శుభా ముద్గల్
శుభా ముద్గల్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | శుభా గుప్తా |
జననం | అలహాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1959 జనవరి 1
సంగీత శైలి | పాప్, జానపద సంగీతం, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, ప్లేబ్యాక్ సింగర్ |
వృత్తి | గాయని |
క్రియాశీల కాలం | 1986[1] – ప్రస్తుతం |
శుభా ముద్గల్ (జననం 1959 జనవరి 1) హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో భారతీయ గాయని. ఆమె కచేరీలలో ఖ్యాల్, తుమ్రీ, దాద్రా, ఇండియన్ పాప్ శైలులు ఉన్నాయి. ఆమె 2000లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం అందుకుంది.
బాల్యం
[మార్చు]అలహాబాద్‌లో జన్మించిన ఆమె తల్లిదండ్రులు, స్కంద్ గుప్తా, జయ గుప్తా, ఇద్దరూ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం ఆచార్యులు. వారిద్దరికీ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, కథక్‌పై ఆసక్తి ఎక్కువ. ఆమె తండ్రి తరఫు తాత పి.సి.గుప్తా కూడా అలహాబాద్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసాడు.[2][3][4][5][6]
విద్యాభ్యాసం, సంగీత శిక్షణ
[మార్చు]ఆమె అలహాబాద్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, సెయింట్ మేరీస్ కాన్వెంట్ ఇంటర్ కాలేజీలో చేరింది. చిన్నతనం నుండి ఆమె కథక్ నేర్చుకోవడం ప్రారంభించింది. ఆమె ఆ తర్వాత హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని కూడా నేర్చుకుంది. ఆమె గురువు రామశ్రేయ ఝా.
ఇంటర్ పూర్తి చేసిన ఆమె న్యూఢిల్లీ చేరుకుని ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టాపుచ్చుకుంది. అక్కడ వినయ్ చంద్ర మౌద్గల్య, వసంత్ థాకర్, జితేంద్ర అభిషేకి, నైనా దేవి, కుమార్ గంధర్వ వంటి ప్రసిద్ధ గాయకుల వద్ద ఆమె శిక్షణను కొనసాగించింది.[7]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఢిల్లీ యూనివర్శిటీ నుండి పట్టభద్రురాలయ్యాక, ఆమె తన గురువు వినయ్ చంద్ర మౌద్గల్య కుమారుడు ముకుల్ ముద్గల్‌ను వివాహం చేసుకుంది. ఆయన నిష్ణాతుడైన సంగీత విద్వాంసుడు అయినా సంగీతాన్ని వృత్తిగా కొనసాగించకూడకుండా న్యాయవాది అయ్యాడు. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన ఆ తర్వాత ముద్గల్ కమిటీకి నాయకత్వం వహించాడు.
వీరికి ఒక కుమారుడు ధవల్ ముద్గల్ ఉన్నాడు, ఈయన ఢిల్లీ ఆధారిత బ్యాండ్ హాఫ్ స్టెప్ డౌన్‌లో ప్రధాన గాయకుడు.[8][9]
అయితే శుభా ముద్గల్, ముకుల్ ముద్గల్ విడిపోయాక 2000లో ఆమె తబలా వాద్యకారుడు డాక్టర్ అనీష్ ప్రధాన్‌ను వివాహం చేసుకుంది.
అవార్డులు
[మార్చు]- "అమృత్ బీజ్" కుగాను ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ సంగీత దర్శకత్వం కోసం 1996 జాతీయ చలనచిత్ర అవార్డు.
- డాన్స్ ఆఫ్ ది విండ్ చిత్రంలో ఆమె సంగీతానికి 34వ చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 1998 గోల్డ్ ప్లేక్ అవార్డు
- 2000లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[10]
- మత సామరస్యం, శాంతి, సద్భావనను పెంపొందించడంలో ఆమె చేసిన విశేష కృషికిగానూ 2016 రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు.[11][12]
మూలాలు
[మార్చు]- ↑ Interview The Hindu, 26 November 2005.
- ↑ "On a Personal Note: Shubha Mudgal". Governance Now. 16–31 December 2016.
- ↑ An Interview with Shubha Mudgal Archived 4 మార్చి 2008 at the Wayback Machine monsoonmag.com, 2000.
- ↑ "Interview with Shubha Mudgal, singer". Moneylife.in. 2010-04-26. Archived from the original on 2014-07-09. Retrieved 2020-01-17.
- ↑ Bhargava, Anjuli (2020-03-27). "Tea with BS: Shubha Mudgal on how she found herself in the world of music". Business Standard India. Retrieved 2021-03-17.
- ↑ This above all The Tribune, 15 August 1948.
- ↑ "National Award For Best Educational/Motivational/Instructional Film". Awardsandshows.com. Retrieved 2020-01-17.
- ↑ Telegraph, The (2017-10-30). "We did not state things we couldn't corroborate'". Telegraphindia.com. Archived from the original on 18 January 2015. Retrieved 2020-01-17.
- ↑ Dasgupta, Amrita (22 July 2010). "Life notes". The Hindu. Chennai, India.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 జూలై 2015.
- ↑ "Singer Shubha Mudgal gets Rajiv Gandhi National Sadbhavana Award". Archived from the original on 9 July 2020. Retrieved 17 August 2020.
- ↑ http://www.uniindia.com/shubha-mudgal-to-get-rajiv-gandhi-national-sadbhavana-award/india/news/577353.html
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1959 జననాలు
- హిందుస్తానీ గాయకులు
- భారత చలనచిత్ర స్కోర్ కంపోజర్లు
- బాలీవుడ్ నేపథ్య గాయకులు
- కళల్లో పద్మశ్రీ గ్రహీతలు
- భారతీయ మహిళా పాప్ గాయకులు
- మహిళలు హిందుస్థానీ సంగీతకారులు
- ఉత్తర ప్రదేశ్ గాయకులు
- భారతీయ మహిళా గాయకులు
- భారతీయ మహిళా సంగీత విద్వాంసులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు
- ఢిల్లీ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు