భవతారిణి
భవతారిణి | |
---|---|
జననం | భవతారిణి రాజా 1976 జూలై 23 |
మరణం | 2024 జనవరి 25 | (వయసు 47)
మరణ కారణం | కాలేయ క్యాన్సర్ |
వృత్తి | నటి, ప్లేబ్యాక్ సింగర్, సంగీత దర్శకురాలు |
తల్లిదండ్రులు |
|
బంధువులు | వెంకట్ ప్రభు |
భవతారిణి రాజా (1976 జూలై 23 - 2024 జనవరి 25) భారతీయ నటి, సంగీత దర్శకురాలు, గాయని. ఆమె ప్రముఖ చలనచిత్ర స్వరకర్త ఇళయరాజా కుమార్తె. యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజాలకు సోదరి.[1] ఆమె ఎక్కువగా తన తండ్రి, సోదరుల దర్శకత్వంలో పాటలు పాడింది. ఆమె తండ్రి స్వరపరిచిన భారతి చిత్రంలోని "మయిల్ పోల పొన్ను ఒన్ను" పాటను పాడినందుకు 2001లో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది.[2]
తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం గుండెల్లో గోదారి సినిమాలో ‘నన్ను నీతో..’ పాటను పాడిన ఆమె సంగీత అభిమానుల హృదయాలలో చోటు దక్కించుకుంది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె చెన్నైలోని రోసరీ మెట్రిక్ స్కూల్‌లో చదివింది. దీని తర్వాత చెన్నైలోని పీటర్స్ రోడ్‌లోని ఆదర్శ విద్యాలయంలో ఉన్నత మాధ్యమిక పాఠశాలలో చదువుకుంది.
భవతారిణిని ఒక అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన ఎస్.ఎన్ రామచంద్రన్ కుమారుడు ఆర్. శబరిరాజ్ ను వివాహం చేసుకుంది.[1]
ఫిల్మోగ్రఫీ
[మార్చు](పాక్షికం)
1984: మై డియర్ కుట్టిచాతన్ (మలయాళం)
1995 రాసయ్య (కుర్రాడు బాబోయ్)
1996 అలెగ్జాండర్
1997 తేదినెన్ వంతతు
1997 కరువేలం పూక్కల్
1997: కధలుక్కు మరియాదై
1997: ఉల్లాసం (తెలుగు)
1998: కలియుంజల్ (మలయాళం)
1999 టైం (టైం)
2000: భారతి (ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారం)
2001: అజగి
2001: ఫ్రెండ్స్
2005: ఒరు నాల్ ఒరు కనవు
2005: పొన్ముడిపూజయోరతు (మలయాళం)
2006: అజగై ఇరుక్కిరై బయమై ఇరుక్కిరతు
2006: తామిరభరణి
2007: నాలయ్య పొజుతుం ఉన్నోడు
2008: ఉలియిన్ ఒసై
2008: ధనం
2009: పా (పా )
2010: గోవా
2011: మంకథ
2012: గుండెల్లో గోదారి (తెలుగు)
2014: అనెగన్ (అనేకుడు)
2021: మానాడు
సంగీత దర్శకురాలిగా
[మార్చు]2002: మిత్ర్, మై ఫ్రెండ్ (ఆంగ్లం)
2002: మళ్ళీ మళ్ళీ చూడాలి (తెలుగు)
2003: అవునా (తెలుగు)
2004: ఫిర్ మిలేంగే (హిందీ) (అదనపు స్వరకర్త, బిజిఎమ్)
2005: గీయా గీయా (కన్నడ)
2006: అమృతం
2006: ఇలాక్కనం
2012: వెల్లచి
2012: పోరిడ పజగు
2018: కల్వర్గల్
2019: మాయానాది
మరణం
[మార్చు]భవతారణి రాజా 47 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో బాధ పడుతూ 2024 జనవరి 25న శ్రీలంకలో కన్నుమూసింది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Ilayaraja's daughter gets engalged". The Hindu. August 4, 2005. Archived from the original on December 1, 2016. Retrieved November 30, 2016.
- ↑ "48th National Film Awards, 2000".
- ↑ "ఇళయరాజా కుమార్తె, సంగీత దర్శకురాలు భవతారణి కన్నుమూత | Music director Ilaiyaraaja daughter playback singer Bhavatharini died of cancer - Sakshi". web.archive.org. 2024-01-26. Archived from the original on 2024-01-26. Retrieved 2024-01-26.
{{cite web}}
: no-break space character in|title=
at position 35 (help)CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Bhavatharini, daughter of musician Ilayaraja, no more". The hindu.
- 1976 జననాలు
- 2024 మరణాలు
- తమిళ నేపథ్య గాయకులు
- భారతీయ మహిళా నేపథ్య గాయకులు
- తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుల విజేతలు
- భారత చలనచిత్ర స్కోర్ కంపోజర్లు
- ఉమెన్ ఫిల్మ్ స్కోర్ కంపోజర్స్
- భారతీయ స్వరకర్తలు
- భారతీయ సినిమా పాటల రచయితలు
- భారతీయ మహిళా గాయకులు
- ఉత్తమ నేపథ్య గాయని జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలు
- భారతీయ సంగీత విద్వాంసులు
- భారతీయ మహిళా సంగీతకారులు