2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కర్నాటక అసెంబ్లీ నియోజకవర్గాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
కర్ణాటక రాష్ట్రంలో 2018 మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 224 స్థానాలకు జరగవలసిన ఎన్నికలలో 222 అసెంబ్లీ స్థానాలకుమాత్రెమే ఈ ఎన్నికలు జరిగినవి. మిగిలిన రెండు స్థానాలైన విజయనగర శాసనసభ నియోజకవర్గంలో ఎం.ఎల్.ఎ మరణం వల్ల, రాజరాజేశ్వరి నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల మోసం అభియోగం వల్ల ఎన్నికలు వాయిదా వేయబడినవి. ఈ స్థానాలలో 2018 మే 28 న ఎన్నికలు జరుగుతాయి.[2] భారతీయ జనతా పార్టీ 2007 లో, 2008 నుండి 2013 వరకు ప్రభుత్వం ఏర్పాటుచేసింది. బహుజన్ సమాజ్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు కూటమి కలసి పోటీ చేసింది. ఆమ్‌ఆదమీ పార్టీ మొదటి సారి ఈ రాష్ట్రంలో పోటీ చేసింది.[3]
ఈ ఎన్నికల ఫలితాలలో వివిధ పార్టీలకు లభించిన సీట్ల ఆధారంగా హంగ్ అసెంబ్లీకి దారితీసింది. 104 సీట్లతో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు సంపాదించింది. కానీ ప్రభుత్వానికి సరిపడే మెజారిటీ (113) ను సాధించలేకపోయింది.[4] 2013 లో ఎన్నికలు జరిగినప్పటి నుంచి రాష్ట్రాన్ని పాలించిన భారత జాతీయ కాంగ్రెస్ కు 78 సీట్లు వచ్చాయి. అది ఏ పార్టీకి సరిపడే మెజారిటీ లేనందున ఉప ఎన్నిక కావాలని కోరింది.
నేపధ్యం
[మార్చు]కర్నాటక అసెంబ్లీ కాలం 2018 మే 28 నాటికి ముగుస్తుంది.[5]
ఎన్నికల షెడ్యూల్
[మార్చు]భారత ఎన్నికల కమిషన్ చే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 2018 మార్చి 27 న ప్రకటించబడింది. ఒకే దశలో ఎన్నికల పోలింగును మే 12 న జరిపి, మే 15నాటికి ఫలితాలు ప్రకంటించాలని అందులో ఉంది.[6] ఈ ప్రకటన వెలువడిన నాటి నుండి ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోనికి వచ్చింది.[7][8]
విషయం | తేదీ | వారం |
నామినేషన్ల తేదీ | 2018 ఏప్రిల్ 17 | మంగళవారం |
నామినేషన్ల చివరితేదీ | 2018 ఏప్రిల్ 24 | మంగళవారం |
నామినేషన్ల పరిశీలన | 2018 ఏప్రిల్ 25 | బుధవారం |
నామినేషన్ల ఉపసంహరణ | 2018 ఏప్రిల్ 27 | శుక్రవారం |
ఎన్నికల తేదీ | 2018 మే 12 | శనివారం |
ఎన్నికల కౌంటింగ్ | 2018 మే 15 | మంగళవారం |
ఎన్నికల ప్రక్రియ పూర్తవడానికి తేదీ | 2018 మే 31 | గురువారం |
ఎన్నికల ప్రచారం
[మార్చు]భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని 2017, నవంబరు 2 న ప్రారంభించింది.[9] ఈ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో 85 రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించి 2018 ఫిబ్రవరి 4 తో ముగించింది. ఈ ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పాల్గొన్నాడు.[10] మార్చి మొదటి వారంలో 14 రోజుల బెంగళూరు పాదయాత్రను చేసింది.[11]
ఎన్నికల ప్రచారంలో భాగం కాకపోయినా కర్ణాటక కాంగ్రెస్ కమిటీ డిసెబరు 2017 న కర్నాటక రాష్ట్రంలో 54,261 చోట్ల బూత్ స్థాయి కమిటీలను వేసి ప్రభుత్వ కార్యకలాపాలను వివిధ కార్యక్రమాల ద్వారా అందరికీ తెలియజేయాలని నిర్ణయించింది. ఈ విస్తృతమైన కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రచారం కూడా జరిగింది.[12]
ఎగ్జిట్ పోల్స్
[మార్చు]వివిధ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ లో భారతీయ జనతాపార్టీ అధికారంలోనికి వస్తుందని ఒక సంస్థ జోస్యం చెప్పగా, ఐదు సంస్థలు బి.జె.పికి ఎక్కువ స్థానాలు వస్తాయని తెలిపాయి. రెండు సంస్థలు కాంగ్రెస్ అధికారంలోనికి వస్తుందని చెప్పాయి.
పోలింగ్ సంస్థ | ప్రచురణ తేదీ | ఆధిక్యం | ||||
---|---|---|---|---|---|---|
బి.జె.పి | కాంగ్రెస్ | జె.డి.ఎస్ | ఇతరులు | |||
ఇండియా TV-VMR[13] | 12 May 2018 | 94 | 97 | 28 | 3 | 3 |
రిపబ్లిక్ TV-జన్ కీ బాత్ [14] | 12 May 2018 | 105 | 78 | 37 | 2 | 27 |
ABP న్యూస్-C ఓటర్[15] | 12 May 2018 | 110 | 88 | 24 | 2 | 22 |
టైమ్స్ నౌ-VMR[16] | 12 May 2018 | 87 | 97 | 35 | 3 | 10 |
టమ్స్ నౌ-టుడేస్ చాణక్య[17] | 12 May 2018 | 120 | 73 | 26 | 3 | 47 |
ఇండియా టుడే - ఏక్సిస్ మై ఇండియా [18] | 12 May 2018 | 85 | 111 | 26 | 0 | 26 |
న్యూస్ X-CNX[19] | 12 May 2018 | 106 | 75 | 37 | 4 | 31 |
న్యూస్ నేషన్ [20] | 12 May 2018 | 107 | 73 | 38 | 4 | 34 |
ఫలితాలు
[మార్చు]Parties and coalitions | Popular vote | Seats | ||||
---|---|---|---|---|---|---|
Votes | % | ±pp | Won | +/− | ||
భారతీయ జనతా పార్టీ (BJP) | 1,31,85,384 | 36.2 | 104 | 64 | ||
భారత జాతీయ కాంగ్రెస్ (INC) | 1,38,24,005 | 38.0 | 78 | 44 | ||
జనతాదళ్ (సెక్యులర్) (JDS) | 66,66,307 | 18.3 | 37 | 3 | ||
స్వతంత్రులు (IND) | 14,37,045 | 3.9 | 1 | 8 | ||
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) | 1,08,592 | 0.3 | 1 | 1 | ||
కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (KPJP) | 74,229 | 0.2 | 1 | 1 | ||
ఇతర పార్టీలు, నాయకులు | 6,83,632 | 2.2 | 0 | 13 | ||
(NOTA) | 3,22,841 | 0.9 | ||||
ఖాళీ స్థానాలు | 2 | 2 | ||||
Total | 100.00 | 224 | ±0 |
1999 నుండి 2018 వరకు వివిధ పార్టీల సీట్లలో మార్పులు
[మార్చు]పార్టీల ఓట్ల శాతం
[మార్చు]- బిజెపి కంటే కాంగ్రెస్ అత్యధిక ఓట్లను సాధించింది.
