నూతన్
నూతన్ | |
---|---|
జననం | నూతన్ సమర్థ్ 1936 జూన్ 4 |
మరణం | 1991 ఫిబ్రవరి 21 | (వయసు 54)
జాతీయత | ఇండియన్ |
క్రియాశీల సంవత్సరాలు | 1950–1991 |
గుర్తించదగిన సేవలు | హమ్ లాగ్ (1951) నగీనా (1951) సీమ (1955) అనారి (1959) సుజాత (1959) ఛలియా (1960) బాందిని (1963) తేరే ఘర్ కే సామ్నే (1963) మిలన్ (1967) సరస్వతీచంద్ర (1968) అనురాగ్ (1972) సౌదాగర్ (1973) మెయిన్ తులసి తేరే ఆంగన్ కి (1978) |
జీవిత భాగస్వామి | రజనీష్ బహల్ (m. 1959) |
పిల్లలు | మొహ్నిష్ బహల్ |
తల్లిదండ్రులు |
|
బంధువులు | ప్రనూతన్ బహల్ (మనవరాలు) |
పురస్కారాలు |
|
సన్మానాలు | పద్మశ్రీ (1974) |
నూతన్ సమర్థ్ బహల్ (1936 జూన్ 4 - 1991 ఫిబ్రవరి 21) హిందీ చిత్రాలలో నటించిన భారతీయనటి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్‌లో 80కి పైగా చిత్రాలలో నటించింది. వీటిలో ఎక్కువగా ఆమె కథానాయికగా చేసింది. ఆమె భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ నటులలో ఒకరిగా పరిగణించబడుతుంది.[1]
రొమాన్స్, సాహిత్యం, సైకలాజికల్ మొదలు సామాజిక వాస్తవిక ఇతివృత్తాలు వరకు తన సహజసిద్ధమైన నటనా శైలితో నటించి ప్రసిద్ధిచెందింది.[2] నూతన్ ఉత్తమ నటిగా రికార్డు స్థాయిలో ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకోగా 1974లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆమెను సత్కరించింది.
కెరీర్
[మార్చు]ముంబైలో చిత్రనిర్మాత కుమార్‌సేన్ సమర్థ్, సినీ నటి శోభనా సమర్థ్‌లకు జన్మించిన నూతన్ 14 సంవత్సరాల వయస్సులో 1950లో తన తల్లి దర్శకత్వం వహించిన హమారీ బేటీ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించింది. 1951లో ఆమె నగీనా, హమ్ లాగ్ చిత్రాలలో నటించింది. 1955లో సీమ చిత్రంలో ఆమె నటనకు విస్తృత స్థాయి గుర్తింపుతో పాటు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది.
ఆమె 1960ల నుండి 1970ల చివరి వరకు ప్రముఖ పాత్రలను పోషించడం కొనసాగించింది. వాటిల్లో సుజాత, బాందిని, మిలన్, మెయిన్ తులసి తేరే ఆంగన్ కి, అనారీ, ఛలియా, తేరే ఘర్ కే సామ్నే, ఖందాన్, సరస్వతీచంద్ర, అనురాగ్, సౌదాగర్ చిత్రాలు మచ్చుకి చెప్పుకోవచ్చు. ఈ చిత్రాలకుగానూ తనకు మరో నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి.
1980లలో నూతన్ క్యారెక్టర్ రోల్స్ చేయడం ప్రారంభించింది. ఆమె మరణానికి కొంతకాలం ముందు వరకు పని చేస్తూనే ఉంది. ఆమె సాజన్ కి సహేలీ (1981), మేరీ జంగ్ (1985), నామ్ (1986) వంటి చిత్రాలలో ఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. మేరీ జంగ్‌లో ఆమె నటనకు ఆమెకు ఉత్తమ సహాయ నటి విభాగంలో మరో ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.
వ్యక్తిగతం
[మార్చు]నూతన్ నావికాదళ లెఫ్టినెంట్-కమాండర్ రజనీష్ బహల్ ను 1959 లో వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు మోహ్నిష్ బహల్ ఉన్నాడు. అతను చలనచిత్ర, టెలివిజన్ నటుడు. అతని కూతురు, నూతన్ మనవరాలు ప్రనూతన్ బహల్ కూడా బాలీవుడ్ నటి.
1991లో రొమ్ము క్యాన్సర్‌తో నూతన్ మరణించింది. ఆమె భర్త 2004లో వారి అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదంలో మరణించాడు.[3]
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]పౌర పురస్కారం
[మార్చు]1974లో భారత ప్రభుత్వంచే దేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
[మార్చు]ఉత్తమ నటి
Year | Film | Role | Result |
1957 | సీమ | గౌరీ | విజేత |
1960 | సుజాత | సుజాత | విజేత |
1961 | ఛలియా | శాంతి | నామినేట్ చేయబడింది |
1964 | బాందిని | కల్యాణి | విజేత |
1968 | మిలన్ | రాధ | విజేత |
1974 | సౌదాగర్ | మహజుభి | నామినేట్ చేయబడింది |
1979 | మెయిన్ తులసీ తేరే ఆంగన్ కీ | సంజుక్తా చౌహాన్ | విజేత |
ఉత్తమ సహాయ నటి
Year | Film | Role | Result |
1974 | అనురాగ్ | అను రాయ్ | నామినేట్ చేయబడింది |
సౌదాగర్ | మహజుభి | నామినేట్ చేయబడింది | |
1979 | మెయిన్ తులసి తేరే ఆంగన్ కీ | సంయుక్తా చౌహాన్ | నామినేట్ చేయబడింది |
1986 | మేరీ జంగ్ | ఆర్తి | విజేత |
BFJA అవార్డులు
[మార్చు]ఉత్తమ నటి (హిందీ)
Year | Film | Role | Notes |
1964 | బాందిని | కల్యాణి | విజేత |
1968 | మిలన్ | రాధ | విజేత |
1974 | సౌదాగర్ | మహజుభి | విజేత |
మూలాలు
[మార్చు]- ↑ "Forever Nutan". Rediff.com. Retrieved 22 September 2011.
- ↑ Dhawan, M.L. (26 February 2006). "To the manner born". The Sunday Tribune. Retrieved 28 February 2022.
- ↑ "Actor Mohnish Behl's father dies in fire". Rediff.com. 4 August 2004.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1936 జననాలు
- 1991 మరణాలు
- భారతీయ సినిమా నటీమణులు
- హిందీ సినిమా నటీమణులు
- ఫెమినా మిస్ ఇండియా విజేతలు
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు
- ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతలు
- మహిళా మోడల్స్
- క్యాన్సర్ వ్యాధి మరణాలు