మెర్సల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెర్సల్
దర్శకత్వంఅట్లీ
స్క్రీన్ ప్లేఅట్లీ
కె. వి. విజయేంద్ర ప్రసాద్
ఎస్.రమణ గిరివాసన్
కథఅట్లీ
నిర్మాతఎన్.రామసామి
హేమా రుక్మిణి
హెచ్.మురళి
తారాగణం
ఛాయాగ్రహణంజి.కె.విష్ణు
కూర్పురూబెన్
సంగీతంఎ.ఆర్.రెహమాన్
నిర్మాణ
సంస్థ
తెనదల్ స్టూడియో లిమిటెడ్
విడుదల తేదీ
18 అక్టోబరు 2017 (2017-10-18)(ప్రపంచవ్యాప్తంగా)
సినిమా నిడివి
169 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతమిళం
బడ్జెట్120 కోట్లు[1]
బాక్సాఫీసుest. అంచనా 251 కోట్లు[2][3][4]

మెర్సల్ 2017లో విడుదలైన తమిళ భాషలో వెలువడిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా.[5] ఈ సినిమాకు అట్లీ, కె. వి. విజయేంద్ర ప్రసాద్, ఎస్.రమణ గిరివాసన్ (మాటలు) రచనా సహకారం అందించగా అట్లీ దర్శకత్వం వహించాడు. విజయ్ ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, నిత్య మేనన్‌, సమంత సరసన త్రిపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వం వహించగా, జి.కె.విష్ణు ఛాయాగ్రహణాన్ని, రూబెన్ కూర్పును చేపట్టారు.

ఈ సినిమా నిర్మాణం ఫిబ్రవరి 2017లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో సత్యరాజ్, ఎస్.జె.సూర్య, వడివేలు మొదలైన వారు నటించారు. ఈ సినిమా శ్రీ తెనదల్ ఫిలింస్ సంస్థ నిర్మించిన 100వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా 2017, అక్టోబరు 18వ తేదీన దీపావళి పండుగనాడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ అదిరింది 2017, నవంబరు 9వ తేదీన విడుదలైంది.[6][7] ఈ సినిమా హిందీ వెర్షన్ గోల్డ్‌మైన్స్ టెలిఫిలింస్ సంస్థ ద్వారా విడుదల కానున్నది.

ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా ₹251 కోట్ల ($39.5 మిలియన్ల) వ్యాపారం చేసి తమిళ సినిమా చరిత్రలో ఐదవ అత్యంత ఆదాయం పొందిన చిత్రంగా పేరు గడించింది. కాగా ఇది విజయ్ సినీ జీవితంలో అత్యధిక వ్యాపారం చేసిన చిత్రం. ఈ సినిమా 100రోజులు ఆడింది.[2] ఈ సినిమా యునైటెడ్ కింగ్‌డమ్‌ నేషనల్ ఫిల్మ్‌ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం కేటగరీలో ప్రతిపాదించబడింది. విజయ్ ఇదే అవార్డుకు ఉత్తమ సహాయనటుడు విభాగంలో పరిశీలనకు ప్రతిపాదించ బడ్డాడు.[8][9]