పార్టీ | ఓట్లశాతం | పొందిన ఓట్లు | |
---|---|---|---|
1 | భారత జాతీయకాంగ్రెస్ | 38% | 1,37,63,500 |
2 | భారతీయ జనతాపార్టీ | 36.2% | 1,31,20,300 |
3 | జనతాదళ్ సెక్యులర్ | 18.4% | 66,48700 |
4 | స్వతంత్రులు | 4.00% | 14,34,951 |
5 | బహుజన సమాజ పార్టీ | 0.3% | 1,08592 |
6 | ఎ.ఐ.ఎం ఇపి | 0.33% | 97,572 |
7 | బి.పి.జె.పి | 0.2% | 83,071 |
8 | సి.పి.ఎం | 0.2% | 81,181 |
9 | స్వరాజ్ | 0.2% | 94,000 |
10 | కె.పి.జి.పి | 0.2% | 74,229 |
11 | నోటా | 0.9% | 3,09573 |
12 | ఇతరులు | - |
గవర్నర్ నిర్ణయం - వివాదాలు
[మార్చు]కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌లకు 118 సీట్లతో పూర్తి మద్దతు ఉంది. బీజేపీకి కేవలం 104 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయినా గవర్నర్ వాజుభాయ్ వాలా బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినదిగా సూచించాడు. అసెంబ్లీలో బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చాడు. కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప 2018 మే 17న ప్రమాణస్వీకారం చేశాడు. గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నిర్ణయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్, జె.డి.ఎస్ పార్టీలు సుప్రీం కోర్టులో కేసు వేసాయి. మే 19 సాయంత్రం నాలుగు గంటలకు బల పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే బల పరీక్షకు కనీసం వారం రోజులు సమయం కావాలన్న బీజేపీ వాదనలను కోర్టు తిరస్కరించింది. బలపరీక్షకు ఏర్పాట్లు చేయాలని కర్నాటక డీజీపీని కోర్టు ఆదేశించింది.[21] ఈ బల పరీక్షను ప్రోటెం స్పీకరు నిర్వహించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలకనుగుణంగా గవర్నర్ ప్రోటెం స్పీకరుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను నియమించాడు. బోపయ్య 2010 అక్టోబరులో అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్పపై తిరుగుబాటు చేసిన 11మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుని, ప్రభుత్వాన్ని నిలబెట్టాడు. కర్ణాటక హైకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించినా, సుప్రీంకోర్టు మాత్రం దీన్ని తప్పుబట్టింది. ఈ నేపథ్యం గల వ్యక్తిని స్పీకరుగా పారదర్శకంగా వ్యవహరించడని కాంగ్రెస్, జె.డి.ఎస్ పార్టీ నాయకులు మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018 మే 19 న ప్రోటెం స్పీకర్ నియామకం చెల్లదన్న కాంగ్రెస్, జేడీఎస్ వాదనలను సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. అసెంబ్లీలో నిర్వహించే విశ్వాస పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.[22] 2018 మే 19 ఉదయం 11 గంటలకు శాసన సభ సమావేశం జరిగింది. ప్రోటెం స్పీకర్ బోపయ్య ముందుగా ఎన్నికైన శాసన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించాడు. మొదట భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం పెంచుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది. రెండు రోజుల పాటు (55 గంటలు) ముఖ్యమంత్రిగా కొనసాగిన యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. అందువల్ల విశ్వాస పరీక్షకు ఆస్కారం లేకుండా పోయింది.[23]
కాంగ్రెస్- జె.డి.ఎస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంగీకారాన్ని గవర్నరుకు తెలిపాయి. దీని ఫలితంగా కర్నాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర ప్రమాణం స్వీకారం చేశారు. వారి చేత 2018 మే 23న గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణం చేయించాడు. కర్నాటక విధాన సౌధ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది జేడీఎస్, కాంగ్రెస్, బీఎస్పీ, ఇతర పార్టీల కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.[24]
అవిశ్వాస తీర్మానం
[మార్చు]కర్నాటకలో 23/జులై/2019 లో కాంగ్రస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూలిపోయింది. కర్నాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో కుమార సర్కారు మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమైంది. సభలో మెజార్టీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ ఎమ్మెల్యేలు 105 మంది ఉన్నారు. మరో వైపు రెబల్స్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య కేవలం 101 మాత్రమే ఉంది. కాగా స్పీకర్, నామినేటేడ్ ఎమ్మెల్యేలను తీసివేస్తే అధికారపక్షం బలం 99కి పరిమితం అయ్యింది. 15 మంది రెబల్స్, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు అయ్యారు. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. హెడ్ కౌంట్ ద్వారా సభ్యులను లెక్కించారు. విశ్వాస పరీక్షలో అధికార పక్షం ఓట్లు 99 కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు దక్కాయి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]# | నియోజకవర్గం | విజేత[25][26] | ద్వితియ విజేత | మార్జిన్ | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
అభ్యర్థి | పార్టీ | ఓట్లు | ద్వితియ విజేత | పార్టీ | ఓట్లు | |||||
బెలగావి జిల్లా | ||||||||||
1 | నిప్పాణి | శశికళ జోలె | బీజేపీ | 87,006 | కాకాసో పాండురంగ్ పాటిల్ | కాంగ్రెస్ | 78,500 | 8,506 | ||
2 | చిక్కోడి-సదలగా | గణేష్ హుక్కేరి | కాంగ్రెస్ | 91,467 | అన్నాసాహెబ్ జోల్లె | బీజేపీ | 80,898 | 10,569 | ||
3 | అథని | మహేష్ కుమతల్లి | కాంగ్రెస్ | 82,094 | లక్ష్మణ్ సవాడి | బీజేపీ | 79,763 | 2,331 | ||
4 | కాగ్వాడ్ | శ్రీమంత్ పాటిల్ | కాంగ్రెస్ | 83,060 | భరమగౌడ అలగౌడ కేగే | బీజేపీ | 50,118 | 32,942 | ||
5 | కుడచి (ఎస్.సి) | పి. రాజీవ్ | బీజేపీ | 67,781 | అమిత్ షామా ఘటగే | కాంగ్రెస్ | 52,773 | 15,008 | ||
6 | రాయబాగ్ (ఎస్.సి) | దుర్యోధన్ ఐహోలె | బీజేపీ | 67,502 | ప్రదీప్కుమార్ రాము మాలగే | కాంగ్రెస్ | 50,954 | 16,548 | ||
7 | హుక్కేరి | ఉమేష్ కత్తి | బీజేపీ | 83,588 | అప్పయ్యగౌడ బాసగౌడ పాటిల్ | కాంగ్రెస్ | 68,203 | 15,385 | ||
8 | అరభావి | బాలచంద్ర జార్కిహోళి | బీజేపీ | 96,144 | భీమప్ప గుండప్ప గడద్ | జేడీఎస్ | 48,816 | 47,328 | ||
