మందాకిని (నటి)
Jump to navigation
Jump to search
మందాకిని | |
---|---|
జననం | యాస్మీన్ జోసెఫ్ 1963 జూలై 30 |
జాతీయత | ఇండియన్ |
ఇతర పేర్లు | మందాకిని జోసెఫ్ ఠాకూర్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1985–1996 |
గుర్తించదగిన సేవలు | రామ్ తేరీ గంగా మైలీ (1985) |
జీవిత భాగస్వామి | Dr. కాగ్యుర్ టి. రింపోచే ఠాకూర్
(m. 1990) |
పిల్లలు | 2 |
మందాకిని (యాస్మీన్ జోసెఫ్) బాలీవుడ్ మాజీ నటి. 1985లో విడుదలైన చిత్రం రామ్ తేరీ గంగా మైలీలో ఆమె నటనతో అందరిని ఆకర్షించింది.
జీవిత విశేషాలు
[మార్చు]యాస్మీన్ జోసెఫ్ 1963 జూలై 30న మీరట్‌లో యాస్మీన్ జోసెఫ్‌గా బ్రిటిష్ తండ్రి, కాశ్మీరీ తల్లికి జన్మించింది.[1] 22 సంవత్సరాల వయస్సులో ఆమెను గుర్తించిన చలనచిత్ర దర్శకుడు రాజ్ కపూర్ మందాకిని అనే స్క్రీన్ పేరు పెట్టారు.[2]
తెలుగులో 70 ఎం.ఎం.లో నిర్మించిన మొదటి సినిమా సింహాసనం. పద్మాలయా సంస్థ నిర్మించిన ఈ చిత్రంతో కృష్ణ దర్శకునిగా పరిచయమయ్యారు. 1986లో వచ్చిన సింహాసనం చిత్రంలో కృష్ణ, జయప్రద, రాధ హీరో హీరోయిన్ లు కాగా మందాకిని మరో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. అలాగే భార్గవరాముడు తోనూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. మందాకిని చివరిసారిగా 1996లో జోర్దార్ చిత్రంలో నటించారు.
మూలాలు
[మార్చు]- ↑ "Mandakini, happy birthday". 30 July 2012. Retrieved 23 March 2022.
- ↑ "Happy Birthday Mandakini 7 lesser-known facts about the Ram Teri Ganga Maili actor". 30 July 2017. Retrieved 23 March 2022.