డాక్టర్ మారన్ (విజయ్) నిస్వార్థపరంగా వైద్య వృత్తిని కొనసాగిస్తుంటాడు. కేవలం ఐదు రూపాయలకే వైద్యం అందిస్తుంటాడు. వెట్రి (విజయ్) పాపులర్ మెజిషియన్. డాక్టర్ మారన్ అందించిన అత్యుత్తమ వైద్య సేవలకు గుర్తింపుగా ఫ్రాన్స్ దేశం అవార్డు ప్రకటిస్తుంది. ప్యారిస్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకొంటాడు. అదే సమయంలో వెట్రీ మ్యాజిక్ ప్రదర్శన ప్యారిస్‌లో జరుగుతుంది. మ్యాజిక్ ప్రదర్శనలో భాగంగా ప్రపంచ గుర్తింపు పొందిన డాక్టర్‌ను వెట్రీ చంపి పగ తీర్చుకొంటాడు. డాక్టర్‌ను చంపిన వెట్రీ కూడా మారన్ మాదిరిగా ఉండటంతో మారన్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. మారన్ అరెస్ట్‌ను చూసి ప్రపంచంలోనే గుర్తింపు పొందిన డేనియల్ (ఎస్‌జే సూర్య) కంగుతింటాడు. ఆ తర్వాత మారన్‌ను చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. మారన్‌ను డేనియల్ ఎందుకు చంపాలనుకొంటాడు? మారన్‌ను చూసి భయపడాల్సిన అవసరం డేనియల్ ఎందుకు ఏర్పడింది. ఇక ఈ కథకు కాజల్ అగర్వాల్, సమంత, నిత్యమీనన్ ఏ విధంగా తోడ్పాడ్డాడు అనే విషయాలకు సమాధానమే మెర్సల్ చిత్రం.

సేవ కోసం కాకుండా పక్కా బిజినెస్‌గా మారిన వైద్య వృతిపై దర్శకుడు సంధించిన సినీ విమర్శనాస్త్రం మెర్సల్ చిత్రం. వైద్య రంగంలో జరిగే కమిషన్ల దందా, ప్రైవేట్ హాస్పిటల్స్ దందాను దర్శకుడు అట్లీ కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఈ రకమైన కథకు హృదయాన్ని పిండి వేసే సన్నివేశాలను బలంగా చిత్రించాడు. సినిమా తొలి భాగంలో యాక్సిడెంట్ గురైన ఓ బాలిక ఎపిసోడ్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టించేతగా ఉంది. డబ్బుకు ఆశపడి కొందరు వైద్యులు చేసే దుర్మార్గాలను పచ్చిగా చూపించబడింది.

రెండవ సగంలో ఓ గ్రామ పెద్ద వెట్రి మారన్ (విజయ్) కథ ఫ్లాష్ బ్యాక్‌తో ఆరంభమవుతుంది. పేదల కోసం పరితపించే వెట్రీ మారన్ క్యారెక్టర్ చక్కగా రూపొందించాడు. ఇక వెట్రీ మారన్ భార్య (నిత్యమీనన్) నటన సెకండాఫ్‌కు ప్రాణం పోసింది. గర్భవతి అయిన నిత్య మీనన్ వైద్యుల దుర్మార్గానికి గురై ప్రాణాలు కోల్పోయే ఎపిసోడ్ సినిమాకు హైలెట్. వెట్రీ మారన్ చనిపోయే ఎపిసోడ్‌లో యాక్షన్ పార్ట్ అద్భుతంగా చిత్రీకరించారు.[10]

నటీనటులు

[మార్చు]
  • విజయ్ - వెట్రి/డాక్టర్ మారన్/వెట్రిమారన్
  • కాజల్ అగర్వాల్ - డాక్టర్ అను పల్లవి, వెట్రి ప్రియురాలు
  • వడివేలు - వడివు, మారన్ కాంపౌండర్, వెట్రి సహాయకుడు
  • ఎస్.జె.సూర్య - డాక్టర్ డేనియల్ ఆరోగ్యరాజ్
  • సత్యరాజ్ - రత్నవేల్, తమిళనాడు పోలీస్ ఆఫీసర్
  • సమంత - తార, మీడియా యాంకర్, మారన్ ప్రియురాలు
  • నిత్య మేనన్‌ - ఐశ్వర్య వెట్రిమారన్
  • కోవై సరళ - సరళ, మారన్ పెంపుడు తల్లి
  • రాజేంద్రన్ - ఆరోగ్యశాఖ మంత్రి
  • సత్యన్ - మణియ, రత్నవేల్ అసిస్టెంట్
  • మిషా గోషల్ - తార స్నేహితురాలు, మీడియా యాంకర్
  • యోగి బాబు - నోలన్, తార సహాయకుడు
  • మామిళ్ల శైలజా ప్రియ - తార తల్లి
  • హరీష్ పెరడి - డాక్టర్ జక్రయ్య, డేనియల్ స్నేహితుడు
  • సంగిలి మురుగన్ - సలీమ్‌ ఘోష్, వెట్రి, వడివుల పెంపుడు తండ్రి
  • కాళీ వెంకట్ - రిక్షా డ్రైవర్
  • దేవదర్శిని - నర్సు
  • సురేఖ వాణి - నర్సు
  • సెంథికుమారి - రిక్షా డ్రైవర్ భార్య