9 | గోకాక్ | రమేష్ జార్కిహోళి | కాంగ్రెస్ | 90,249 | అశోక్ పూజారి | బీజేపీ | 75,969 | 14,280 | ||
10 | యెమకనమర్డి (ఎస్.టి) | సతీష్ జార్కిహోళి | కాంగ్రెస్ | 73,512 | అస్తగి మారుతి మల్లప్ప | బీజేపీ | 70,662 | 2,850 | ||
11 | బెల్గాం ఉత్తర | అనిల్ ఎస్ బెనకే | బీజేపీ | 79,060 | ఫైరోజ్ నూరుద్దీన్ సేత్ | కాంగ్రెస్ | 61,793 | 17,267 | ||
12 | బెల్గాం దక్షిణ | అభయ్ పాటిల్ | బీజేపీ | 84,498 | ఎండి లక్ష్మీనారాయణ | కాంగ్రెస్ | 25,806 | 58,692 | ||
13 | బెల్గాం రూరల్ | లక్ష్మీ హెబ్బాల్కర్ | కాంగ్రెస్ | 102,040 | సంజయ్ పాటిల్ | బీజేపీ | 50,316 | 51,724 | ||
14 | ఖానాపూర్ | అంజలి నింబాల్కర్ | కాంగ్రెస్ | 36,649 | విఠల్ సోమన్న హలగేకర్ | బీజేపీ | 31,516 | 5,133 | ||
15 | కిత్తూరు | మహంతేష్ దొడ్డగౌడర్ | బీజేపీ | 73,155 | ఇనామ్దార్ దానప్పగౌడ బసనగౌడ | కాంగ్రెస్ | 40,293 | 32,862 | ||
16 | బైల్‌హోంగల్ | మహంతేష్ కౌజాలగి | కాంగ్రెస్ | 47,040 | జగదీష్ మెట్‌గూడ | Ind | 41,918 | 5,122 | ||
17 | సౌందట్టి ఎల్లమ్మ | ఆనంద్ మామణి | బీజేపీ | 62,480 | ఆనంద్ చోప్రా | Ind | 56,189 | 6,291 | ||
18 | రామదుర్గ్ | మహదేవప్ప యాద్వాడ్ | బీజేపీ | 68,349 | అశోక్ మహదేవప్ప పట్టన్ | కాంగ్రెస్ | 65,474 | 2,875 | ||
బాగల్‌కోట్ జిల్లా | ||||||||||
19 | ముధోల్ (ఎస్.సి) | గోవింద్ కర్జోల్ | బీజేపీ | 76,431 | బండివద్దర్ సతీష్ చిన్నప్ప | కాంగ్రెస్ | 60,949 | 15,482 | ||
20 | తెరాల్ | సిద్దూ సవాడి | బీజేపీ | 87,583 | ఉమాశ్రీ | కాంగ్రెస్ | 66,470 | 21,113 | ||
21 | జమఖండి | సిద్దు న్యామగౌడ \ | కాంగ్రెస్ | 49,245 | శ్రీకాంత్ కులకర్ణి | బీజేపీ | 46,450 | 2,795 | ||
22 | బిల్గి | మురుగేష్ నిరాణి | బీజేపీ | 85,135 | జె.టి. పాటిల్ | కాంగ్రెస్ | 80,324 | 4,811 | ||
23 | బాదామి | సిద్ధరామయ్య | కాంగ్రెస్ | 67,599 | బి. శ్రీరాములు | బీజేపీ | 65,903 | 1,696 | ||
24 | బాగల్‌కోట్ | వీరభద్రయ్య చరంతిమఠ్ | బీజేపీ | 85,653 | హెచ్.వై. మేటి | కాంగ్రెస్ | 69,719 | 15,934 | ||
25 | హంగుండ్ | దొడ్డనగౌడ పాటిల్ | బీజేపీ | 65,012 | విజయానంద్ కాశప్పనవర్ | కాంగ్రెస్ | 59,785 | 5,227 | ||
బీజాపూర్ జిల్లా | ||||||||||
26 | ముద్దేబిహాల్ | అమీనప్ప గౌడ పాటిల్ (నడహళ్లి) | బీజేపీ | 63,512 | సి.ఎస్. నాదగౌడ | కాంగ్రెస్ | 54,879 | 8,633 | ||
27 | దేవర్ హిప్పర్గి | సోమనగౌడ బి పాటిల్ (శాసనూరు) | బీజేపీ | 48,245 | భీమనగౌడ పాటిల్ | జేడీఎస్ | 44,892 | 3,353 | ||
28 | బసవన బాగేవాడి | శివానంద్ పాటిల్ | కాంగ్రెస్ | 58,647 | సోమనగౌడ బి. పాటిల్ | జేడీఎస్ | 55,461 | 3,186 | ||
29 | బబలేశ్వర్ | ఎంబీ పాటిల్ | కాంగ్రెస్ | 98,339 | విజయకుమార్ సిద్రాంగౌడ్ పాటిల్ | బీజేపీ | 68,624 | 29,715 | ||
30 | బీజాపూర్ సిటీ | బసంగౌడ పాటిల్ యత్నాల్ | బీజేపీ | 76,308 | అబ్దుల్ హమీద్ ముష్రిఫ్ | కాంగ్రెస్ | 69,895 | 6,413 | ||
31 | నాగతన్ (ఎస్.సి) | దేవానంద్ ఫూలాసింగ్ చవాన్ | జేడీఎస్ | 59,709 | కటకడోండ్ విట్టల్ దొండిబా | కాంగ్రెస్ | 54,108 | 5,601 | ||
32 | ఇండి | యశవంతరాయగౌడ విటాలగౌడ పాటిల్ | కాంగ్రెస్ | 50,401 | బి.డి. పాటిల్ హంజాగి | జేడీఎస్ | 40,463 | 9,938 | ||
33 | సిందగి | MC మనగూలి | జేడీఎస్ | 70,865 | రమేష్ భూసనూర్ | బీజేపీ | 61,560 | 9,305 | ||
గుల్బర్గా జిల్లా | ||||||||||
34 | అఫ్జల్‌పూర్ | ఎం.వై. పాటిల్ | కాంగ్రెస్ | 71,735 | మాలికయ్య గుత్తేదార్ | బీజేపీ | 61,141 | 10,594 | ||
35 | జేవర్గి | అజయ్ సింగ్ | కాంగ్రెస్ | 68,508 | దొడ్డప్ప గౌడ ఎస్.పాటిల్ నరిబోలు | బీజేపీ | 52,452 | 16,056 | ||
యాద్గిర్ జిల్లా | ||||||||||
36 | షోరాపూర్ (ఎస్.టి) | నరసింహ నాయక్ | బీజేపీ | 104,426 | రాజా వెంకటప్ప నాయక్ | కాంగ్రెస్ | 81,858 | 22,568 | ||
37 | షాహాపూర్ | శరణబస్సప్ప దర్శనపూర్ | కాంగ్రెస్ | 78,642 | గురు పాటిల్ సిర్వాల్ | బీజేపీ | 47,668 | 30,974 | ||
38 | యాద్గిర్ | వెంకటరెడ్డి ముద్నాల్ | బీజేపీ | 62,227 | డాక్టర్ ఎబి మలక రెడ్డి | కాంగ్రెస్ | 49,346 | 12,881 | ||
39 | గుర్మిత్కల్ | నాగంగౌడ్ కండ్కూర్ | జేడీఎస్ | 79,627 | బాబూరావు చించనసూర్ | కాంగ్రెస్ | 55,147 | 24,480 | ||
గుల్బర్గా జిల్లా | ||||||||||
40 | చిట్టాపూర్ (ఎస్.సి) | ప్రియాంక్ ఎం. ఖర్గే | కాంగ్రెస్ | 69,700 | వాల్మీకి నాయక్ | బీజేపీ | 65,307 | 4,393 | ||
41 | సేడం | రాజ్ కుమార్ పాటిల్ | బీజేపీ | 80,668 | శరణ్ ప్రకాష్ పాటిల్ | కాంగ్రెస్ | 73,468 | 7,200 | ||
42 | చించోలి (ఎస్.సి) | డా. ఉమేష్ జి. జాదవ్ | కాంగ్రెస్ | 73,905 | సునీల్ వల్ల్యాపురే | బీజేపీ | 54,693 | 19,212 | ||
43 | గుల్బర్గా రూరల్ (ఎస్.సి) | బసవరాజ్ మట్టిముడ్ | బీజేపీ | 61,750 | విజయ్‌కుమార్ జి. రామకృష్ణ | కాంగ్రెస్ | 49,364 | 12,386 | ||
44 | గుల్బర్గా దక్షిణ | దత్తాత్రయ సి. పాటిల్ రేవూరు | బీజేపీ | 64,788 | అల్లంప్రభు పాటిల్ | కాంగ్రెస్ | 59,357 | 5,431 | ||
45 | గుల్బర్గా ఉత్తర | కనీజ్ ఫాతిమా | కాంగ్రెస్ | 64,311 | చంద్రకాంత్ బి. పాటిల్ | బీజేపీ | 58,371 | 5,940 | ||
46 | ఆలంద్ | సుభాష్ గుత్తేదార్ | బీజేపీ | 76,815 | బిఆర్ పాటిల్ | కాంగ్రెస్ | 76,118 | 697 | ||
బీదర్ జిల్లా | ||||||||||
47 | బసవకల్యాణ్ | బి. నారాయణరావు | కాంగ్రెస్ | 61,425 | మల్లికార్జున్ ఖూబా | బీజేపీ | 44,153 | 17,272 | ||
48 | హుమ్నాబాద్ | రాజశేఖర్ బసవరాజ్ పాటిల్ | కాంగ్రెస్ | 74,945 | సుభాష్ | బీజేపీ | 43,131 | 31,814 | ||
49 | బీదర్ సౌత్ | బందెప్ప కాశెంపూర్ | జేడీఎస్ | 55,107 | డాక్టర్ శైలేంద్ర బెల్డేల్ | బీజేపీ | 42,365 | 12,742 | ||
50 | బీదర్ | రహీమ్ ఖాన్ | కాంగ్రెస్ | 73,270 | సూరయ్యకాంత్ నాగమర్పల్లి | బీజేపీ | 63,025 | 10,245 | ||
51 | భాల్కి | ఈశ్వర ఖండ్రే | కాంగ్రెస్ | 84,673 | డీకే సిద్రాం | బీజేపీ | 63,235 | 21,438 | ||
52 | ఔరాద్ (ఎస్.సి) | ప్రభు చౌహాన్ | బీజేపీ | 75,061 | విజయ్‌కుమార్ | కాంగ్రెస్ | 64,469 | 10,592 | ||
రాయచూరు జిల్లా | ||||||||||
53 | రాయచూర్ రూరల్ (ఎస్.టి) | బసనగౌడ దద్దల్ | కాంగ్రెస్ | 66,656 | తిప్పరాజు హవాల్దార్ | బీజేపీ | 56,692 | 9,964 | ||
54 | రాయచూరు | డాక్టర్ శివరాజ్ పాటిల్ | బీజేపీ | 56,511 | సయ్యద్ యాసీన్ | కాంగ్రెస్ | 45,520 | 10,991 | ||
55 | మాన్వి (ఎస్.టి) | రాజా వెంకటప్ప నాయక్ | జేడీఎస్ | 53,548 | డాక్టర్ తనుశ్రీ ప్రీతి | Ind | 37,733 | 15,815 | ||
56 | దేవదుర్గ (ఎస్.టి) | కె. శివనగౌడ నాయక్ | బీజేపీ | 67,003 | ఎ. రాజశేఖర్ నాయక్ | కాంగ్రెస్ | 45,958 | 21,045 | ||
57 | లింగ్సుగూర్ (ఎస్.సి) | డిఎస్ హూలగేరి | కాంగ్రెస్ | 54,230 | బండి సిద్దు | జేడీఎస్ | 49,284 | 4,946 | ||
58 | సింధనూరు | వెంకట్రావు నాథగౌడ | జేడీఎస్ | 71,514 | బాదర్లీ హంపన్‌గౌడ | కాంగ్రెస్ | 69,917 | 1,597 | ||
59 | మాస్కి (ఎస్.టి) | ప్రతాప్ గౌడ పాటిల్ | కాంగ్రెస్ | 60,387 | బసనగౌడ తుర్విహాల్ | బీజేపీ | 60,174 | 213 | ||
కొప్పళ జిల్లా | ||||||||||
60 | కుష్టగి | అమరగౌడ బయ్యాపూర్ | కాంగ్రెస్ | 87,566 | దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్ | బీజేపీ | 69,535 | 18,031 | ||
61 | కనకగిరి (ఎస్.సి) | బసవరాజ్ దడేసుగూర్ | బీజేపీ | 87,735 | శివరాజ్ తంగడగి | కాంగ్రెస్ | 73,510 | 14,225 | ||
62 | గంగావతి | పరన్న మునవల్లి | బీజేపీ | 67,617 | ఇక్బాల్ అన్సారీ | కాంగ్రెస్ | 59,644 | 7,973 | ||
63 | యెల్బుర్గా | హాలప్ప ఆచార్ | బీజేపీ | 79,072 | బసవరాజ రాయరెడ్డి | కాంగ్రెస్ | 65,754 | 13,318 | ||
64 | కొప్పల్ | కె. రాఘవేంద్ర హిట్నాల్ | కాంగ్రెస్ | 98,783 | అమరేష్ సంగన్న కరడి | బీజేపీ | 72,432 | 26,351 | ||
గడగ్ జిల్లా | ||||||||||
65 | శిరహట్టి (ఎస్.సి) | రామప్ప లమాని | బీజేపీ | 91,967 | దొడ్డమని రామకృష్ణ శిద్లింగప్ప | కాంగ్రెస్ | 61,974 | 29,993 | ||
66 | గడగ్ | HK పాటిల్ | కాంగ్రెస్ | 77,699 | అనిల్ మెన్సినాకై | బీజేపీ | 75,831 | 1,868 | ||
67 | రాన్ | కలకప్ప బండి | బీజేపీ | 83,735 | గురుపాదగౌడ పాటిల్ | కాంగ్రెస్ | 76,401 | 7,334 | ||
68 | నరగుండ్ | సిసి పాటిల్ | బీజేపీ | 73,045 | బిఆర్ యావగల్ | కాంగ్రెస్ | 65,066 | 7,979 | ||
ధార్వాడ్ జిల్లా | ||||||||||
69 | నవలగుండ్ | శంకర్ పాటిల్ మునేనకొప్ప | బీజేపీ | 65,718 | NH కోనారెడ్డి | జేడీఎస్ | 45,197 | 20,521 | ||
70 | కుండ్‌గోల్ | సిఎస్ శివల్లి | కాంగ్రెస్ | 64,871 | చిక్కనగౌడ్ర సిద్దనగౌడ్ ఈశ్వరగౌడ్ | బీజేపీ | 64,237 | 634 | ||
71 | ధార్వాడ్ | అమృత్ దేశాయ్ | బీజేపీ | 85,123 | వినయ్ కులకర్ణి | కాంగ్రెస్ | 64,783 | 20,340 | ||
72 | హుబ్లీ-ధార్వాడ తూర్పు (ఎస్.సి) | అబ్బయ్య ప్రసాద్ | కాంగ్రెస్ | 77,080 | చంద్రశేఖర్ గోకాక్ | బీజేపీ | 55,613 | 21,467 | ||
73 | హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ | జగదీష్ షెట్టర్ | బీజేపీ | 75,794 | డా. మహేష్ నల్వాడ్ | కాంగ్రెస్ | 54,488 | 21,306 | ||
74 | హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ | అరవింద్ బెల్లాడ్ | బీజేపీ | 96,462 | మహ్మద్ ఇస్మాయిల్ తమత్గార్ | కాంగ్రెస్ | 55,975 | 40,487 | ||
75 | కల్ఘాట్గి | సీఎం నింబన్నవర్ | బీజేపీ | 83,267 | సంతోష్ లాడ్ | కాంగ్రెస్ | 57,270 | 25,997 | ||
ఉత్తర కన్నడ | ||||||||||
76 | హలియాల్ | ఆర్వీ దేశపాండే | కాంగ్రెస్ | 61,577 | సునీల్ హెగాడే | బీజేపీ | 56,437 | 5,140 | ||
77 | కార్వార్ | రూపాలి నాయక్ | బీజేపీ | 60,339 | ఆనంద్ అస్నోటికర్ | జేడీఎస్ | 46,275 | 14,064 | ||
78 | కుమటా | దినకర్ కేశవ్ శెట్టి | బీజేపీ | 59,392 | శారదా మోహన్ శెట్టి | కాంగ్రెస్ | 26,642 | 32,750 | ||
79 | భత్కల్ | సునీల్ బిలియా నాయక్ | బీజేపీ | 83,172 | MS వైద్య | కాంగ్రెస్ | 77,242 | 5,930 | ||
80 | సిర్సి | విశ్వేశ్వర హెగ్డే కాగేరి | బీజేపీ | 70,595 | భీమన్న నాయక్ | కాంగ్రెస్ | 53,134 | 17,461 | ||
81 | ఎల్లాపూర్ | అర్బైల్ శివరామ్ హెబ్బార్ | కాంగ్రెస్ | 66,290 | అందాలగి వీరభద్రగౌడ శివనగౌడ పాటిల్ | బీజేపీ | 64,807 | 1,483 | ||
హావేరి జిల్లా | ||||||||||
82 | హంగల్ | సీఎం ఉదాసి | బీజేపీ | 80,529 | శ్రీనివాస్ మానె | కాంగ్రెస్ | 74,015 | 6,514 | ||
83 | షిగ్గావ్ | బసవరాజ్ బొమ్మై | బీజేపీ | 83,868 | అజీమ్‌పీర్ ఖాద్రీ అన్నారు | కాంగ్రెస్ | 74,603 | 9,265 | ||
84 | హావేరి (ఎస్.సి) | నెహారు ఓలేకర్ | బీజేపీ | 86,565 | రుద్రప్ప లమాని | కాంగ్రెస్ | 75,261 | 11,304 | ||
85 | బైడ్గి | బళ్లారి విరూపాక్షప్ప రుద్రప్ప | బీజేపీ | 91,721 | SR పాటిల్ | కాంగ్రెస్ | 70,450 | 21,271 | ||
86 | హీరేకెరూరు | బీసీ పాటిల్ | కాంగ్రెస్ | 72,461 | యుబి బనకర్ | బీజేపీ | 71,906 | 555 | ||
87 | రాణేబెన్నూరు | ఆర్. శంకర్ | KPJP | 63,910 | KB కోలివాడ్ | కాంగ్రెస్ | 59,572 | 4,338 | ||
బళ్లారి జిల్లా | ||||||||||
88 | హడగలి (ఎస్.సి) | పిటి పరమేశ్వర నాయక్ | కాంగ్రెస్ | 54,097 | ఓడో గంగప్ప | Ind | 44,919 | 9,178 | ||
89 | హగరిబొమ్మనహళ్లి (ఎస్.సి) | LBP బీమా నాయక్ | కాంగ్రెస్ | 78,337 | కె.నేమిరాజా నాయక్ | బీజేపీ | 71,105 | 7,232 | ||
90 | విజయనగర | ఆనంద్ సింగ్ | కాంగ్రెస్ | 83,214 | హెచ్ ఆర్ గవియప్ప | బీజేపీ | 74,986 | 8,228 | ||
91 | కంప్లి (ఎస్.టి) | జెఎన్ గణేష్ | కాంగ్రెస్ | 80,592 | టిహెచ్ సురేష్ బాబు | బీజేపీ | 75,037 | 5,555 | ||
92 | సిరుగుప్ప (ఎస్.టి) | ఎంఎస్ సోమలింగప్ప | బీజేపీ | 82,546 | బి. మురళీ కృష్ణ | కాంగ్రెస్ | 61,275 | 21,271 | ||
93 | బళ్లారి సిటీ (ఎస్.టి) | బి. నాగేంద్ర | కాంగ్రెస్ | 79,186 | సన్న పక్కిరప్ప | బీజేపీ | 76,507 | 2,679 | ||
94 | బళ్లారి సిటీ | జి. సోమశేఖర రెడ్డి | బీజేపీ | 76,589 | అనిల్ లాడ్ | కాంగ్రెస్ | 60,434 | 16,155 | ||
95 | సండూర్ (ఎస్.టి) | ఇ. తుకారాం | కాంగ్రెస్ | 78,106 | డి రాఘవేంద్ర మంజు | బీజేపీ | 64,096 | 14,010 | ||
