రామ్ మిరియాల
రామ్ మిరియాల | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | రామకృష్ణ మిరియాల |
ఇతర పేర్లు | చౌరస్తా రామ్ |
జననం | 30 అక్టోబర్ 1993 కోలంక, పిఠాపురం మండలం , తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
వృత్తి | గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు |
వాయిద్యాలు | ఫ్లూట్ |
క్రియాశీల కాలం | 2018 - ప్రస్తుతం |
లేబుళ్ళు |
|
సంబంధిత చర్యలు | చౌరస్తా బ్యాండ్ |
రామకృష్ణ మిరియాల తెలుగు సినిమా గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు. ఆయన జాతిరత్నాలు సినిమాలో పాడిన “చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే”,[1] కరోనా సమయంలో ‘చేతులెత్తి మొక్కుతా…’ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]రామ్ మిరియాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా , పిఠాపురం మండలం , కోలంక గ్రామంలో 30 అక్టోబర్ 1993లో జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్ వరకు తూర్పు గోదావరి జిల్లా లో పూర్తి చేసి, హైదరాబాద్ వెస్లీ కాలేజీలో బీకామ్ పూర్తి చేశాడు. రామ్ బీకామ్ పూర్తి చేశాక ఓ కార్పొరేట్ కంపెనీలో ట్యాక్స్ కన్సల్టెంట్‌గా పని చేశాడు.
సినీ జీవితం
[మార్చు]రామ్ మిరియాల రేడియో మిర్చీలో ప్రోమో ప్రొడ్యూసర్‌గా పని చేశాడు. ఆయన తన స్నేహితులు యశ్వంత్, శ్రీని, బాల, అనంత్, అక్షయ్‌తో కలసి ‘చౌరస్తా’ బ్యాండ్‌ని ఏర్పాటు చేసి ‘మాయ… మాయ…’, ‘ఊరెళ్లిపోతా మామ…’, ‘చేతులెత్తి మొక్కుతా…’ లాంటి పాటతో మంచి గుర్తింపు అందుకున్నారు. రామ్ ఆ తర్వాత సినిమాల కోసమని చౌరస్తా బ్యాండ్ నుంచి రామ్ బయటకు వచ్చేశాడు. ఆయన జాతిరత్నాలు సినిమాలో పాడిన “చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే” పాటతో మంచి గుర్తింపు అందుకున్నాడు.[3]
గాయకుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | పాట | సంగీతం | సహా గాయకులు |
---|---|---|---|---|
2019 | బ్రోచేవారెవరురా | "వగలాడి" | వివేక్ సాగర్ | వివేక్ సాగర్, బాలాజీ, మనీషా ఈరభతిని |
2020 | ఆపరేషన్ 533295 | "రేలా రే రేలా" | షాలేం | అనుదీప్ దేవ్ |
మిడిల్ క్లాస్ మెలోడీస్ | "సాంబశివ" | స్వీకర్ అగస్తి | ||
బొమ్మ బ్లాక్ బస్టర్ | "రాయే నువ్ రాయే" | ప్రశాంత్ ఆర్ విహారి | ముహీత్ భారతి, మనీషా ఈరభతిని | |
2021 | జాతిరత్నాలు | “చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే” | రధన్ | |
పాగల్ | "పాగల్" | రధన్ | మామ సింగ్ | |
పుష్పక విమానం | "శిలకా" | రామ్ మిరియాల | ||
గల్లీ రౌడీ | "పుట్టనే ప్రేమ" | రామ్ మిరియాల | ||
సెహరి | "సెహరి" | ప్రశాంత్ ఆర్ విహారి | అభిజిత్ | |
వివాహ భోజనంబు | "వాట్ ఏ మ్యాన్" | అనివీ | ||
భీమ్లా నాయక్ | "భీమ్లా నాయక్" | ఎస్.ఎస్. తమన్ | శ్రీ కృష్ణ , పృథ్వి చంద్ర | |
777 చార్లీ (డి) | "టార్చర్" | నోబిన్ పాల్ | [4] | |
2022 | చోర్ బజార్ | "జడా" | సురేష్ బొబ్బిలి | |
2023 | టిల్లు స్క్వేర్ | "టికెట్ ఎహ్ కొనకుండా" | రామ్ మిరియాల |
సంగీత దర్శకుడిగా
[మార్చు]సంవత్సరం | సౌండ్‌ట్రాక్ | గమనికలు |
---|---|---|
2021 | గల్లీ రౌడీ | "పుట్టనే ప్రేమ" |
పుష్పక విమానం | రెండు ట్రాక్‌లు మాత్రమే | |
2022 | డీజే టిల్లు | ఒకే ఒక ట్రాక్ |
లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ | ||
2023 | దాస్ కా ధమ్కీ | |
2024 | టిల్లు స్క్వేర్ | రెండు ట్రాక్‌లు మాత్రమే |
ఆయ్ |
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (4 September 2021). "చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే..తగ్గని చిట్టి హవా.. రికార్డ్స్ సృష్టిస్తోన్న సాంగ్." Archived from the original on 4 September 2021. Retrieved 23 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (29 March 2021). "తెలుగు పాటకు వెస్ట్రన్ టచ్.. రామ్ మిరియాలా - ram miriyala songs trending". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
- ↑ "Here are the singers of 777 Charlie's Torture song - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-09.