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన "తెరి" విజయవంతమయ్యాక ఆ జోడీతో మరొక ప్రాజెక్టు కోసం శ్రీ తెనదల్ ఫిలింస్ సంస్థ సెప్టెంబరు 2016లో ఒప్పందం కుదుర్చుకుంది.[11][12] ఈ సినిమా కథ కోసం బాహుబలి, బజరంగి భాయిజాన్ వంటి సూపర్ హిట్ సినిమాలకు కథను అందించిన కె. వి. విజయేంద్ర ప్రసాద్ను ఎంపిక చేశారు.[13] ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను అనల్ అరసు డైరెక్ట్ చేశాడు. అట్లీ సినిమాలకు పనిచేసేఎ జార్జ్ సి. విలియమ్స్ అనే కెమెరామాన్ ఈ చిత్రానికి అనుకున్నారు కానీ మరొక ప్రాజెక్టుతో సంఘర్షణ కారణంగా జి.కె.విష్ణుకు ఈ సినిమా ద్వారా కెమెరామాన్‌గా తొలి అవకాశం లభించింది.[14] ఈ సినిమాలో నటించడానికి విజయ్ కొన్ని ఇంద్రజాల కిటుకులు మేసిడోనియాకు చెందిన గోగో రెక్విమ్‌, కెనడాకు చెందిన రామన్ శర్మ, బల్గేరియాకు చెందిన డానీ బెలెవ్‌ అనే ముగ్గురు ఇంద్రజాలికుల వద్ద నేర్చుకున్నాడు.[15]

నటీనటుల ఎంపిక

[మార్చు]

ఈ చిత్రంలో ముగ్గురు ప్రముఖ నటీమణులు  – కాజల్ అగర్వాల్, నిత్య మేనన్‌, సమంతలను ఎన్నుకున్నట్లు నిర్మాతలు జనవరి 2017లో ప్రకటించారు. ఎస్.జె.సూర్య, సత్యరాజ్, కమెడియన్ వడివేలు, కోవై సరళ, సత్యన్, రాజేంద్రన్‌లను మిగిలిన పాత్రలకు ఎంపిక చేసుకున్నారు.[16] ఎస్.జె.సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించాడు.[17] సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్, ఎడిటర్ రూబెన్, కాస్ట్యూమ్‌ డిజైనర్ కోన నీరజ , కెమెరామ్యాన్‌గా జి.కె.విష్ణు (తొలి అవకాశం)లను సాంకేతిక వర్గంలో చేర్చుకున్నారు.[18][19] ముందు నిత్య మేనన్‌ పాత్రకోసం జ్యోతికను తీసుకోవాలని భావించారు కాని కారణాంతరాల వల్ల ఆ అవకాశం నిత్య మేనన్‌కు దక్కింది.

చిత్రీకరణ

[మార్చు]
పోలెండ్ దేశంలోని గిడానిస్క్ నగరం సినిమాలో ప్యారిస్గా చూపబడింది.[20]

ఈ సినిమా ముహూర్తం షాట్ చెన్నైలోని ఆదిత్యరాం స్టూడియోలో 2017 ఫిబ్రవరి 1వ తేదీన తీశారు.[21][22] ఈ చిత్రం యూనిట్ ఒక పాటను రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో వేసవి కాలంలో మండే ఎండలలో చిత్రించారు.[23] ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను పోలండ్ [24], మేసిడోనియా[25] దేశాలలో చిత్రీకరించారు. మన దేశంలో ఈ సినిమాకు చెందిన షూటింగు చెన్నై, రాజస్థాన్‌కు చెందిన జై సల్మేర్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనసీమ ప్రాంతాలలో జరిగింది. దక్షిణ భారతదేశ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ చేసిన నిరవధిక సమ్మె కారణంగా ఈ సినిమా షూటింగులో జాప్యం ఏర్పడింది.[26]

