రఘునాథ్ ముర్ము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రఘునాథ్ ముర్ము
రఘునాథ్ ముర్ము చిత్రం
పుట్టిన తేదీ, స్థలం1905 మే 5
మయూర్‌భంజ్ రాష్ట్రం, బ్రిటీష్ రాజ్
(ఇప్పుడు మయూర్‌భంజ్, ఒడిశా, భారతదేశం)
మరణం1982 ఫిబ్రవరి 1(1982-02-01) (వయసు 76)
వృత్తిభావజాలవేత్త, నాటక రచయిత, రచయిత
జాతీయతభారతీయుడు
విషయంఓల్ చికీ వర్ణమాల

పండిట్ రఘునాథ్ ముర్ము (1905 మే 5 - 1982 ఫిబ్రవరి 1)[1] భారతీయ సంతాలీ రచయిత, విద్యావేత్త. ఆయన సంతాలీ భాష కోసం ఓల్ చికి లిపిని అభివృద్ధి చేశాడు.[2][3][4] పంతొమ్మిదవ శతాబ్దం వరకు, సంతాలీ ప్రజలకు లిఖిత భాష లేదు. కేవలం జ్ఞానం మౌఖికంగా ఒక తరం నుండి మరొక తరానికి ప్రసారం చేయబడింది. తరువాత యూరోపియన్ పరిశోధకులు, క్రిస్టియన్ మిషనరీలు సంతాలీ భాషను డాక్యుమెంట్ చేయడానికి బెంగాలీ, ఒడియా, రోమన్ లిపిలను ఉపయోగించడం ప్రారంభించారు. అయితే, సంతాలిస్‌కు వారి స్వంత లిపి ఉండాలని కృషిచేసిన ఆయన ఓల్ చికి లిపిని అభివృద్ధి చేయడం వల్ల సంతాలి సమాజం సాంస్కృతిక గుర్తింపును సుసంపన్నం చేసింది. ఓల్ చికి లిపిలో ఎన్నో పాటలు, నాటకాలు, పాఠశాల పాఠ్య పుస్తకాలు ఆయన రాశారు.[5][6]

కాగా సీనియర్ విద్యావేత్త శ్రీపతి టుడు భారత రాజ్యాంగాన్ని ఓల్ చికి లిపిలోకి అనువదించాడు. ప్రధాని నరేంద్ర మోదీ 100వ ఎపిసోడ్ మన్ కీ బాత్‌లో ఈ ప్రస్తావన తేవడంతో పాటు ఆయనను అభినందించారు.[7]

బాల్యం

[మార్చు]

రఘునాథ్ ముర్ము బైసాఖి పూర్ణిమ రోజున 1905లో భారతదేశంలోని మయూర్‌భంజ్ రాష్ట్రం (ప్రస్తుతం ఒడిషా) దండ్‌బోస్ (దహర్దిహ్) గ్రామంలో నంద్లాల్ ముర్ము, సల్మా ముర్ము దంపతులకు జన్మించాడు.[8] నంద్లాల్ ముర్ము, గ్రామ అధిపతి, అతని మామ మయూర్‌భంజ్ రాష్ట్ర రాజు ప్రతాప్ చంద్ర భంజ్‌డియో ఆస్థానంలో మున్సి. సంతాల్ ప్రజల సాంప్రదాయ సామాజిక ఆచారాల ప్రకారం పుట్టిన తరువాత ఆయనకు చును ముర్ము అని పేరు పెట్టాడు. అయితే, తరువాత అతని నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన పూజారి, అతని పేరును చును ముర్ము నుండి రఘునాథ్ ముర్ముగా మార్చాడు.

రచనలు

[మార్చు]

ఆయన ప్రధానంగా ఓల్ చికి లిపిని అభివృద్ధి చేయడం ద్వారా ప్రసిద్ది చెందాడు. అంతేకాకుండా సంతాలి సాహిత్యం, లిపికి సంబంధించి రచనలు కూడా చేసాడు. వీటిల్లో ప్రముఖ రచనలు - ఓల్ చెమెద్ (ఓల్ చికి ప్రాథమిక సిలబస్), పార్సీ పోహా (ఓల్ చికి ముఖ్యమైన అంశాలు), డేర్ గే ధోన్ (నాటకం), సిదు కన్హు (దేశభక్తి నాటకం), బిదు చందన్ (ప్రసిద్ధ ప్రేమ నాటకం), ఖేర్వాల్ బిర్ (దేశభక్తి నాటకం), హిట్టాల్ (ఖేర్వాల్స్ పురాణం, భూమి - మానవుడు పరిణామ గ్రంథం), హోర్ సెరెంగ్ (సంతాలి సాహిత్యం పాటలు), రోనర్ (సంతాలి వ్యాకరణం), ఎల్ఖా (సంతాలి గణితం)

కాగా ఆయన మొదటి పుస్తకం హోర్ సెరెంగ్, చివరి పుస్తకం రాహ్ అండోర్.[9]

మూలాలు

[మార్చు]
  1. ":: BCW Department-Govt of West Bengal, Pandit Raghunath Murmu ::". 2012-07-28. Archived from the original on 28 July 2012. Retrieved 2020-09-26.
  2. "The Politics of Difference: Ol-Chiki and Santali Identity in Eastern India" (PDF). Retrieved 29 August 2021.
  3. "Naveen declares birthday of Raghunath Murmu a holiday". Times of India. May 5, 2016. Archived from the original on 2016-05-22. Retrieved 2017-12-04.
  4. "Odisha Government Portal" (PDF). Orissa.gov.in. Retrieved 3 December 2017.
  5. Hembram, Phatik Chandra (2002). Santal, a Natural Language (in ఇంగ్లీష్). U. Hembram. p. 165.
  6. Pathy, J (1988). Ethnic Minorities in the Process of Development (in ఇంగ్లీష్). Rawat Book Sellers. p. 174. ISBN 9788170330554.
  7. "Ol Chiki Sripati Tudu expert invited to PM's Mann Ki Baat in Delhi | Kolkata News - Times of India". The Times of India. 2023-05-01. Archived from the original on 2023-05-01. Retrieved 2023-05-01.
  8. "उड़िया समझ नहीं आई तो रघुनाथ मुर्मू ने जल-जंगल, जमीन से जुड़े वर्ण गढ़ बना दी लिपि". Dainik Bhaskar (in హిందీ). 2018-12-22. Retrieved 2020-09-26.
  9. "Guru Gomke Raghunath Murmu". Retrieved 29 August 2021.