భూపేన్ హజారికా
భారతరత్న భూపేన్ హజారికా | |
---|---|
జననం | సడియా, అస్సాం, బ్రిటిష్ ఇండియా | 1926 సెప్టెంబరు 8
మరణం | 2011 నవంబరు 5 ముంబై, మహరాష్ట్ర, భారతదేశం [1] | (వయసు 85)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | సంగీతకారుడు, గాయకుడు, కవి, సినిమానిర్మాత, పాటల రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1939-2011 |
గుర్తించదగిన సేవలు | రుదాలి ధర్మియాన్: ఇన్ బిట్వీన్ గజ గామిని దమన్(సినిమ) ఇంద్రమాలతి |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ఉద్యమం | ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషాన్ |
జీవిత భాగస్వామి | ప్రియంవద పటేల్ |
పిల్లలు | తేజ్ భూపెన్ హజారిక (జ. 1952) |
బంధువులు | సుమిత్ర హజారికా (సోదరి) |
పురస్కారాలు | భారతరత్న (2019) (Posthumously), పద్మవిభూషణ (2012) (Posthumously) పద్మశ్రీ (1977) దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం (1992) పద్మభూషణ్ పురస్కారం (2001) సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (2008) అసోం రత్న (2009) ముక్తిజోడ్డా పదక్ (2011) [posthumously] |
వెబ్‌సైటు | bhupenhazarika.com |
సంతకం | |
దస్త్రం:Bhupen Hazarika signature.png |
భూపేన్ హజారికా (8 సెప్టెంబరు 1926 – 2011 నవంబరు 5) భారత దేశానికి చెందిన నేపథ్య గాయకుడు, గీతరచయిత, సంగీతకారుడు, గాయకుడు, కవి, అసోం సినిమా నిర్మాత. అతను "సుధాకాంత"గా సుపరిచితుడు. అతని పాడిన పాటలు ముఖ్యంగా అసోం భాషలో అతనిచే రచించబడ్డాయి. అతని పాటలు మానవత్వం, విశ్వజనీన సహోదరత్వ భావాలు కలిగి అనేక భారతీయ భాషల్లో అనువదింపబడి, పాడబడ్డాయి. ముఖ్యంగా బెంగాళీ, హిందీ భాషల లోనికి అనువదించబడ్డాయి. అస్సాం, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల ప్రజల మధ్య సామూహిక, సామాజిక న్యాయం, సానుభూతి నేపథ్యాలలో అతని పాటలు ప్రాచుర్యం పొందాయి. అస్సాం, ఉత్తర భారతదేశంలోని సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ సినిమాలో ప్రవేశపెట్టిన గుర్తింపు అతను పొందాడు. అతనిని 1975లో ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ ఫిలిం పురస్కారం, సంగీత నాటక అకాడమీ పురస్కారం (1987), పద్మశ్రీ (1977),, పద్మభూషణపురస్కారాలు (2001) [2] వచ్చాయి. అతనికి దాదాసాహెబ్ ఫాల్కేపురస్కారం (1992), సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (2008) లు కూడా లభించాయి. 2012లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ పురస్కారం పొందాడు.[3] అతను డిసెంబరు 1996 నుండి డిసెంబరు 2003 వరకు సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా కూడా వ్యవహరించాడు.[4]
జీవిత విశేషాలు
[మార్చు]బాల్య జీవితం
[మార్చు]అతను అసోం లోని సదియాలో నీలకంఠ, శాంతిప్రియ దంపతులకు 1926 సెప్టెంబరు 8న జన్మించాడు.[5] అతని తండ్రి వాస్తవంగా శివసాగర్ జిల్లాలోని నాజిరా పట్టణానికి చెందినవాడు. 10మంది సహోదరులలో అతను పెద్దవాడిగా అతను తన తల్లి యొక్క సంగీత ప్రభావానికి గురయ్యాడు. అతడికి తన తల్లి సాంప్రదాయ సంగీతం, సాంప్రదాయ సంగీతాన్ని అందించింది.[6] తన తండ్రి 1929లో గౌహతి లోని భారలముఖ్ ప్రాంతానికి మారినపుడు[5] హజారికా తన బాల్యజీవితాన్ని అక్కడ గడిపాడు. 1932లో అతని తండ్రి ధుబ్రి [7], 1935లో తేజ్‌పూర్[5] ప్రాంతాలకు మారాడు. తేజ్‌పూర్ లో ఉన్నప్పుడు హజారికాకు 10 సంవత్సరాలు. అక్కడ అతను ఒక బహిరంగ సభలో తన తల్లి నేర్పించిన "బోర్‌గీత్" (శ్రీమంత శంకరదేవ, శ్రీశ్రీ మాధవదేవ చే రచించబడిన సాంప్రదాయక అస్సామీ భక్తి పాటలు) ను పాడడం ద్వారా అస్సామీ గేయరచయిత, నాటక రచయిత, మొదటి అస్సామీ సినిమా నిర్మాత అయిన "జ్యోతిప్రసాద్ అగర్వాల్", అస్సామీ విప్లవ రచయిత "బిషు ప్రసాద్ రభా" దృష్టిలో పడ్డాడు. 1936లో హజారికా వారితో పాటు కలకత్తాకు వెళ్ళి తన మొదటి పాటను అరోరా స్టుడియోలో పాడాడు.[5] తేజ్ పూర్ లో అస్సామీ సంస్కృతితో అతనికి గల సంబంధం అతని కళాత్మక వృద్ధికి తోడ్పడింది. అతను తన 12వ యేట అగర్వాల్ సినిమా "ఇంద్రమాలతి" (1939) లో రెండు పాటలు పాడాడు. రచయితగా అతను తన 13వ యేట మొదటి పాట "అగ్నిజుగోర్ ఫిరింగోతి"ను రాసాడు.[7] తరువాత అతను గేయరచయితగా, సంగీతకారునిగా, గాయకునిగా ఎదిగాడు.
