మమతా శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మమతా శర్మ
వ్యక్తిగత సమాచారం
జననం (1980-09-07) 1980 సెప్టెంబరు 7 (వయసు 44)[1]
మూలంగ్వాలియర్,[2] మధ్యప్రదేశ్.
సంగీత శైలిఫిల్మి, పాప్-ఫోక్, ఇండియన్ పాప్
వృత్తిగాయని
వాయిద్యాలుగాత్రం
క్రియాశీల కాలం2000–ప్రస్తుతం (గాయనిగా);
2010–ప్రస్తుతం (ప్లే బ్యాక్ సింగర్‌గా)

మమతా శర్మ ఒక భారతీయ నేపథ్య గాయని. ఆమె దబాంగ్ నుండి " మున్నీ బద్నామ్ హుయ్ ", యమ్లా పగ్లా దీవానాలోని "టింకు జియా" పాటలకు ప్రసిద్ధి చెందింది. ఈ పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మహిళ) గా ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా ఆమెకు అనేక అవార్డులు, నామినేషన్లను తెచ్చిపెట్టాయి. [3]

ప్రారంభ జీవితం

[మార్చు]

మమతా శర్మ మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లోని బిర్లా నగర్‌లో జన్మించింది. ఆమె సెయింట్ పాల్స్ స్కూల్ మొరార్ నుండి తన చదువును పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

బాలీవుడ్, బెంగాలీ భాషల్లో పాడే ముందు, ఆమె అనేక భోజ్‌పురి ఆల్బమ్‌లకు తన గాత్రాన్ని అందించింది ఆమె సంగీత దర్శకుడు లలిత్ పండిత్ ద్వారా గుర్తించబడింది, ఆమె తన కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం దబాంగ్‌లో ఐటెం సాంగ్, మున్నీ బద్నామ్ హుయ్‌తో మొదటి బ్రేక్‌ను పొందింది. ఆమె దబాంగ్ తెలుగు రీమేక్ గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక అనే సూపర్ హిట్ పాటను పాడింది. దీనికిగాను ఆమెను సైమా ఉత్తమ నేపథ్య గాయని - తెలుగు పురస్కారానికి ప్రతిపాదించారు. ఢమరుకం (2012)లో సక్కుబాయి గరం చాయ్ పాటను కూడా పాడింది. ఆ తర్వాత, ఆమె 'ఫెవికాల్ సే' & 'టూ' వంటి హిట్ పాటలను అందించింది.

మూలాలు

[మార్చు]
  1. BollywoodHungama.com (13 December 2012). "Musically Yours With 'Munni Badnaam' And 'Fevicol Se' Singer Mamta Sharma" – via YouTube.
  2. Married- Asraf Ali "Singer Mamta Sharma got first hit song in her first film Dabbang" Archived 2016-03-04 at the Wayback Machine. Retrieved 20 January 2011.
  3. "Munni Badnaam hui a big hit". The Times of India. Archived from the original on 4 November 2012. Retrieved 30 January 2011.