96 | కుడ్లగి (ఎస్.టి) | NY గోపాలకృష్ణ | బీజేపీ | 50,085 | NT బొమ్మన్న | జేడీఎస్ | 39,272 | 10,813 | ||
చిత్రదుర్గ జిల్లా | ||||||||||
97 | మొలకాల్మూరు (ఎస్.టి) | బి. శ్రీరాములు | బీజేపీ | 84,018 | డా. బి. యోగేష్ బాబు | కాంగ్రెస్ | 41,973 | 42,045 | ||
98 | చల్లకెరె (ఎస్.టి) | టి. రఘుమూర్తి | కాంగ్రెస్ | 72,874 | రవీష్ కుమార్ | జేడీఎస్ | 59,335 | 13,539 | ||
99 | చిత్రదుర్గ | జీహెచ్ తిప్పారెడ్డి | బీజేపీ | 82,896 | కెసి వీరేంద్ర | జేడీఎస్ | 49,911 | 32,985 | ||
100 | హిరియూరు | కె. పూర్ణిమ | బీజేపీ | 77,733 | డి. సుధాకర్ | కాంగ్రెస్ | 64,858 | 12,875 | ||
101 | హోసదుర్గ | గుల్హట్టి డి. శేఖర్ | బీజేపీ | 90,562 | బిజి గోవిందప్ప | కాంగ్రెస్ | 64,570 | 25,992 | ||
102 | హోల్‌కెరె (ఎస్.సి) | ఎం. చంద్రప్ప | బీజేపీ | 107,976 | హెచ్.ఆంజనేయ | కాంగ్రెస్ | 69,036 | 38,940 | ||
దావణగెరె జిల్లా | ||||||||||
103 | జగలూరు (ఎస్.టి) | ఎస్వీ రామచంద్ర | బీజేపీ | 78,948 | HP రాజేష్ | కాంగ్రెస్ | 49,727 | 29,221 | ||
104 | హరపనహళ్లి | జి. కరుణాకర రెడ్డి | బీజేపీ | 67,603 | ఎంపీ రవీంద్ర | కాంగ్రెస్ | 57,956 | 9,647 | ||
105 | హరిహర్ | S. రామప్ప | కాంగ్రెస్ | 64,801 | బీపీ హరీష్ | బీజేపీ | 57,541 | 7,260 | ||
106 | దావణగెరె నార్త్ | SA రవీంద్రనాథ్ | బీజేపీ | 76,540 | ఎస్ఎస్ మల్లికార్జున్ | కాంగ్రెస్ | 72,469 | 4,071 | ||
107 | దావణగెరె సౌత్ | శామనూరు శివశంకరప్ప | కాంగ్రెస్ | 71,369 | యశవంతరావు జాదవ్ | బీజేపీ | 55,485 | 15,884 | ||
108 | మాయకొండ (ఎస్.సి) | ఎన్. లిగన్న | బీజేపీ | 50,556 | కె.ఎస్.బసవరాజ్ | కాంగ్రెస్ | 44,098 | 6,458 | ||
109 | చన్నగిరి | కె. మాదాల్ విరూపాక్షప్ప | బీజేపీ | 73,794 | వడ్నాల్ రాజన్న | కాంగ్రెస్ | 48,014 | 25,780 | ||
110 | హొన్నాళి | ఎంపీ రేణుకాచార్య | బీజేపీ | 80,624 | డిజి శాంతనగౌడ | కాంగ్రెస్ | 76,391 | 4,233 | ||
శివమొగ్గ జిల్లా | ||||||||||
111 | షిమోగా రూరల్ (ఎస్.సి) | KB అశోక్ నాయక్ | బీజేపీ | 69,326 | శారద పూర్నాయక్ | జేడీఎస్ | 65,549 | 3,777 | ||
112 | భద్రావతి | BK సంగమేశ్వర | కాంగ్రెస్ | 75,722 | ఎంజే అప్పాజీ గౌడ్ | జేడీఎస్ | 64,155 | 11,567 | ||
113 | శిమోగా | కేఎస్ ఈశ్వరప్ప | బీజేపీ | 104,027 | KB ప్రసన్న కుమార్ | కాంగ్రెస్ | 57,920 | 46,107 | ||
114 | తీర్థహళ్లి | అరగ జ్ఞానేంద్ర | బీజేపీ | 67,527 | కిమ్మనే రత్నాకర్ | కాంగ్రెస్ | 45,572 | 21,955 | ||
115 | శికారిపుర | బీఎస్ యడ్యూరప్ప | బీజేపీ | 86,983 | గోని మాలతేషా | కాంగ్రెస్ | 51,586 | 35,397 | ||
116 | సోరబ్ | కుమార్ బంగారప్ప | బీజేపీ | 72,091 | మధు బంగారప్ప | జేడీఎస్ | 58,805 | 13,286 | ||
117 | సాగర్ | హర్తాలు హాలప్ప | బీజేపీ | 78,475 | కాగోడు తిమ్మప్ప | కాంగ్రెస్ | 70,436 | 8,039 | ||
ఉడిపి జిల్లా | ||||||||||
118 | బైందూరు | BM సుకుమార్ శెట్టి | బీజేపీ | 96,029 | కె. గోపాల పూజారి | కాంగ్రెస్ | 71,636 | 24,393 | ||
119 | కుందాపుర | హాలడి శ్రీనివాస్ శెట్టి | బీజేపీ | 103,434 | రాకేష్ మల్లి | కాంగ్రెస్ | 47,029 | 56,405 | ||
120 | ఉడిపి | కె. రఘుపతి భట్ | బీజేపీ | 84,946 | ప్రమోద్ మధ్వరాజ్ | కాంగ్రెస్ | 72,902 | 12,044 | ||
121 | కాపు | లాలాజీ మెండన్ | బీజేపీ | 75,893 | వినయ్ కుమార్ సొరకే | కాంగ్రెస్ | 63,976 | 11,917 | ||
122 | కర్కల | వి.సునీల్ కుమార్ | బీజేపీ | 91,245 | H. గోపాల్ భండారి | కాంగ్రెస్ | 48,679 | 42,566 | ||
చిక్కమగళూరు జిల్లా | ||||||||||
123 | శృంగేరి | టీడీ రాజేగౌడ | కాంగ్రెస్ | 62,780 | డిఎన్ జీవరాజ్ | బీజేపీ | 60,791 | 1,989 | ||
124 | ముదిగెరె (ఎస్.సి) | ఎంపీ కుమారస్వామి | బీజేపీ | 58,783 | మోటమ్మ | కాంగ్రెస్ | 46,271 | 12,512 | ||
125 | చిక్‌మగళూరు | సిటి రవి | బీజేపీ | 70,863 | బిఎల్ శంకర్ | కాంగ్రెస్ | 44,549 | 26,314 | ||
126 | తరికెరె | డిఎస్ సురేష్ | బీజేపీ | 44,940 | GH శ్రీనివాస | Ind | 33,253 | 11,687 | ||
127 | కడూర్ | కెఎస్ ప్రకాష్ | బీజేపీ | 62,232 | యస్వీ దత్తా | జేడీఎస్ | 46,860 | 15,372 | ||
తుమకూరు జిల్లా | ||||||||||
128 | చిక్నాయకనహల్లి | జేసీ మధుస్వామి | బీజేపీ | 69,612 | సిబి సురేష్ బాబు | జేడీఎస్ | 59,335 | 10,277 | ||
129 | తిప్తూరు | బిసి నగేష్ | బీజేపీ | 61,383 | కె. షడక్షరి | INC | 35,820 | 25,563 | ||
130 | తురువేకెరె | ఏఎస్ జయరామ్ | బీజేపీ | 60,710 | MT కృష్ణప్ప | జేడీఎస్ | 58,661 | 2,049 | ||
131 | కుణిగల్ | డాక్టర్ హెచ్‌డి రంగనాథ్ | కాంగ్రెస్ | 58,697 | డి. కృష్ణ కుమార్ | బీజేపీ | 53,097 | 5,600 | ||
132 | తుమకూరు సిటీ | జీబీ జ్యోతి గణేష్ | బీజేపీ | 60,421 | ఎన్.గోవిందరాజు | జేడీఎస్ | 55,128 | 5,293 | ||
133 | తుమకూరు రూరల్ | డిసి గౌరీశంకర్ | జేడీఎస్ | 82,740 | బి. సురేష్ గౌడ | బీజేపీ | 77,100 | 5,640 | ||
134 | కొరటగెరె (ఎస్.సి) | డాక్టర్ జి. పరమేశ్వర | కాంగ్రెస్ | 81,598 | పిఆర్ సుధాకర లాల్ | జేడీఎస్ | 73,979 | 7,619 | ||
135 | గుబ్బి | ఎస్ఆర్ శ్రీనివాస్ | జేడీఎస్ | 55,572 | జిఎన్ బెట్టస్వామి | బీజేపీ | 46,491 | 9,081 | ||
136 | సిరా | బి. సత్యనారాయణ | జేడీఎస్ | 74,338 | టిబి జయచంద్ర | కాంగ్రెస్ | 63,973 | 10,365 | ||
137 | పావగడ (ఎస్.సి) | వెంకట రమణప్ప | కాంగ్రెస్ | 72,974 | KM తిమ్మరాయప్ప | జేడీఎస్ | 72,565 | 409 | ||
138 | మధుగిరి | ఎంవీ వీరభద్రయ్య | జేడీఎస్ | 88,521 | ఖ్యాతసండ్ర ఎన్. రాజన్న | కాంగ్రెస్ | 69,947 | 18,574 | ||
చిక్కబళ్లాపుర జిల్లా | ||||||||||
139 | గౌరీబిదనూరు | NH శివశంకర రెడ్డి | కాంగ్రెస్ | 69,000 | సిఆర్ నరసింహమూర్తి | జేడీఎస్ | 59,832 | 9,168 | ||
140 | బాగేపల్లి | ఎస్ ఎన్ సుబ్బారెడ్డి | కాంగ్రెస్ | 65,710 | జివి శ్రీరామరెడ్డి | సిపిఎం | 51,697 | 14,013 | ||
141 | చిక్కబళ్లాపూర్ | కె. సుధాకర్ | కాంగ్రెస్ | 82,006 | కెపి బచ్చెగౌడ | జేడీఎస్ | 51,575 | 30,431 | ||
