వక్కలంక పద్మ
వక్కలంక పద్మ | |
---|---|
జననం | న్యూఢిల్లీ |
జాతీయత | ఇండియన్ |
ఇతర పేర్లు | పద్మ రావు |
వృత్తి | సినిమా నటి, అంతర్జాతీయ జర్నలిస్ట్ |
తల్లిదండ్రులు |
|
బంధువులు | వక్కలంక స్వప్నసుందరి (సోదరి) |
వక్కలంక పద్మ (జననం 1959 జూన్ 17) భారతీయ సినిమా నటి, అంతర్జాతీయ జర్నలిస్ట్.[1] ఆమె తెలుగు సినిమా ప్రముఖ గాయని వక్కలంక సరళ కూతురు.
కెరీర్
[మార్చు]న్యూఢిల్లీలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించిన వక్కలంక పద్మ 19 ఏళ్ల వయసులో ఒకే ఒక సినిమా గోరింటాకు (1979) లో నటించినా తెలుగు సినిమా ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.[2] దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శోభన్ బాబు సరసన వక్కలంక పద్మ నటించగా సుజాత, సావిత్రి మఖ్యపాత్రలు పోషించారు.
ఆ తరువాత ఆమె ప్రముఖ జర్మన్ మీడియాకు అంతర్జాతీయ జర్నలిస్ట్‌గా వ్యవహరిస్తోంది.
వ్యక్తిగతం
[మార్చు]తెలుగు సినిమా గాయని వక్కలంక సరళకు ఇద్దరు కూతుర్లు వక్కలంక స్వప్నసుందరి, వక్కలంక పద్మ కాగా ఒక కొడుకు ఉన్నాడు. 1979లో విడుదలైన గోరింటాకు సినిమాలో వక్కలంక పద్మ నటించింది.[3] ఇక స్వప్నసుందరి ప్రతి సంవత్సరం తల్లి జ్ఞాపకార్ధం, ఆగష్టు 8న స్వరలహరి అనే కర్ణాటక సంగీత కచ్చేరిని నిర్వహిస్తుంది. ఈ కచ్చేరీలో యువ గాయనీగాయకులు వక్కలంక సరళ స్వరపరచిన పాటలను ప్రముఖంగా పాడతారు.[4][5]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Anveshana team finds 'Gorintaku' actress Vakkalanka Padma - TV9 Exclusive, retrieved 2023-05-15
- ↑ "gorintaku movie special - Sakshi". web.archive.org. 2023-05-15. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-08-26.
- ↑ "Rhythm of recall". The Hindu. No. August 10, 2012. Retrieved 2 December 2014.
- ↑ "Hyderabad today". The Hindu. No. August 8, 2007. Retrieved 2 December 2014.