మద్యపాన వ్యసనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మద్యపాన వ్యసనం అంటే మితిమీరి మద్యం సేవించడం వల్ల సమస్యలు వచ్చినా, ఆ అలవాటును మానకపోవడం. మద్యపానం యొక్క అనర్థాల గురించి చరిత్ర తొలి రోజుల్లోని రచనల్లో ప్రస్తావనలు ఉన్నాయి. 2016 నాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మద్యపాన బాధితులు సుమారు 28.3 కోట్ల పైమాటే.[1]

మద్యపానం అనేది ఒక వ్యసనం. దీర్ఘకాలం పాటు విపరీతంగా మద్యం సేవించడవల్ల ఆరోగ్యపరంగా, సామాజికంగా పలు సమస్యలు వస్తాయి. ఇది అన్ని అవయవ వ్యవస్థలనూ ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మెదడు, గుండె, కాలేయం, క్లోమము పనితీరును, రోగ నిరోధక వ్యవస్థను బాగా దెబ్బతీస్తుంది. మద్యం ఎక్కువ సేవించడం వల్ల నిద్ర సరిగా పట్టదు. డెమెన్షియా, మెదడు మొద్దుబారిపోవడం లాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. భౌతికంగా గుండె లయ తప్పడం, కాలేయ లోపం, క్యాన్సర్ ముప్పు అధికం కావడం లాంటి లక్షణాలు కలిగిస్తుంది. ఒక్కసారిగా మద్యపానాన్ని ఆపితే తీవ్రమైన ఉపసంహరణ సమస్యలు (Withdrawal symptoms) ఎదురవుతాయి.[2][3] ఇలాంటి సమస్యలు జీవిత కాలాన్ని సుమారు 10 సంవత్సరాల దాకా తగ్గిస్తాయి.[4] మహిళలు గర్భవతులుగా ఉన్నపుడు మద్యం సేవించడం వలన కడుపులో ఉన్న పిండం యొక్క ఆరోగ్యానికి ప్రమాదం.[5] తాగి వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అంతే కాక ఇది నేరప్రవృత్తిని పెంపొందించి హింసతో కూడుకున్న, హింసాయుతం కాని నేరాల రేటును పెంచుతుంది.[6]

మూలాలు

[మార్చు]
  1. "World Population Prospects – Population Division". United Nations. Archived from the original on 15 June 2020. Retrieved 1 July 2024.
  2. "Alcohol's Effects on the Body". 14 September 2011. Archived from the original on 3 June 2015. Retrieved 9 May 2015.
  3. Romeo J, Wärnberg J, Nova E, Díaz LE, Gómez-Martinez S, Marcos A (October 2007). "Moderate alcohol consumption and the immune system: a review". The British Journal of Nutrition. 98 (Suppl 1): S111-5. doi:10.1017/S0007114507838049. PMID 17922947.
  4. Schuckit MA (November 2014). "Recognition and management of withdrawal delirium (delirium tremens)". The New England Journal of Medicine. 371 (22): 2109–13. doi:10.1056/NEJMra1407298. PMID 25427113. S2CID 205116954. Archived from the original on 13 February 2020. Retrieved 1 July 2024.
  5. "Fetal Alcohol Exposure". 14 September 2011. Archived from the original on 4 April 2015. Retrieved 9 May 2015.
  6. Ritzer, George, ed. (2007-02-15). The Blackwell Encyclopedia of Sociology (in ఇంగ్లీష్) (1 ed.). Wiley. doi:10.1002/9781405165518.wbeosa039.pub2. ISBN 978-1-4051-2433-1. Archived from the original on 1 November 2023. Retrieved 1 July 2024.