్ణ రాజేంద్ర విద్యుత్తు ప్రాజెక్టు అని పిలిచేవారు. ఆ తరువాత ప్రాజెక్టు పేరు మహాత్మా గాంధీ జలవిద్యుత్తు ప్రాజెక్టుగా మార్చబడింది. ఆ తరువాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికతో 1960 సంవత్సరంలో శరవతి నది పై లింగనమక్కి అనే డ్యాం నిర్మించబడింది.
ఋతుపవనాలు ప్రారంభం కావడానికి మునుపు జోగ్ జలపాతం
[మార్చు]ఋతుపవనాలు ప్రారంభమవడానికి ముందు లింగనమక్కి డ్యాంలో నీరు ఎక్కువగా ఉండదు.లింగనమక్కి డ్యాంలోని నీరు నిల్వ ఎక్కువగా లేకపోవడం వల్ల పనిదినాల్లో జోగ్ జలపాతం చాలా సన్నగా పడుతుంది. లింగనమక్కి డ్యాంలో నిల్వ చేయబడిన నీరు వారాంతములో పర్యటకులను ఆకర్షించడానికి వదిలి పెడతారు.
జోగ్ కు చేరుకొనే విధానం
[మార్చు]ఆగష్టు-డిసెంబర్ నెలలు జోగ్ జలపాతాలు దర్శించడానికి మంచి సమయం. ఈ సమయంలో జలపాతాలలో మంచి ప్రవాహం ఉంటుంది. జోగ్, సాగరకు 30 కి.మీ. దూరంలో కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి 379 కి.మీ దూరంలో ఉంది.
- జోగ్ జలపాతాలకు దగ్గరలో ఉన్న బస్సు స్టేషన్లు - జోగ్, సాగర్. బెంగళూరు నుండి సరాసరి జోగ్ కు చేరడానికి బస్సు సౌకర్యం ఉంది. తప్పని పక్షంలో బెంగళూరు నుండి సాగర్‌కు బస్సు తీసుకొని, సాగర్ నుండి జోగ్ కి సులభంగా చేరుకోవచ్చు. షిమోగ నుండి జోగ్ 104 కి.మీ.దూరంలో ఉంది.
- జోగ్ కి దగ్గరలో ఉన్న రైలు స్టేషన్లు - తాళగుప్ప, సాగర, షిమోగ. అతి దగ్గర రైల్వే స్టేషన్ (13 కిమీ) తాళగుప్ప. మైసూరు, బెంగళూరు నుండి తాళగుప్ప, సాగర, షిమోగ లకు రైలు సౌకర్యం ఉంది.
- కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ప్రైవేటు బస్సులు, చాలా మటుకు టూర్టిస్టు బస్సులు షిమోగ నుండి నడుస్తాయి.
- దగ్గరలోని విమానాశ్రయం - షిమోగ
జోగ్‌కి దగ్గరలో మరి కొన్ని ఆకర్షణలు
[మార్చు]- లింగనమక్కి డ్యాం నుండి వచ్చే వెనుక నీరు వల్ల హొన్నెమరాడు అనే ఈ ద్వీపం ఏర్పడింది.ఈ ద్వీపం జల క్రీడలకు ప్రసిద్ధి.
- నిప్లి జలపాతం (జోగ్ నుండి 12 కిలోమీటర్లు) - చిన్న పిల్లలు కూడా నీళ్ళలో దిగి ఆడుకునేందుకు అనువైన జలపాతం. ఇక్కడ నుండి వెళ్ళే నీరు వరద అనే నదిలో కలుస్తుంది.
జోగ జలపాతాల బొమ్మల సంగ్రహం
[మార్చు]-
జోగ్ జలపాతం పూర్తి ప్రవాహం
-
జోగ్ జలపాతాలు పైనుండి దృశ్యం - డిసెంబరు నెలలో
-
జోగ్ జలపాతాల వద్ద ఇంద్రధనుస్సు - డిసెంబరు నెలలో
-
సాయంసంధ్య వేళ జోగ్ జలపాతాలు - డిసెంబరు నెలలో
-
తొలకరి వర్షాలలో జోగ్ జలపాతాలు
-
వర్షాకాలపు చివరిలో జోగ్ జలపాతాలు
-
క్రింది నుండి జోగ్ జలపాతాల దృశ్యం
-
జోగ్ జలపాతాలు మరోకోణంలో
-
జూన్ 2007 ఋతుపవనాలు ప్రారంభమవకముందు జోగ్ జలపాతాలు
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- జోగ్ జలపాతం విడియో
- జోగ్ జలపాతం గురించి Kiruthik.Com నుండి
- జోగ్ జలపాతం గురించి డ్రీం రూట్స్ నుండి
- జోగ జలపాతం గురించి సంక్షిప్త సమాచారం
- జోగ్ జలపాతం పేరు ప్రపంచ జలపాతాల జాబితాలో
- షిమోగ జిల్లా పర్యటక శాఖ వెబ్ సైటు
- పశ్చిమ కనుమల పర్యటక విశేషాలు
సూచికలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-05-05. Retrieved 2007-07-07.