రోష్ని నాడార్
రోష్ని నాడార్ మల్హోత్రా | |
---|---|
జననం | 1980/1981 (age 43–44)[1] |
విద్య | నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ |
వృత్తి | చైర్‌పర్సన్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ |
క్రియాశీల సంవత్సరాలు | 2008 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | శిఖర్ మల్హోత్రా |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు | శివ్ నాడార్ కిరణ్ నాడార్ |
రోష్ని నాడార్ మల్హోత్రా ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. ఆమె హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్. ఆమె దేశంలో లిస్టెడ్ ఐటీ కంపెనీకి నాయకత్వం వహించిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది.[2][3] ఆమె హెచ్.సి.ఎల్ సంస్థ వ్యవస్థాపకుడు, బిలియనీర్ పారిశ్రామికవేత్త శివ్ నాడార్‌కి ఏకైక సంతానం.[4] ఆమె 2019లో ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 54వ స్థానంలో నిలిచింది.[5] ఐ.ఐ.ఎష్.ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 ప్రకారం రోష్ని నాడార్ దేశంలో అత్యంత సంపన్న మహిళ.[6] ఆమె 2020లో ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళలలో 55వ స్థానంలో నిలిచింది. ఆమె అన్ని హె.సి, ఎల్ గ్రూప్ సంస్థల హోల్డింగ్ కంపెనీ అయిన హెచ్.సి.ఎల్ కార్పొరేషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా.
విద్యాభ్యాసం
[మార్చు]ఢిల్లీలోని వసంత్ వ్యాలీ స్కూల్‌లో రోష్ని నాడార్ చదువుకుంది. రేడియో, టీవీ, ఫిల్మ్ లపై దృష్టి సారించి నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ నుండి కమ్యూనికేషన్‌లో పట్టభద్రురాలైంది. ఆమె కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎం.బి.ఎ పూర్తిచేసింది.[7]
కెరీర్
[మార్చు]హెచ్‌సిఎల్‌లో చేరడానికి ముందు ఆమె వివిధ కంపెనీలలో పనిచేసింది.[8] ఆమె చేరిన ఒక సంవత్సరంలోనే హెచ్‌సిఎల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఇఒగా పదోన్నతి పొందింది.[9][10] ఆమె తండ్రి శివ్ నాడార్ పదవీ విరమణ చేసిన తర్వాత రోష్ని నాడార్ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ అయింది.[11]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రోష్ని నాడార్ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది.[12] ఆమె 2010లో హెచ్‌సిఎల్ హెల్త్‌కేర్ వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు, అర్మాన్ (జననం 2013), జహాన్ (జననం 2017).[13]
మూలాలు
[మార్చు]- ↑ "Forbes profile: Roshni Nadar Malhotra". Forbes. Retrieved 16 September 2020.
- ↑ "HCL Tech's Roshni Nadar Is First Woman To Lead A Listed IT Company In India". Bloomberg Quint. 17 July 2020. Retrieved 17 July 2020.
- ↑ "Roshni Nadar Malhotra, India's Wealthiest Woman, New Chief Of HCL Tech". NDTV.com. Retrieved 2020-07-17.
- ↑ "HCL gen-next Roshni Nadar appointed vice-chairman of HCL Tech - Times of India". The Times of India.
- ↑ "World's Most Powerful Women". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2019-12-13.
- ↑ Nair Anand, Shilpa (25 September 2019). "Mukesh Ambani is richest Indian; Roshni Nadar tops list for women: Report". Business Standard.
- ↑ "Roshni Nadar made CEO of HCL Corp". The Hindu. 2009-07-02. Retrieved 2009-07-02.
- ↑ Singh, S. Ronendra. "The rise of an heiress: Roshni Nadar". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2019-01-03.
- ↑ "5 young guns who will take over top indian companies". Rediff.
- ↑ "Theindianrepublic.com | Netticasinoiden tasavalta – Markkinoiden hallitsija".
- ↑ "Shiv Nadar Steps Down As HCL Tech Chairman, His Daughter Roshni Nadar Malhotra To Succeed Him". NDTV.com. Retrieved 2020-07-17.
- ↑ "Roshni Nadar Takes Over As CEO Of HCL Corp". EFYtimes.com. 2009-07-02. Archived from the original on 2009-08-20. Retrieved 2009-07-02.
- ↑ Sil, Sreerupa. "Successfully Juggling Roles, Roshni Nadar Malhotra Is A True Woman". BW Businessworld (in ఇంగ్లీష్). Retrieved 2017-11-02.