142 | సిడ్లఘట్ట | వి.మునియప్ప | కాంగ్రెస్ | 76,240 | బిఎన్ రవికుమార్ | జేడీఎస్ | 66,531 | 9,709 | ||
143 | చింతామణి | జేకే కృష్ణారెడ్డి | జేడీఎస్ | 87,753 | డాక్టర్ ఎంసీ సుధాకర్ | BRP | 82,513 | 5,240 | ||
కోలారు జిల్లా | ||||||||||
144 | శ్రీనివాసపూర్ | కెఆర్ రమేష్ కుమార్ | కాంగ్రెస్ | 93,571 | జీకే వెంకటశివారెడ్డి | జేడీఎస్ | 83,019 | 10,552 | ||
145 | ముల్బాగల్ (ఎస్.సి) | హెచ్. నగేష్ | Ind | 74,213 | సమృద్ధి మంజునాథ్ | జేడీఎస్ | 67,498 | 6,715 | ||
146 | కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (ఎస్.సి) | ఎం. రూపకళ | కాంగ్రెస్ | 71,151 | అశ్విని సంపంగి | బీజేపీ | 30,324 | 40,827 | ||
147 | బంగారపేట (ఎస్.సి) | SN నారాయణ స్వామి | కాంగ్రెస్ | 71,171 | ఎం. మల్లేష్ బాబు | జేడీఎస్ | 49,300 | 21,871 | ||
148 | కోలార్ | కె. శ్రీనివాసగౌడ్ | జేడీఎస్ | 82,788 | సయ్యద్ జమీర్ పాషా | కాంగ్రెస్ | 38,537 | 44,251 | ||
149 | మాలూరు | KY నంజేగౌడ | కాంగ్రెస్ | 75,677 | కెఎస్ మంజునాథ్ గౌడ్ | జేడీఎస్ | 57,762 | 17,915 | ||
బెంగళూరు అర్బన్ జిల్లా | ||||||||||
150 | యలహంక | ఎస్ఆర్ విశ్వనాథ్ | బీజేపీ | 120,110 | ఏఎం హనుమంతెగౌడ | జేడీఎస్ | 77,607 | 42,503 | ||
151 | కృష్ణరాజపురం | బైరతి బసవరాజ్ | కాంగ్రెస్ | 135,404 | NS నందీషా రెడ్డి | బీజేపీ | 102,675 | 32,729 | ||
152 | బైటరాయణపుర | కృష్ణ బైరే గౌడ | కాంగ్రెస్ | 114,964 | ఎ రవి | బీజేపీ | 109,293 | 5,671 | ||
153 | యశ్వంత్‌పూర్ | ST సోమశేఖర్ | కాంగ్రెస్ | 115,273 | టీఎన్ జవరాయి గౌడ్ | జేడీఎస్ | 104,562 | 10,711 | ||
154 | రాజరాజేశ్వరినగర్ | మునిరత్న | కాంగ్రెస్ | 108,065 | పి.మునిరాజుగౌడ్ | బీజేపీ | 82,573 | 25,492 | ||
155 | దాసరహల్లి | ఆర్. మంజునాథ | జేడీఎస్ | 94,044 | ఎస్.మునిరాజు | బీజేపీ | 83,369 | 10,675 | ||
156 | మహాలక్ష్మి లేఅవుట్ | కె. గోపాలయ్య | జేడీఎస్ | 88,218 | ఎన్ఎల్ నరేంద్ర బాబు | బీజేపీ | 47,118 | 41,100 | ||
157 | మల్లేశ్వరం | డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్ | బీజేపీ | 83,130 | కెంగల్ శ్రీపాద రేణు | కాంగ్రెస్ | 29,130 | 54,000 | ||
158 | హెబ్బాళ్ | సురేషా BS | కాంగ్రెస్ | 74,453 | YA నారాయణస్వామి | బీజేపీ | 53,313 | 21,140 | ||
159 | పులకేశినగర్ (ఎస్.సి) | అఖండ శ్రీనివాస్ మూర్తి | కాంగ్రెస్ | 97,574 | బి. ప్రసన్న కుమార్ | జేడీఎస్ | 15,948 | 81,626 | ||
160 | సర్వజ్ఞనగర్ | KJ జార్జ్ | కాంగ్రెస్ | 109,955 | ఎంఎన్ రెడ్డి | బీజేపీ | 56,651 | 53,304 | ||
161 | సి. వి. రామన్ నగర్ (ఎస్.సి) | ఎస్. రఘు | బీజేపీ | 58,887 | ఆర్.సంపత్ రాజ్ | కాంగ్రెస్ | 46,660 | 12,227 | ||
162 | శివాజీనగర్ | R. రోషన్ బేగ్ | కాంగ్రెస్ | 59,742 | కట్టా సుబ్రహ్మణ్య నాయుడు | బీజేపీ | 44,702 | 15,040 | ||
163 | శాంతి నగర్ | NA హరిస్ | కాంగ్రెస్ | 60,009 | కె. వాసుదేవమూర్తి | బీజేపీ | 41,804 | 18,205 | ||
164 | గాంధీ నగర్ | దినేష్ గుండు రావు | కాంగ్రెస్ | 47,354 | ఏఆర్ సప్తగిరి గౌడ్ | బీజేపీ | 37,284 | 10,070 | ||
165 | రాజాజీ నగర్ | S. సురేష్ కుమార్ | బీజేపీ | 56,271 | జి. పద్మావతి | కాంగ్రెస్ | 46,818 | 9,453 | ||
166 | గోవింద్రాజ్ నగర్ | వి.సోమన్న | బీజేపీ | 79,135 | ప్రియా కృష్ణ | కాంగ్రెస్ | 67,760 | 11,375 | ||
167 | విజయ్ నగర్ | ఎం. కృష్ణప్ప | కాంగ్రెస్ | 73,353 | హెచ్.రవీంద్ర | బీజేపీ | 70,578 | 2,775 | ||
168 | చామ్‌రాజ్‌పేట | జమీర్ అహ్మద్ ఖాన్ | కాంగ్రెస్ | 65,339 | ఎం లక్ష్మీనారాయణ | బీజేపీ | 32,202 | 33,137 | ||
169 | చిక్‌పేట | ఉదయ్ గరుడాచార్ | బీజేపీ | 57,312 | ఆర్వీ దేవరాజ్ | కాంగ్రెస్ | 49,378 | 7,934 | ||
170 | బసవనగుడి | LA రవి సుబ్రహ్మణ్య | బీజేపీ | 76,018 | కె. బాగేగౌడ | జేడీఎస్ | 38,009 | 38,009 | ||
171 | పద్మనాభనగర్ | ఆర్. అశోక్ | బీజేపీ | 77,868 | వీకే గోపాల్ | జేడీఎస్ | 45,702 | 32,166 | ||
172 | బిటిఎం లేఅవుట్ | రామలింగ రెడ్డి | కాంగ్రెస్ | 67,085 | లల్లేష్ రెడ్డి | బీజేపీ | 46,607 | 20,478 | ||
173 | జయనగర్ | సౌమ్యా రెడ్డి | కాంగ్రెస్ | 54,457 | బిఎన్ ప్రహ్లాద్ | బీజేపీ | 51,568 | 2,889 | ||
174 | మహదేవపుర (ఎస్.సి) | అరవింద్ లింబావళి | బీజేపీ | 141,682 | ఏసీ శ్రీనివాస | కాంగ్రెస్ | 123,898 | 17,784 | ||
175 | బొమ్మనహల్లి | ఎం సతీష్ రెడ్డి | బీజేపీ | 111,863 | సుష్మా రాజగోపాల రెడ్డి | కాంగ్రెస్ | 64,701 | 47,162 | ||
176 | బెంగళూరు సౌత్ | ఎం. కృష్ణప్ప | బీజేపీ | 152,427 | ఆర్కే రమేష్ | కాంగ్రెస్ | 122,068 | 30,359 | ||
177 | అనేకల్ (ఎస్.సి) | బి. శివన్న | కాంగ్రెస్ | 113,894 | ఎ. నారాయణస్వామి | బీజేపీ | 105,267 | 8,627 | ||
బెంగళూరు రూరల్ జిల్లా | ||||||||||
178 | హోస్కోటే | MTB నాగరాజ్ | కాంగ్రెస్ | 98,824 | శరత్ కుమార్ బచ్చెగౌడ | బీజేపీ | 91,227 | 7,597 | ||
179 | దేవనహళ్లి (ఎస్.సి) | నారాయణస్వామి ఎల్‌ఎన్ | జేడీఎస్ | 86,966 | వెంకటస్వామి | కాంగ్రెస్ | 69,956 | 17,010 | ||
180 | దొడ్డబల్లాపూర్ | టి.వెంకటరమణయ్య | కాంగ్రెస్ | 73,225 | బి. మునగౌడ | జేడీఎస్ | 63,280 | 9,945 | ||
181 | నేలమంగళ (ఎస్.సి) | డాక్టర్ కె. శ్రీనవసమూర్తి | జేడీఎస్ | 69,277 | ఆర్.నారాయణస్వామి | కాంగ్రెస్ | 44,956 | 24,321 | ||
రామనగర జిల్లా | ||||||||||
182 | మగడి | ఎ. మంజునాథ్ | జేడీఎస్ | 119,492 | హెచ్ సి బాలకృష్ణ | కాంగ్రెస్ | 68,067 | 51,425 | ||
183 | రామనగర | హెచ్‌డి కుమారస్వామి | జేడీఎస్ | 92,626 | HA ఇక్బాల్ హుస్సేన్ | కాంగ్రెస్ | 69,990 | 22,636 | ||
184 | కనకపుర | డీకే శివకుమార్ | కాంగ్రెస్ | 127,552 | నారాయణ గౌడ | జేడీఎస్ | 47,643 | 79,909 | ||
185 | చన్నపట్న | హెచ్‌డి కుమారస్వామి | జేడీఎస్ | 87,995 | సీపీ యోగేశ్వర | బీజేపీ | 66,465 | 21,530 | ||
మాండ్య జిల్లా | ||||||||||
186 | మలవల్లి (ఎస్.సి) | డాక్టర్ కె. అన్నదాని | జేడీఎస్ | 103,038 | పీఎం నరేంద్రస్వామి | కాంగ్రెస్ | 76,278 | 26,760 | ||
