సోమరాజు సుశీల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోమరాజు సుశీల
జననంఏప్రిల్ 28, 1945
తూర్పు గోదావరి జిల్లా సిద్ధం గ్రామం
మరణంసెప్టెంబర్ 26, 2019
హైదరాబాదు
మరణ కారణంగుండెపోటు
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తిపారిశ్రామికవేత్త
ప్రసిద్ధిరచయిత్రి
భార్య / భర్తసోమరాజు
పిల్లలుశైలజ ఆకుండి,
సోమరాజు శ్రీకాంత్

సోమరాజు సుశీల ప్రసిద్ధ తెలుగు రచయిత్రి.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె తూర్పుగోదావరి జిల్లా, సిద్ధం గ్రామంలో 1945, ఏప్రిల్ 28న జన్మించింది. రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ చేసింది. విజయవాడ స్టెల్లా మేరీ కాలేజీలో కెమిస్ర్టీ లెక్చరర్‌గాను, తరువాత 1966 నుండి 1974 వరకు పూణెలోని నేషనల్‌ కెమికల్‌ లేబొరేటరీలో పనిచేసింది. 1974లో హైదరాబాద్ లో భాగ్యనగర్‌ లేబొరేటరీస్‌ సంస్థను ఏర్పాటు చేసింది. సుదీర్ఘకాలం సుశీల అఖిలభారత మహిళా శాస్త్రవేత్తల సంఘం అధ్యక్షురాలిగానూ, భారతీయ తయారీ సంస్థల సంఘం అధ్యక్షురాలిగానూ బాధ్యతలు నిర్వహించింది. 2014 వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ బౌద్ధిక్‌ ప్రముఖ్‌గా, ప్రాంత సంపర్క్‌ ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. ఈమెకు భర్త సోమరాజు, కూతురు శైలజ ఆకుండి, కుమారుడు సోమరాజు శ్రీకాంత్‌లు ఉన్నారు.[1]

సాహిత్యసేవ

[మార్చు]

ఈమె చాలా ఆలస్యంగా తన నడిమి వయసులో కలం పట్టి, మంచి రచనలను సృజించింది. ఇల్లేరమ్మ కథలతో ప్రసిద్ధికెక్కింది. శాస్త్రవేత్త డాక్టర్‌ వై.నాయుడమ్మ జీవితకథను ఆయన కోరికమేరకు రచించింది. ఓ పత్రికలో పెళ్ళిపందిరి శీర్షికను చివరిదాకా కొనసాగించింది. తన రచనల్లో హాస్యానికి పెద్దపీట వేసింది.[2]

రచనలు

[మార్చు]
  1. ధర్మవిజయం (అనువాదం)
  2. ముగ్గురు కొలంబస్‌లు
  3. ఇల్లేరమ్మ కథలు
  4. చిన్నపరిశ్రమలు - పెద్దకథలు
  5. దీపశిఖ
  6. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డా||.వై.నాయుడమ్మ
  7. పథదర్శిని శ్రీరామకథ (అనువాదం)

పురస్కారాలు

[మార్చు]
  • కందుకూరి రామభద్రరావు పురస్కారం

మరణం

[మార్చు]

ఈమె 2019, సెప్టెంబర్ 26 గురువారం నాడు హైదరాబాదులోని తన స్వగృహంలో గుండెపోటుతో తన 74వ యేట మరణించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి దినపత్రిక https://epaper.andhrajyothy.com/2346557/Hyderabad/27-09-2019#page/12/1 (26 September 2019). Retrieved 5 November 2019
  2. విలేకరి (26 September 2019). ఆంధ్రజ్యోతి దినపత్రిక https://epaper.andhrajyothy.com/2346557/Hyderabad/27-09-2019#page/12/1
  3. విలేకరి (26 September 2019). "సోమరాజు సుశీల మరణం". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 5 November 2019.[permanent dead link]