పాటలు

[మార్చు]

ఈ సినిమా పాటలు వివేక్ వ్రాయగా ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా ఆడియో 2017 ఆగస్టు 20న సోనీ మ్యూజిక్ సంస్థ విడుదల చేసింది. ఈ విడుదల కార్యక్రమాన్ని సన్ టి.వి. ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ సినిమా పాటలను విడుదలైన పది రోజులలో 100 మిలియన్ల మంది విని తమిళ సినీ సంగీత ప్రపంచంలో ఒక రికార్డు సృష్టించారు.[27]

విడుదల

[మార్చు]

ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా 2017, అక్టోబరు 18న విడుదల అయ్యింది.[28][29]

ఆదరణ

[మార్చు]

బాక్స్ ఆఫీస్

[మార్చు]

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారంలో 170 కోట్లను వసూలు చేసింది.[30] 12 రోజులలో ఈ సినిమా వసూళ్లు 200 కోట్ల లక్ష్యాన్ని అధిగమించింది. అందులో 130 కోట్లు ఒక్క భారత దేశం నుండి వసూలయ్యింది. మిగిలిన 70 కోట్లు మలేసియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండు దేశాల నుండి వసూలయ్యింది. ఈ సినిమా విజయ్ సినీ జీవితంలో 100 కోట్ల క్లబ్బులో చేరిన మొట్టమొదటి సినిమా.[31]

విమర్శకుల అభిప్రాయం

[మార్చు]

ఈ సినిమాపై విమర్శకుల నుండి అనుకూలమైన సమీక్షలు, విమర్శలు వచ్చాయి. హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ఈ సినిమాకు 5 పాయింట్లకు గాను 3 పాయింట్ల రేటింగు ఇవ్వగా, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక 3.5 స్టార్ల రేటింగును ఇచ్చింది.

సమాజ స్పందన

[మార్చు]

ఈ సినిమా విడుదలకు ముందు అనేక సంస్థలు ఈ సినిమాలో వ్యక్తం చేసిన అనేక అభిప్రాయాలను వ్యతిరేకించాయి. భారత దేశంలోని అధికార పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఈ సినిమా కథానాయకుడు విజయ్ సినిమాలో జి.ఎస్.టి విషయంపై, డిజిటల్ ఇండియా పథకంపై గుప్పించిన విమర్శలపై తీవ్రంగా మండిపడింది.[32][33],[34] ఆ సన్నివేశాలను తొలగించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.[35] అయితే విపక్షాలు, అనేక మంది తమిళ సినిమా ప్రముఖులు అధికారపక్షం చేస్తున్న డిమాండ్లు భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయని పేర్కొంటూ సినిమాకు అండగా నిలిచాయి.[36][37]

తమిళనాడు ప్రభుత్వ డాక్టర్ల సంఘం వంటి అనేక వైద్య సంఘాలు ఈ సినిమాలో ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లను నీచంగా చిత్రించడాన్ని ఖండించాయి.[38]

పురస్కారాలు

[మార్చు]
అవార్డు తేదీ విభాగం స్వీకర్త (లు)/నామినేట్ చేయబడిన వారు ఫలితం Ref.
ఆనంద వికటన్ సినిమా అవార్డులు 2018 జనవరి 10 ఉత్తమ నటుడు విజయ్ గెలుపు [39]
[40]
ఉత్తమ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ గెలుపు
ఉత్తమ నేపథ్య గాయని శ్రేయ ఘోషాల్ గెలుపు
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్ నీరజ కోన, అర్చనా మెహతా, కోమల్ సహానీ, పల్లవీ సింగ్, జయలక్ష్మీ సుందరేశన్ గెలుపు
టాక్ ఆఫ్ ది టౌన్ మెర్సల్ గెలుపు
నేషనల్ ఫిల్మ్‌ అవార్డ్స్ UK 2018 మార్చి 28 ఉత్తమ విదేశీ చిత్రం హెచ్.మురళి, ఎన్.రామసామి, హేమా రుక్మిణి పెండింగ్ [41]
ఉత్తమ సహాయ నటుడు విజయ్ పెండింగ్
టెకోఫెస్ అవార్డులు 2018 ఫిబ్రవరి 19 ఉత్తమ దర్శకుడు అట్లీ కుమార్ పెండింగ్ [42]
[43]
ఉత్తమ గేయరచయిత వివేక్ పెండింగ్
ఉత్తమ ఛాయాగ్రాహకుడు జి.కె.విష్ణు పెండింగ్