విద్య, జీవితం
[మార్చు]హజారికా గౌహతిలోని సోనారాం ఉన్నత పాఠశాల, దుబ్రి ప్రభుత్వ పాఠశాలలలో చదివాడు.[8] 1940లో తేజ్‌పూర్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ చేసాడు. 1942లో కాటన్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించాడు. 1944లో బి.ఎ, 1946లో ఎం.ఎ (రాజనీతి శాస్త్రం) లను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేసాడు. కొద్దికాలం పాటు గౌహతిలోని ఆల్ ఇండియా రేడియోలో పనిచేసాడు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి ఉపకారవేతనం తెలుపొంది 1949లో న్యూయార్క్ కు పయనమయ్యాడు. అక్కడ 1952లో "భారతదేశంలో వయోజన విద్యలో దృశ్య-శ్రవణ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే ప్రాథమిక విద్యపై సంసద్ధత" అనే అంశంపై పి.హెచ్.డి చేసాడు. న్యూయార్క్ లో హజారికా పౌర హక్కుల కార్యకర్త "పాల్ రోబెసన్"తో స్నేహం చేసాడు.[9] తన పాట "బిస్టిమో పరోరే"తో అతనిని ప్రభావితం చేసాడు. ఈ పాట బెంగాలీ, హిందీతో పాటు అనేక భారతీయ భాషలలో అనువాదమయింది. ఆ పాట అతనిచే పాడబడి ఇప్పటికీ జనాదరణ పొందుతుంది. కొన్ని విదేశీయుల నుండి ప్రేరణ పొంది అనేక పాటలను భారతీయ భాషలలో కంపోజ్ చేసాడు. కొలంబో విశ్వవిద్యాలయంలో అతను ప్రియంవద పటేల్ ను కలసి 1950లో వివాహమాడాడు. అతని ఏకైక కుమారుడు తేజ్ హజారికా 1952లోజన్మించాడు.[10] 1953లో అతను భారతదేశానికి తిరిగి వచ్చాడు.
జాతీయ స్థాయిలో అవార్డులు
[మార్చు]భూపేన్ హజారికాకు జాతీయస్థాయిలో అవార్డులు వరించాయి. చమేలీ మేమ్‌సాబ్ చిత్రానికిగాను 1976లో ఆయనకు ఉత్తమ సంగీత దర్శకుడి కేటగిరీలో జాతీయ అవార్డు వచ్చింది. 1960లో శంకుతల సినిమాకు, 1964లో ప్రతిధ్వనికి, 1967లో లోటీగోటీ చిత్రాలకుగాను ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. ఇక 1967 నుంచి 1972 వరకు శాసనసభ్యునిగా కూడా సేవలందించాడు. 1977లో పద్మశ్రీ అవార్డు, 1987లో సంగీత్ నాటక్ అకాడెమీ అవార్డులు అందుకున్నాడు. 1999 నుంచి 2004 వరకు సంగీత్ నాటక అకాడెమీకి ఛైర్మెన్‌గా కూడా వ్యవహరించాడు. 2004లో బీజేపీ టికెట్‌పై గౌహతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన భూపేన్ హజారికా.. ఓటమి పాలయ్యారు. 2011లో 85 ఏళ్ల వయస్సులో భూపేన్ హజారికా తుదిశ్వాస విడిచాడు.[11]
మూలాలు
[మార్చు]- ↑ "Acclaimed singer Bhupen Hazarika dies at 85". CNN-IBN. 5 November 1986. Archived from the original on 6 నవంబరు 2011. Retrieved 5 November 2011.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 26 జనవరి 2019.
- ↑ "Padma Awards". pib. 27 January 2013. Retrieved 27 January 2013.
- ↑ Dr. Bhupen Hazarika - the Legend of Assam Archived 2014-08-26 at the Wayback Machine India-north-east.com
- ↑ 5.0 5.1 5.2 5.3 "As ashes merge into rivers". The Telegraph. Calcutta, India. 12 November 2011.
- ↑ "Celebrated Indian singer Bhupen Hazarika dies". BBC News. 5 November 2011. Retrieved 25 December 2012.
- ↑ 7.0 7.1 Sushanta Talukdar, Brahmaputra Balladeer, The Hindu, 10 November 2011
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;telegraphindia.com2
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Brahmaputra Balladeer2
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Asjad Nazir, Bhupen Hazarika obituary, The Guardian, 6 November 2011
- ↑ "భారత 'రత్నం' భూపేన్ హజారికా: కవి నుంచి కంపోజర్ వరకు ఈశాన్య పుత్రుడి జీవిత ప్రస్థానం".
బయటి లంకెలు
[మార్చు]- Lyrics of 700+ Bhupendra Sangeets
- Official website
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో భూపేన్ హజారికా పేజీ
- Digital Archive of Bhupen Hazarika[permanent dead link]
చిత్రమాలిక
[మార్చు]Some relevant photographs | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
|
- మూలాల లోపాలున్న పేజీలు
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Commons category link is on Wikidata
- All articles with dead external links
- భారతరత్న గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు
- బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు