వాజుభాయ్ వాలా
వాజుభాయ్ వాలా | |||
| |||
కర్ణాటక గవర్నర్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 సెప్టెంబరు 1 [1] | |||
ముందు | కొణిజేటి రోశయ్య | ||
---|---|---|---|
పదవీ కాలం 2012 జనవరి 23 – 2014 ఆగస్టు 31 | |||
ముందు | గనపత్ వాసవ | ||
తరువాత | మంగూభాయ్ సి. పాటెల్ (acting) | ||
గుజరాత్ విధాన సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2012 డిసెంబరు 26 – 2014 ఆగస్టు 31 | |||
నియోజకవర్గం | రాజకోట్ పశ్చిమ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రాజ్‌కోట్, రాజకోట్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా | 1939 జనవరి 13||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
సంతానం | 2 కుమార్తెలు, 2 కుమారులు | ||
నివాసం | గాంధీనగర్, గుజరాత్ | ||
మతం | హిందూ | ||
మూలం | legislativebodiesinindia.nic.in |
వాజుభాయ్ రుదాభాయ్ వాలా (జననం 23 జనవరి 1937) ఒక భారతీయ రాజ నీతిజ్ఞుడు. అతను 2014 సెప్టెంబరు 1 నుండి 2021 జూలై 6 వరకు కర్ణాటక 12వ గవర్నర్‌గా పనిచేశాడు.[2] ఖుర్షీద్ ఆలం ఖాన్ తర్వాత కర్నాటకకు అత్యధిక కాలం గవర్నర్‌గా పనిచేసిన ఘనత కూడా అతనిదే.[3]
వాజుభాయ్ 2012 నుండి 2014 వరకు గుజరాత్ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. అతను ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ సభ్యుడు. అతను గుజరాత్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు, 1997 నుండి 2012 వరకు ఆర్థిక, కార్మిక, ఉపాధి వంటి వివిధ శాఖలను కలిగి ఉన్నాడు. అతను రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గం నుండి గుజరాత్ శాసనసభకు 7 సార్లు ఎన్నికయ్యాడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను రాజకీయ ప్రవేశం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా జరిగింది. అతను 1971లో జనసంఘ్ లో చేరాడు. అతను 1975 ఎమర్జెన్సీ కాలంలో 11 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాడు.[4] అతను 1980లలో రాజకోట్ కు మేయరుగా పనిచేసాడు. తరువాత రాజకోట్ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీచేసి అనేక సార్లు గెలుపొందాడు. అతను ఆర్థిక, రెవెన్యూ వంటి అనేక శాఖలకు 1998 నుండి 2012 వరకు కేబినెట్ మంత్రిగా తన సేవలనంచిందాడు. అతను రెండుసార్లు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అతను గుజరాత్ శాసనసభలో 18 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రికార్డు సంపాదించాడు. అతను డిసెంబరు 2012 నుండి ఆగస్టు 2014 వరకు అసెంబ్లీ స్పీకరుగా పనిచేసాడు. అతను సెప్టెంబరు 2014 లో కర్ణాటక రాష్ట్ర గవర్నరుగా పదవినలంకరించాడు.[1][5][6][7][8][9][10] అతనికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, ఐదుగురు మనుమలు ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Vajubhai Rudabhai Vala to take oath as Karnataka Guv on Sept 1". One India News. 30 August 2014. Archived from the original on 10 సెప్టెంబరు 2014. Retrieved 31 August 2014.
- ↑ "Vajubhai Rudabhai Vala to take oath as Karnataka Guv on Sept 1". One India News. 30 August 2014. Archived from the original on 10 September 2014. Retrieved 31 August 2014.
- ↑ "Vajubhai vala becomes the 2nd longest serving governor", The Hindu, 7 July 2021
- ↑ "'Paniwala Mayor' reinducted into Narendra Modi cabinet". One India. 13 December 2006. Retrieved 11 January 2015.
- ↑ Balan, Premal (23 January 2013). "Vaju Vala unanimously elected new speaker of Gujarat Assembly". Business Standard. Gandhinagar. Retrieved 24 January 2013.
- ↑ "Vaju Vala named 'pro tem' Speaker of Gujarat Assembly". Zee News. PTI. 26 December 2012. Retrieved 2 January 2013.
- ↑ "Vaju Vala named 'pro tem' Speaker". Indian Express. Press Trust of India. 27 December 2012. Retrieved 2 January 2013.
- ↑ "177 sworn in as MLAs". The Times of India. TNN. 23 January 2012. Archived from the original on 16 ఫిబ్రవరి 2013. Retrieved 24 January 2013.
- ↑ "Narendra Modi aide Vajubhai Vala is Karnataka governor". The Times of India. TNN. 27 August 2014. Retrieved 31 August 2014.
- ↑ "Karnataka's Governor Vajubhai Vala hails RSS,says posts don't matter". TNN. 26 August 2014. Retrieved 31 August 2014.
బయటి లింకులు
[మార్చు]- Gujarat government Archived 2016-08-14 at the Wayback Machine