మూలాలు

[మార్చు]
  1. "Mersal box office collection: Vijays film crosses Rs 20 crore in Kerala". Retrieved 17 November 2017.
  2. 2.0 2.1 Upadhyaya, Prakash. "Mersal box office collection: Vijay, Samantha's film completes 100 days". International Business Times, India Edition (in ఇంగ్లీష్). Retrieved 2018-01-26.
  3. "Ilayathalapathy Vijay's Mersal creates history; breaches Rs 250 crore mark".
  4. "Vijay: Habitual hit maker | Forbes India". Forbes India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-12-31.
  5. "MERSAL - British Board of Film Classification". www.bbfc.co.uk. Retrieved 2 November 2017.
  6. Ch Sushil, Rao (3 November 2017). "Adhirindhi' for cinema-lovers: Telugu version of `Mersal' gets censor nod". Times of India. Hyderabad. Retrieved 6 November 2017.
  7. "Adirindi Movie Review: Go watch this film if you're thirsting for some good ol' entertainment injected with a massive dose of reality". The Times of India. Retrieved 2017-12-17.
  8. Awards, National Film (2018-01-15). "Congratulations to @actorvijay nominated for #BestSupportingActor at the #NationalFilmAwardsUK for his role on the film @MersalFilm". @NATFilmAwards (in ఇంగ్లీష్). Retrieved 2018-01-16.
  9. "Nominations for 2018 National Film Awards UK announced | National Film Awards". www.nationalfilmawards.org (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2018-01-16.
  10. రాజబాబు. "మెర్సల్ (అదిరింది) మూవీ రివ్యూ". ఫిల్మీబీట్ తెలుగు. Greynium Information Technologies Pvt. Ltd. Retrieved 12 March 2018.
  11. "Sri Thenandal Films signs Ilayathalapathy Vijay?". Archived from the original on 12 సెప్టెంబరు 2016. Retrieved 24 May 2017.
  12. Upadhyaya, Prakash. "'Vijay 60': 'Bairavaa' star to collaborate with Atlee, Sri Thenandal Films". Retrieved 24 May 2017.
  13. Upadhyaya, Prakash. "Vijay 61: Sri Thenandal Films confirms producing Ilayathalapathy, Atlee's film". Retrieved 24 May 2017.
  14. Kumar, Karthik (20 March 2017) No thalapathi title for Ilayathalapathy Vijay’s film with Sri Thenandal Films!. Hindustan Times. Retrieved on 4 October 2017.
  15. "Vijay learns a few tricks for Mersal". www.deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 6 August 2017. Retrieved 7 August 2017.
  16. "Ilayathalapathy Vijay to romance Kajal, Samantha, nithya menon in his next". Retrieved 24 May 2017.
  17. "Vijay 61 official news on firstk look and theatrical release". Top 10 Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). 22 April 2017. Archived from the original on 22 ఏప్రిల్ 2017. Retrieved 22 April 2017.
  18. "Sri Thenandal Films officially announces the cast and crew details about Vijay 61". 31 January 2017. Retrieved 24 May 2017.
  19. Vjiay: Vijay, Vadivelu team up for a cop act. Times of India (16 January 2017). Retrieved on 4 October 2017.
  20. "Vijay's Mersal will not be releasing in Inox and PVR theatres chennai". 17 October 2017. Retrieved 17 November 2017.
  21. Upadhyaya, Prakash. "Vijay 61 aka Thalapathy 61 movie launched: The shooting of Ilayathalapathy-Atlee film begins". Retrieved 24 May 2017.
  22. "Nithya Menen replaces Jyothika in 'Thalapathy 61'". Archived from the original on 1 ఆగస్టు 2017. Retrieved 24 May 2017.
  23. "Vijay-Nithya Menen in hot backdrops of Jai Salmer". Top 10 Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). 5 April 2017. Archived from the original on 6 ఏప్రిల్ 2017. Retrieved 5 April 2017.
  24. మూస:Pl icon Zwiastun hinduskiego filmu, a tam... Stadion w Gdańsku, Poznań i lotnisko im. Wałęsy. Kultura.gazeta.pl (27 September 2017). Retrieved on 2017-10-04.
  25. "Bollywood movie to be shot in Poland". Archived from the original on 26 డిసెంబరు 2018. Retrieved 24 May 2017.
  26. "Inevitable FEFSI Strike – Delayed release of Mersal, Velaikkaran and Karuppan?". Top 10 Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). 7 September 2017. Archived from the original on 8 సెప్టెంబరు 2017. Retrieved 8 September 2017.
  27. "Mersal: Music of Vijay's Controversial Tamil Film Crosses 100 mn Streams". News18. Retrieved 2018-02-05.
  28. Upadhyaya, Prakash. "Mersal box office collection: Vijay's film gets an earth-shattering opening, beats Baahubali 2 in Tamil Nadu". International Business Times, India Edition (in ఇంగ్లీష్). Retrieved 2017-10-19.
  29. atlee. "#Mersal censored U/A". Retrieved 2 November 2017.
  30. "Mersal box office: Vijay's film inching towards Rs 200 crore, set to beat Enthiran record in TN".
  31. Upadhyaya, Prakash. "Mersal box office collection: A crowning-moment for Vijay as his film joins Rs 200-crore club".[permanent dead link]
  32. "'Mersal' row has Tamil film industry worried: 'We don't know what to depict in our films now'". Archived from the original on 2018-12-26. Retrieved 2018-03-12.
  33. "BJP objects to 'incorrect references' on GST in Vijay's 'Mersal'". The Hindu. 19 October 2017.
  34. "P Chidambaram on Mersal row: Soon, only films 'praising' govt policies will be allowed". The Indian Express. 21 October 2017.
  35. "Cut Scenes Mocking GST and Digital India in Vijay's Mersal, Demands BJP". News 18. 19 October 2017.
  36. "Opposition stands with Mersal". The Hindu. 22 October 2017.
  37. "Vijay vs BJP: Kollywood celebs take a stand against re-censoring Mersal". The Indian Express. 21 October 2017.
  38. "Government doctors criticise 'Mersal'". The Hindu. 21 October 2017.
  39. Upadhyaya, Prakash (11 January 2018). "Vijay's Mersal wins big at Vikatan Cinema Awards 2017 [See Complete Winners List]". International Business Times. Archived from the original on 21 January 2018. Retrieved 21 January 2018.
  40. "ஆனந்த விகடன் சினிமா விருதுகள் 2017 - திறமைக்கு மரியாதை". Ananda Vikatan (in Tamil). 11 January 2018. Archived from the original on 21 జనవరి 2018. Retrieved 12 మార్చి 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  41. "Nominations For 2018 National Film Awards UK Announced". National Film Awards UK. 15 January 2018. Archived from the original on 17 జనవరి 2018. Retrieved 12 మార్చి 2018.
  42. "T-Awards Poll". Techofes. Archived from the original on 19 ఫిబ్రవరి 2018. Retrieved 12 మార్చి 2018.
  43. "Pro Shows". Techofes. Archived from the original on 19 ఫిబ్రవరి 2018. Retrieved 12 మార్చి 2018.

బయటి లంకెలు

[మార్చు]