187 | మద్దూరు | డిసి తమ్మన్న | జేడీఎస్ | 109,239 | మధు జి మాదేగౌడ | కాంగ్రెస్ | 55,209 | 54,030 | ||
188 | మేలుకోటే | సీఎస్ పుట్టరాజు | జేడీఎస్ | 96,003 | దర్శన్ పుట్టన్నయ్య | SA | 73,779 | 22,224 | ||
189 | మాండ్య | ఎం. శ్రీనివాస్ | జేడీఎస్ | 69,421 | పి.రవికుమార్ | కాంగ్రెస్ | 47,813 | 21,608 | ||
190 | శ్రీరంగపట్టణ | రవీంద్ర శ్రీకాంతయ్య | జేడీఎస్ | 101,307 | ఏబీ రమేశ బండిసిద్దెగౌడ | కాంగ్రెస్ | 57,619 | 43,688 | ||
191 | నాగమంగళ | సురేష్ గౌడ | జేడీఎస్ | 112,396 | ఎన్ చలువరాయ స్వామి | కాంగ్రెస్ | 64,729 | 47,667 | ||
192 | కృష్ణరాజపేట | నారాయణ గౌడ | జేడీఎస్ | 88,016 | KB చంద్రశేఖర్ | కాంగ్రెస్ | 70,897 | 17,119 | ||
హాసన్ జిల్లా | ||||||||||
193 | శ్రావణబెళగొళ | సిఎన్ బాలకృష్ణ | జేడీఎస్ | 105,516 | సీఎస్ పుట్టెగౌడ | కాంగ్రెస్ | 52,504 | 53,012 | ||
194 | అర్సికెరె | KM శివలింగే గౌడ | జేడీఎస్ | 93,986 | జిబి శశిధర | కాంగ్రెస్ | 50,297 | 43,689 | ||
195 | బేలూర్ | కెఎస్ లింగేశ | జేడీఎస్ | 64,268 | HK సురేష్ | బీజేపీ | 44,578 | 19,690 | ||
196 | హసన్ | ప్రీతం జె. గౌడ | బీజేపీ | 63,348 | హెచ్ఎస్ ప్రకాష్ | జేడీఎస్ | 50,342 | 13,006 | ||
197 | హోలెనరసిపూర్ | హెచ్‌డి రేవణ్ణ | జేడీఎస్ | 108,541 | బిపి మంజేగౌడ | కాంగ్రెస్ | 64,709 | 43,832 | ||
198 | అర్కలగూడ | AT రామస్వామి | జేడీఎస్ | 85,064 | ఎ. మంజు | కాంగ్రెస్ | 74,411 | 10,653 | ||
199 | సకలేష్‌పూర్ (ఎస్.సి) | హెచ్‌కే కుమారస్వామి | జేడీఎస్ | 62,262 | సోమశేఖర్ జయరాజ్ | బీజేపీ | 57,320 | 4,942 | ||
దక్షిణ కన్నడ | ||||||||||
200 | బెల్తంగడి | హరీష్ పూంజా | బీజేపీ | 98,417 | కె. వసంత బంగేరా | కాంగ్రెస్ | 75,443 | 22,974 | ||
201 | మూడబిద్రి | ఉమానాథ కోటియన్ | బీజేపీ | 87,444 | అభయచంద్ర జైన్ | కాంగ్రెస్ | 57,645 | 29,799 | ||
202 | మంగుళూరు సిటీ నార్త్ | భరత్ శెట్టి | బీజేపీ | 98,648 | మొహియుద్దీన్ బావ | కాంగ్రెస్ | 72,000 | 26,648 | ||
203 | మంగళూరు సిటీ సౌత్ | డి. వేదవ్యాస్ కామత్ | బీజేపీ | 86,545 | జాన్ రిచర్డ్ లోబో | కాంగ్రెస్ | 70,470 | 16,075 | ||
204 | మంగళూరు | UT ఖాదర్ | కాంగ్రెస్ | 80,813 | సంతోష్ కుమార్ రాయ్ బోలియారు | బీజేపీ | 61,074 | 19,739 | ||
205 | బంట్వాల్ | యు రాజేష్ నాయక్ | బీజేపీ | 97,802 | రామనాథ్ రాయ్ | INC | 81,831 | 15,971 | ||
206 | పుత్తూరు | సంజీవ మతాండూరు | బీజేపీ | 90,073 | శకుంతల టి.శెట్టి | కాంగ్రెస్ | 70,596 | 19,477 | ||
207 | సుల్లియా (ఎస్.సి) | అంగర ఎస్. | బీజేపీ | 95,205 | డాక్టర్ బి. రఘు | కాంగ్రెస్ | 69,137 | 26,068 | ||
కొడగు జిల్లా | ||||||||||
208 | మడికేరి | అప్పచు రంజన్ | బీజేపీ | 70,631 | బిఎ జీవిజయ | జేడీఎస్ | 54,616 | 16,015 | ||
209 | విరాజపేట | కెజి బోపయ్య | బీజేపీ | 77,944 | అరుణ్ మచ్చయ్య | కాంగ్రెస్ | 64,591 | 13,353 | ||
మైసూర్ జిల్లా | ||||||||||
210 | పెరియపట్న | కె. మహదేవ | జేడీఎస్ | 77,770 | కె. వెంకటేష్ | కాంగ్రెస్ | 70,277 | 7,493 | ||
211 | కృష్ణరాజనగర | ఎస్ఆర్ మహేష్ | జేడీఎస్ | 85,011 | డి రవిశంకర్ | కాంగ్రెస్ | 83,232 | 1,779 | ||
212 | హున్సూరు | అడగూర్ హెచ్.విశ్వనాథ్ | జేడీఎస్ | 91,667 | HP మంజునాథ్ | కాంగ్రెస్ | 83,092 | 8,575 | ||
213 | హెగ్గడదేవన్‌కోటే (ఎస్.టి) | సి. అనిల్ కుమార్ | కాంగ్రెస్ | 76,652 | చిక్కన్న | జేడీఎస్ | 54,559 | 22,093 | ||
214 | నంజన్‌గూడు (ఎస్.సి) | హర్షవర్ధన్ బి. | బీజేపీ | 78,030 | కలలే ఎన్.కేశవమూర్తి | కాంగ్రెస్ | 65,551 | 12,479 | ||
215 | చాముండేశ్వరి | జి.టి. దేవెగౌడ | జేడీఎస్ | 121,325 | సిద్ధరామయ్య | కాంగ్రెస్ | 85,283 | 36,042 | ||
216 | కృష్ణరాజు | SA రామదాస్ | బీజేపీ | 78,573 | MK సోమశేఖర్ | కాంగ్రెస్ | 52,226 | 26,347 | ||
217 | చామరాజ | ఎల్. నాగేంద్ర | బీజేపీ | 51,683 | వాసు | కాంగ్రెస్ | 36,747 | 14,936 | ||
218 | నరసింహరాజు | తన్వీర్ సైత్ | కాంగ్రెస్ | 62,268 | సందేశ్ స్వామి | బీజేపీ | 44,141 | 18,127 | ||
219 | వరుణ | యతీంద్ర సిద్ధరామయ్య | కాంగ్రెస్ | 96,435 | టి.బసవరాజు | బీజేపీ | 37,819 | 58,616 | ||
220 | టి. నరసిపూర్ (ఎస్.సి) | ఎం. అశ్విన్ కుమార్ | జేడీఎస్ | 83,929 | హెచ్.సి. మహదేవప్ప | కాంగ్రెస్ | 55,451 | 28,478 | ||
చామరాజనగర్ జిల్లా | ||||||||||
221 | హనూర్ | ఆర్. నరేంద్ర | కాంగ్రెస్ | 60,444 | డా. ప్రీతన్ నాగప్ప | బీజేపీ | 56,931 | 3,513 | ||
222 | కొల్లెగల్ (ఎస్.సి) | ఎన్. మహేష్ | BSP | 71,792 | ఎ.ఆర్. కృష్ణమూర్తి | కాంగ్రెస్ | 52,338 | 19,454 | ||
223 | చామరాజనగర్ | సి. పుట్టరంగశెట్టి | కాంగ్రెస్ | 75,963 | KR మల్లికార్జునప్ప | బీజేపీ | 71,050 | 4,913 | ||
224 | గుండ్లుపేట | సీ.ఎస్. నిరంజన్ కుమార్ | బీజేపీ | 94,151 | గీతా మహదేవప్రసాద్ | కాంగ్రెస్ | 77,467 | 16,684 |
ఉప ఎన్నిక
[మార్చు]S. No | నియోజకవర్గం నెం. | తేదీ | నియోజకవర్గం | ఎన్నికల ముందు ఎమ్మెల్యే | పార్టీ | ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు | పార్టీ |
---|---|---|---|---|---|---|---|
1 | 21 | 6-నవంబరు-2018 | జమఖండి | సిద్దు న్యామగౌడ | కాంగ్రెస్ | ఆనంద్ న్యామగౌడ | INC |
2 | 183 | 6-నవంబరు-2018 | రామనగర | హెచ్‌డి కుమారస్వామి | జేడీఎస్ | అనిత కుమారస్వామి | జేడీఎస్ |
3 | 70 | 23-ఏప్రిల్-2019 | కుండ్గోల్ | సిఎస్ శివల్లి | కాంగ్రెస్ | కుసుమ శివల్లి | INC |
4 | 42 | 23-ఏప్రిల్-2019 | చించోలి | ఉమేష్ జాదవ్ | కాంగ్రెస్ | అవినాష్ జాదవ్ | బీజేపీ |
5 | 3 | 5-డిసెంబరు-2019 | అథని | మహేష్ కుమతల్లి | కాంగ్రెస్ | మహేష్ కుమతల్లి | బీజేపీ |
6 | 4 | 5-డిసెంబరు-2019 | కాగ్వాడ్ | శ్రీమంత్ పాటిల్ | కాంగ్రెస్ | శ్రీమంత్ పాటిల్ | బీజేపీ |
7 | 9 | 5-డిసెంబరు-2019 | గోకాక్ | రమేష్ జార్కిహోళి | కాంగ్రెస్ | రమేష్ జార్కిహోళి | బీజేపీ |
8 | 81 | 5-డిసెంబరు-2019 | ఎల్లాపూర్ | శివరామ్ హెబ్బార్ | కాంగ్రెస్ | శివరామ్ హెబ్బార్ | బీజేపీ |
9 | 86 | 5-డిసెంబరు-2019 | హిరేకెరూరు | బీసీ పాటిల్ | కాంగ్రెస్ | బీసీ పాటిల్ | బీజేపీ |
10 | 90 | 5-డిసెంబరు-2019 | విజయనగరం | ఆనంద్ సింగ్ | కాంగ్రెస్ | ఆనంద్ సింగ్ | బీజేపీ |
11 | 141 | 5-డిసెంబరు-2019 | చిక్కబళ్లాపూర్ | కె. సుధాకర్ | కాంగ్రెస్ | డాక్టర్ కె. సుధాకర్ | బీజేపీ |
12 | 151 | 5-డిసెంబరు-2019 | KR పురం | బైరతి బసవరాజ్ | కాంగ్రెస్ | బైరతి బసవరాజ్ | బీజేపీ |
13 | 153 | 5-డిసెంబరు-2019 | యశ్వంతపుర | ST సోమశేఖర్ | కాంగ్రెస్ | ST సోమశేఖర్ | బీజేపీ |
14 | 87 | 5-డిసెంబరు-2019 | రాణిబెన్నూరు | ఆర్. శంకర్ | కాంగ్రెస్ | అరుణ్‌కుమార్ గుత్తూరు | బీజేపీ |
15 | 156 | 5-డిసెంబరు-2019 | మహాలక్ష్మి లేఅవుట్ | కె. గోపాలయ్య | జేడీఎస్ | కె. గోపాలయ్య | బీజేపీ |
16 | 192 | 5-డిసెంబరు-2019 | కృష్ణరాజపేట | నారాయణ గౌడ | జేడీఎస్ | నారాయణ గౌడ | బీజేపీ |
17 | 212 | 5-డిసెంబరు-2019 | హున్సూర్ | ఏహెచ్ విశ్వనాథ్ | జేడీఎస్ | HP మంజునాథ్ | INC |
18 | 162 | 5-డిసెంబరు-2019 | శివాజీనగర్ | R. రోషన్ బేగ్ | కాంగ్రెస్ | రిజ్వాన్ అర్షద్ | INC |
19 | 178 | 5-డిసెంబరు-2019 | హోసకోటే | MTB నాగరాజ్ | కాంగ్రెస్ | శరత్ బచ్చెగౌడ | Ind |
20 | 136 | 3-నవంబరు-2020 | సిరా | బి సత్యనారాయణ | జేడీఎస్ | రాజేష్ గౌడ్ | బీజేపీ |
21 | 154 | 3-నవంబరు-2020 | రాజరాజేశ్వరి నగర్ | మునిరత్న | కాంగ్రెస్ | మునిరత్న | బీజేపీ |
22 | 47 | 17-ఏప్రిల్-2021 | బసవకల్యాణ్ | బి. నారాయణరావు | కాంగ్రెస్ | శరణు సాలగర్ | బీజేపీ |
23 | 59 | 17-ఏప్రిల్-2021 | మాస్కీ | ప్రతాపగౌడ పాటిల్ | కాంగ్రెస్ | బసంగౌడ తుర్విహాల్ | INC |
24 | 33 | 30-అక్టోబరు-2021 | సిందగి | మల్లప్ప మనగూళి | జేడీఎస్ | రమేష్ భూసనూర్ | బీజేపీ |
25 | 82 | 30-అక్టోబరు-2021 | హంగల్ | సీఎం ఉదాసి | బీజేపీ | శ్రీనివాస్ మానె | INC |
మూలాలు
[మార్చు]- ↑ "Karnataka election highlights rural-urban divide: State witnesses highest voter turnout, but Bengaluru stays away" (in English). Firstpost. Retrieved 16 May 2018.
The 72.13 percent voter turnout for the Karnataka Assembly elections has broken all records and is the highest recorded in the state since the 1952 polls, Chief Electoral Officer Sanjeev Kumar said on Saturday.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Election commission's statistical report on general elections, 2013 to the legislative assembly of Karnataka" (PDF).
- ↑ "Picked Karnataka poll date from Times Now TV: BJP's IT cell head Amit Malviya tells EC". The New Indian Express. Retrieved 2018-04-14.
- ↑ "Who should get first call to form govt in Karnataka? Jury's out". The Times of India. 16 May 2018. Retrieved 16 May 2018.
- ↑ "Election Commission sets up panel to probe leak of Karnataka poll date". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-03-27. Retrieved 2018-04-14.
- ↑ "Karnataka poll date leak: EC probe panel to probe media, not Amit Malviya". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-03-29. Retrieved 2018-04-14.
- ↑ "Karnataka Poll Date Was Speculation, Not Leak: Election Commission Committee". NDTV.com. Retrieved 2018-04-14.
- ↑ http://www.thehindu.com/elections/karnataka-2018/over-9000-voter-id-cards-unearthed/article23817906.ece
- ↑ Poovanna, Sharan (3 November 2017). "Amit Shah launches BJP's Karnataka election campaign in Bengaluru". Mint. Retrieved 3 February 2018.
- ↑ "In Karnataka, PM Modi addresses crowd of 2 lakh, says 'naked dance of mafia' in Sidda regime". The Times of India. 5 February 2018. Retrieved 6 February 2018.
- ↑ "BJP Launches 14-Day 'Protect Bengaluru March'". ndtv.com. Press Trust of India. 2 March 2018. Archived from the original on 3 March 2018. Retrieved 3 March 2018.
- ↑ Poovanna, Sharan (8 December 2017). "How Karnataka Congress is trying to micromanage 2018 assembly elections". Mint. Retrieved 3 February 2018.
- ↑ "Karnataka Exit Poll: IndiaTV-VMR predicts fractured mandate; Congress and BJP in neck-and-neck fight". 12 May 2018.
- ↑ "Karnataka Elections 2018: Jan Ki Baat's Exit Poll Says The BJP Will Emerge As The Single Largest Party". 12 May 2018.
- ↑ "BJP close to majority in Karnataka, may get 110 seats: ABP News exit poll". 12 May 2018. Archived from the original on 15 మే 2018. Retrieved 17 మే 2018.
- ↑ "TIMES NOW-VMR Exit Poll prediction". 12 May 2018.
- ↑ "Karnataka Assembly Elections 2018 - Post Poll Analysis". 12 May 2018. Archived from the original on 15 మే 2018. Retrieved 17 మే 2018.
- ↑ "Assembly Election 2018 - Karnataka". 12 May 2018. Archived from the original on 17 మే 2018. Retrieved 17 మే 2018.
- ↑ "NewsX-CNX exit poll 2018: A hung Karnataka Assembly with BJP as the single largest party". 12 May 2018. Archived from the original on 13 మే 2018. Retrieved 17 మే 2018.
- ↑ "Karnataka election 2018: What exit polls can't settle, May 15 will; updates". 12 May 2018.
- ↑ "రేపే కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష".[permanent dead link]
- ↑ "అంతకు ముందు సుప్రీం కోర్టులో ఏం జరిగింది?".
- ↑ ವಿಶ್ವಾಸಮತ ಯಾಚಿಸದೆ ರಾಜೀನಾಮೆ ನೀಡಿದ ಯಡಿಯೂರಪ್ಪ; 19 May, 2018
- ↑ "కర్నాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం". Archived from the original on 2018-05-27. Retrieved 2018-06-03.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.